Intinti Ramayanam Today Episode july 24th : నిన్నటి ఎపిసోడ్ లో.. ప్రణతికి వేరే అబ్బాయితో పెళ్లి చేసేందుకు పల్లవి, పార్వతి ప్లాన్ చేస్తారు. అందుకే షష్ఠి పూర్తి ప్లాన్ చేస్తారు. ఈ విషయాన్ని కమల్ తో చెప్తారు.. అవని వదిన నాన్న మళ్ళీ ఇంటికి వస్తారంటే మేము ఏదైనా చేస్తామని హడావిడి చేస్తారు శ్రీకర్, కమల్. ఈ విషయాన్ని వెంటనే వదిలేసి చెప్పాలని కమల్ ఫోన్ చేస్తాడు. వదిన నీకు గుడ్ న్యూస్ అమ్మ నిన్ను నాన్నని షష్టిపూర్తికి పిలవాలని అనుకుంటుంది. అంటే మళ్ళీ మనకు మంచి రోజులు వచ్చాయి. మనమందరం కలిసి ఉండే రోజులు వచ్చాయి అని అంటాడు. అదేంటి షష్టిపూర్తి ఏంటి అని అవని అంటుంది. అన్నయ్య బామ్మ అక్కడ చూస్తే మళ్ళీ గొడవ చేస్తుంది. ఈ విషయాన్ని అవని రాజేంద్రప్రసాద్ తో చెప్తుంది. ఉదయం లేవగానే అక్షయ్ కు భానుమతి కాఫీ ఇస్తుంది. పల్లవి పార్వతి ఇద్దరూ వచ్చి షష్టిపూర్తి గురించి మాట్లాడుతారు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. రాజేంద్ర ప్రసాద్ చెప్పడంతో అవనిని గట్టిగా పిలుస్తుంది పార్వతి.. అత్తయ్య గారు మీరేంటి ఇలా వచ్చారు అని అవని అంటుంది. మీ మావయ్యతో నేను షష్టిపూర్తి చేసుకోవాలని అనుకుంటున్నాను. నువ్వు మీ తమ్ముడు ప్రణతి అందరూ కలిసి రావాలి అని పిలుస్తుంది. మీరు ఇంతగా పిలిస్తే రాకుండా ఎలా ఉంటాం అత్తయ్య కచ్చితంగా వస్తాము అని అవని అంటుంది. ఇదంతా చేసుకునేది నా కూతురు కోసమే అని పార్వతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత అక్షయ్ దగ్గరికి వెళ్లిన పార్వతి రేపే కదా ఫంక్షన్ వెళ్దాం పదండి అని అంటుంది.
భానుమతి ఫంక్షన్ రేపే కదా నేను మీతో పాటు రావడానికి బ్యాగు సర్దుకున్నాను అని అంటుంది. అక్షయ్ మాత్రం నేను ఆ ఇంటికి రానని తెలుసు కదా.. ఏదైనా ఫంక్షన్ హాల్లో ఫంక్షన్ పెట్టుకోవచ్చు కదా అని అంటాడు.. పార్వతి దానికి బడ్జెట్ లేదు కదరా అందుకే అలా చేశాము రేపు నువ్వు తప్పకుండా రావాలని పార్వతి పిలుస్తుంది.. మేము వస్తాము అత్తయ్య అని అంటుంది. ఇక కమ్మలు శ్రీకరు ఇద్దరు అమ్మ వదిన దగ్గరికి వెళ్లింది ఇంకా రాలేదేంటి అని ఆలోచిస్తూ ఉంటారు.
అమ్మ వదిన దగ్గరికి వెళ్ళింది కదా ఖచ్చితంగా చెప్పే ఉంటుంది.. వస్తాననిందో రాదనిందో అని ఇద్దరు టెన్షన్ పడుతూ ఉంటారు. శ్రియ రేపు జరిగే ఫంక్షన్ కన్నా మీ వదిన వస్తుందో రాదో అని టెన్షన్ పడుతున్నారని అడుగుతుంది.. అంటే మీ కళ్ళకి మేము మనుషుల్లాగా కనిపించట్లేదా అని శ్రేయ అడుగుతుంది.. దానికి శ్రీకర్ మీరు మనుషులు కానీ మా వదిన మాత్రం దేవత అని అంటాడు. ఇక అప్పుడే పల్లవి పార్వతీ భానుమతి ఇంటికి వస్తారు..
ఏమైంది ఇంత లేట్ అయింది ఏంటి వదిన వస్తాననిందా? రానని అందా అని కమల్ అడుగుతాడు. మీ వదిన వస్తానని చెప్పింది లేరా నువ్వు ఇప్పుడు సంతోషంగానే ఉన్నావు కదా అని పార్వతి అడుగుతుంది. ఈ విషయం చెప్పగానే మీ వదిన మొహం చాటు అంత అయింది అని పల్లవి అంటుంది. పల్లవికి దిమ్మ తిరిగిపోయేలా సమాధానం చెప్తాడు.. ఆ తర్వాత భానుమతితో ఒక ఆట ఆడుకుంటాడు..
రాత్రి అయిన తర్వాత భానుమతి తన భర్త కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఏమైంది ఎవరికోసం వెయిట్ చేస్తున్నావు అని కమల్ అడుగుతాడు. ఇంకెవరి కోసం మీ తాత కోసం.. అక్కడునుంటే మీ తాత రోజు వచ్చేవాడు కానీ ఇక్కడ వస్తాడో రాడో అని బాధపడుతున్నాను రా అని అంటుంది.. తాతయ్య నాతో మాట్లాడినప్పుడు ఒక విభూది ఇచ్చాడు అది పెట్టుకుని తాతయ్యని పిలిస్తే వస్తాడు ఇదిగో నువ్వు ఇలా ఈ మొహానికి మొత్తం రాసేసుకో కచ్చితంగా నా మొగుడు రావాలి అని గట్టిగా కోరుకో నీ ముందు ప్రత్యక్షమవుతాడు అని అంటాడు.
Also Read:అత్తింటికి వచ్చేసిన శృతి, రవి.. మీనాను తిట్టిన ప్రభావతి..కేక్ కట్టింగ్ తో సంబరాలు..
కమల్ అన్నట్లే కాసేపట్లో భానుమతి ఎదురుగా కమలాకర్ వచ్చి నిలబడతాడు. అక్షయ అవనీల గురించి అడిగి ఒళ్ళు వాయించేస్తాడు. వాళ్ళిద్దరూ కలిసేలా చేయమని చెప్పాను కదా మరి దూర దూరంగా ఉన్నారు అంటావేంటి అని దారుణంగా కొట్టేస్తాడు. అక్షయ దగ్గరికి ఆరాధ్య వచ్చి అమ్మానాన్న కూడా దండలు మార్చుకుంటే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను నాన్న అని అంటుంది. ఆ మాట వినగానే అక్షయ్ అవని పై సీరియస్ అవుతాడు. ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..