E-Paper
Advertisement

బక్కచిక్కిన తమ్మిడికుంట చెరువుకు పూర్వ వైభవం.. రూ.20 కోట్లతో సుందరీకరణ!

బక్కచిక్కిన తమ్మిడికుంట చెరువుకు పూర్వ వైభవం.. రూ.20 కోట్లతో సుందరీకరణ!
Advertisement

Thammidikunta Lake: రంగారెడ్డి జిల్లా శేరిలింగంప‌ల్లి మండ‌లం మాధాపూర్‌లోని శిల్పారామం ఎదురుగా కబ్జాల కోరల్లో చిక్కుకుని బక్క చిక్కిన తమ్మిడికుంట చెరువుకు హైడ్రా ప్రాణం పోసింది. రూ.20 కోట్ల వ్యయంతో హైడ్రా ఎంతో ముందు చూపుతో పున‌రుద్ధ‌రించిన ఈ చెరువును ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి బుధవారం సాయంత్రం తన చేదుల మీదుగా ప్రారంభించి, ప్రజలకు అంకితమిచ్చేందుకు హైడ్రా ఏర్పాట్లు చేసింది. హైడ్రా మొద‌టి విడ‌త చేప‌ట్టిన 6 చెరువుల్లో త‌మ్మిడికుంట ఒక‌టి.

హైడ్రా ఎంతో అందం..

పాత‌బ‌స్తీలోని బమ్ రుకున్ ఉద్ దౌలా చెరువు, అంబ‌ర్‌పేట‌లోని బ‌తుక‌మ్మ‌కుంట, కూక‌ట్‌ప‌ల్లి న‌ల్ల చెరువును ఇప్ప‌టికే ముఖ్య‌మంత్రి ప్రారంభించిన సంగతి తెల్సిందే. తాజాగా హైడ్రా ఎంతో అందంగా, ఆకర్షనీయంగా, ఆహ్లాదకరంగా తీర్చిదిద్దిన త‌మ్మిడికుంటను ముఖ్య‌మంత్రి బుధవారం ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తున్నందున, పరిసర ప్రాంతాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. హైడ్రా పునరుద్దరించిన మరో రెండు చెరువులు మాధాపూర్‌లోని సున్నం చెరువుతో పాటు ఉప్ప‌ల్‌లోని న‌ల్ల‌ చెరువును కూడా సీఎం ప్రారంభించనున్నారు.

Advertisement

Also Read: ఏసీబీకి రెడ్ హ్యండెడ్‌గా చిక్కిన​ మున్సిపల్​ కమిషనర్​!

ఎన్ క‌న్వెన్ష‌న్‌తో..

ఆక్రమణల చెర నుంచి బయటపడి ఓ చెరువు మళ్లీ తన పూర్వ వైభవాన్ని సంతరించుకోవడంతో పాటు వర్షం కురిసినపుడు ఈ చెరువు చుట్టున్న పలు ప్రాంతాలు వరద ముంపునకు గురవుతున్న విషయాన్ని గుర్తించిన హైడ్రా వరద నీరు ఈ చెరువులోకి వెళ్లేలా ఇన్ లెట్లను ఏర్పాటు చేయటంతో పలు ప్రాంతాలకు వరద ముప్పు తప్పింది. దాదాపు 30 ఎక‌రాలున్న ఈ చెరువు ఆక్ర‌మ‌ణ‌ల‌కు గురై కేవ‌లం 14 ఎకరాల‌కు ప‌రిమిత‌మైనట్లు హైడ్రా గుర్తించింది. ఎన్ క‌న్వెన్ష‌న్‌తో పాటు చెరువు చుట్టూ ఆక్ర‌మ‌ణ‌లు తొల‌గించ‌డంతో 16 ఎక‌రాల విస్తీర్ణం పెరిగింది. ఇలా ఈ చెరువును హైడ్రా రెండింతలు అంటే ఏకంగా 30 ఎక‌రాల‌కు విస్త‌రించింది.

మాదాపూర్ ప్రాంతంలో..

Advertisement

15 అడుగుల లోతున వందల వేల లారీల పూడికను హైడ్రా తొలగించింది. ఎల్ నినో ప్రభావం ఉన్నా, ఇటీవల కురిసిన ఒకటి రెండు వర్షాలకు చేరిన నీరు పెద్దమొత్తంలో భూమి లోకి ఇంకిపోయి భూగర్భ జలాలను పెంచిది. భూమి ధర గ‌జానికి రూ. ల‌క్ష నుంచి రూ. 2 ల‌క్ష‌లు ప‌లుకుతున్న పైర్ లోకేషన్ అయిన మాదాపూర్ ప్రాంతంలో 15 ఎక‌రాలు అంటే సుమారు రూ.12 వంద‌ల కోట్ల రూపాయల‌కు పైగా విలువైన ఆస్తిని హైడ్రా కాపాడి, ప్రజల ఖాతాలోకి చేర్చింది. అంతేగాక, మున్ముందు ఎలాంటి ఆక్రమణలు, కబ్జాలు రాకుండా పటిష్టపు చర్యలను కూడా చేపట్టింది. చెరువులను కాపాడటం హైడ్రా విధి అయితే, హైడ్రా చర్యలకు సమాంతరంగా పర్యావరణ పరిరక్షణ కూడా జరగటం పట్ల స్థానికులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Also read: ఇజ్రాయెల్‌లో రసవత్తర సమరం.. ప్రధానిగా నెతన్యాహు పనైపోయినట్లేనా..?

Tags

Related News

మహిళల అండాల అక్రమ దందా కేసులో.. కీలక నిందితుడు అరెస్ట్!

ఎమ్మెల్సీ ఎన్నికలపై కల్వకుంట్ల కవిత ధీమా.. కాలం కలిసోచ్చేనా..?

ఏసీబీకి రెడ్ హ్యండెడ్‌గా చిక్కిన​ మున్సిపల్​ కమిషనర్​!

దౌల్తాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యాధికారి ఇష్టారాజ్యం.. అల్లాడిపోతున్న పేద రోగులు!

ట్రైనీ DSPలకు సీఎం రేవంత్ రెడ్డి బంప‌ర్ ఆఫ‌ర్‌?

రాహుల్ పర్యటనను అడ్డుకుంటే.. ఢిల్లీ నుంచి వచ్చే బీజేపీ నేతలను అడ్డుకుంటాం: వీహెచ్ వార్నింగ్!

ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు టీపీసీసీ బిగ్ షాక్.. షోకాజ్ నోటీసులు జారీ?

Big Stories

Advertisement
×