E-Paper
Advertisement

ఎమ్మెల్సీ ఎన్నికలపై కల్వకుంట్ల కవిత ధీమా.. కాలం కలిసోచ్చేనా..?

ఎమ్మెల్సీ ఎన్నికలపై కల్వకుంట్ల కవిత ధీమా.. కాలం కలిసోచ్చేనా..?
Advertisement

Kavitha Politics: TRS పార్టీ ఆవిర్భావం నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిరంతరం పర్యటిస్తున్నారు కల్వకుంట్ల కవిత. సింగరేణి కార్మికులు, ఆదివాసీలు, రైతులు, పెండింగ్ ప్రాజెక్టులు, విద్యార్థులు, టీచర్ల సమస్యలపై స్వయంగా స్పందిస్తూ బాధితులకు సంఘీభావం తెలుపుతున్నారు. ఈ టూర్లలో కవిత చేస్తున్న కామెంట్స్ పాలిటిక్స్‌లో ప్రకంపనలు రేపుతున్నాయి. ఆవిర్భావ టైంలో కేసీఆర్‌పై విమర్శల బాణాలను సంధించిన కవిత ఆ తర్వాత బావ హరీష్‌ రావు, సంతోష్ రావు, సొంత అన్న కేటీఆర్‌పై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే తండ్రి ఇమేజ్‌పై కాకుండా, సొంత బలం ఆధారంగానే పార్టీని నిలబెట్టుకోవాలని కవిత శ్రమిస్తున్నారు.

సింగరేణి ప్రాంతంతో..

వాయిస్- పార్టీ ప్రకటించిన తర్వాత తొలిసారి ఎన్నికల బరిలోకి దిగారు కవిత. రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు ముందే అభ్యర్థులను ప్రకటించిన కవిత.. ప్రచారాన్ని తీవ్రతరం చేశారు. సింగరేణి ప్రాంతంతో పాటు నల్గొండ, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. గ్రాడ్యుయేట్ ఓటర్ల మద్దతును కోరుతున్నారు. శాసనమండలిలో ప్రజల గొంతుకగా మారేందుకు తమ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ఓటర్లు పట్టం కడతారా..

Advertisement

వాయిస్- క్షేత్రస్థాయిలో కవిత పోరాటాలు ఇంకా ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేదంటున్నారు. ప్రజల ఆదరణ దక్కాలన్నా, పార్టీ బలపడాలన్నా పోరాటాల వ్యూహంలో మరిన్ని కీలక మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎండ్ వాయిస్-ఎమ్మెల్సీ బరిలో ఉన్న కవిత పార్టీ తెలంగాణ ఆడబిడ్డగా ప్రజా సమస్యలపై పోరాడుతున్న తనకు ఓటర్లు పట్టం కడతారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రక్షణ సేనను ఒంటరిగా నడిపిస్తున్న ఆమె ప్రయత్నాలు రాబోయే రోజుల్లో ఏ మేర సఫలీకృతమవుతాయో, ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఎలాంటి మలుపు తిప్పుతాయో వేచి చూడాలి.

Also read: సోనియా గాంధీ ఆత్మకథ పుస్తకం పై.. బీజేపీ సీనియర్ నేతలు ఫైర్!

Tags

Related News

ఏసీబీకి రెడ్ హ్యండెడ్‌గా చిక్కిన​ మున్సిపల్​ కమిషనర్​!

దౌల్తాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యాధికారి ఇష్టారాజ్యం.. అల్లాడిపోతున్న పేద రోగులు!

ట్రైనీ DSPలకు సీఎం రేవంత్ రెడ్డి బంప‌ర్ ఆఫ‌ర్‌?

రాహుల్ పర్యటనను అడ్డుకుంటే.. ఢిల్లీ నుంచి వచ్చే బీజేపీ నేతలను అడ్డుకుంటాం: వీహెచ్ వార్నింగ్!

ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు టీపీసీసీ బిగ్ షాక్.. షోకాజ్ నోటీసులు జారీ?

ఓయూ లా కాలేజీ హాస్టల్‌పై వివాదం.. భవనం కూల్చివేతతో విద్యార్థుల ఆగ్రహం!

రెవెన్యూ శాఖ పై తెలంగాణ మానవ హక్కుల కమిషన్ ఫైర్!

Big Stories

Advertisement
×