Bhainsa ACB: అధికారికంగా సహాయ పడేందుకు లంచం తీసుకున్న ఇన్ ఛార్జ్ మున్సిపల్ కమిషనర్ ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. నిర్మల్ జిల్లా భైంసా మున్సిపాలిటీ కార్యాలయంలో జాదవ్ సంతోష్ డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్. ప్రస్తుతం ఇన్ ఛార్జ్ మున్సిపల్ కమిషనర్ గా వ్యవహరిస్తున్నాడు.
ఓ కాంట్రాక్టర్ పూర్తి చేసిన సివిల్ పనులకు సంబంధించి అతనికి డబ్బు చెల్లించాల్సి ఉంది. ఈ బిల్లులు మంజూరు చేయటానికిగాను సంతోష్ జాదవ్ లంచం 60వేల రూపాయలు లంచంగా డిమాండ్ చేశాడు. గతనెల 26న పదివేల రూపాయలు లంచంగా తీసుకుని 6.40లక్షల బిల్లు మంజూరు చేశాడు. మిగితా 2.63బిల్లు మంజూరు చేయటానికిగాను 50వేలు డిమాండ్ చేశాడు.
ఈ మేరకు సమాచారం అందగా వలపన్నిన ఆదిలాబాద్ రేంజ్ ఏసీబీ అధికారులు మంగళవారం జాదవ్ సంతోష్ లంచం తీసుకుంటుండగా దాడి చేసి పట్టుకున్నారు. అతని నుంచి లంచంగా తీసుకున్న 50వేల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
Also read: కూతుర్ని చూడగానే కన్నీళ్లు పెట్టుకున్న వంశీ.. బిగ్ బాస్ హౌస్ లో ఎమోషనల్ సీన్స్!