BigTV English

Opposition Meet: కలిసి పోటీ.. బీజేపీకి విపక్షాల బిగ్ షాక్..

Opposition Meet: కలిసి పోటీ.. బీజేపీకి విపక్షాల బిగ్ షాక్..
Opposition Meet

Opposition Parties Meeting Today(Latest political news in India): విపక్షాలు అనూహ్య నిర్ణయం తీసుకున్నాయి. బీజేపీని గద్దె దింపేందుకు.. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించాయి. జేడీఎస్ చీఫ్ నితీశ్ కుమార్ చొరవతో.. దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ జట్టు కట్టాయి. పట్నాలో విస్తృత కసరత్తు చేశాయి. 2024 ఎన్నికల్లో.. 17 విపక్ష పార్టీలు కలిసి బరిలో దిగాలని.. పరస్పరం సహకరించుకోవాలని.. బీజేపీని ఓడించాలని డిసైడ్ అయ్యాయి. భవిష్యత్‌ కార్యాచరణకు జులైలో సిమ్లాలో మరోసారి సమావేశం కానున్నారు. అయితే, ఈ కీలక భేటీకి ఆప్ అధినేత కేజ్రీవాల్, తమిళనాడు సీఎం స్టాలిన్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌లతో పాటు దేవేగౌడ, మాయావతి తదితరులు హాజరుకాలేదు. బీఆర్ఎస్ బాస్ కేసీఆర్‌కు అసలు ఆహ్వానమే లేదు.


బీజేపీ దాడులను కలిసికట్టుగా ఎదుర్కొంటామని.. తామంతా కలిసి పని చేస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తోందని విమర్శించారు. వచ్చే సమావేశంలో ప్రతిపక్షాల ఐక్యతపై మరింత ముందడుగు వేస్తామన్నారు రాహుల్. దేశ శ్రేయస్సుకు అవసరమైన నిర్ణయాలు తీసుకుంటామన్నారు.

17 విపక్ష పార్టీలు కలిసి పోటీచేయాలనే నిర్ణయం మామూలుది కాదు. బీజేపీకి మైండ్ బ్లాంక్ డెసిషన్ ఇది. బీజేపీ అభ్యర్థికి వ్యతిరేకంగా.. ప్రతిపక్షాల తరఫున ఒకే అభ్యర్థిని నిలబెట్టనున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా.. ఇలా ఉమ్మడిగా అభ్యర్థిని బరిలో దింపి.. బీజేపీని దెబ్బకొట్టాలనేది వ్యూహం.


అయితే, ఆప్, డీఎంకే, బీఆర్ఎస్ లాంటి పార్టీలన్నీ కలిస్తేనే ఈ స్ట్రాటజీ వర్కవుట్ అవుతుంది. రెబెల్ బెడదా ఉంటుంది. ఢిల్లీలో కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌కు మద్దతు తెలపాలని డిమాండ్ చేస్తూ.. ఆప్ అధినేత కేజ్రీవాల్ ఈ భేటీకి డుమ్మా కొట్టారు. కూటమిలో కాంగ్రెస్సే కీ పార్టీ కాబట్టి.. డీఎంకే సైతం సపోర్ట్ చేస్తుంది. ఇక, కాంగ్రెస్ ఉంది కాబట్టి.. బీఆర్ఎస్-కేసీఆర్ ఈ కూటమికి దూరంగా ఉన్నారు. అందులోనూ గులాబీ బాస్ బీజేపీ మనిషేననే అనుమానమూ ఉంది. మైనస్‌లు ఎలా ఉన్నా.. ఏకంగా 17 ప్రతిపక్ష పార్టీలు ఇలా ఉమ్మడి అభ్యర్థి స్ట్రాటజీతో రంగంలోకి దిగడం కమలదళాన్ని కంగారు పెట్టే రాజకీయ ఏకీకరణే అంటున్నారు. అయితే, ఆ బెదరు కనిపించకుండా.. అదంతా ఫోటో సెషన్ కోసం ఏర్పాటు చేసుకున్న మీటింగ్ అంటూ అమిత్ షా సెటైర్లు వేయడం ఆసక్తికరం.

Related News

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Big Stories

×