E-Paper
Advertisement

Warangal: జాతరల ఖిల్లాగా ఓరుగల్లు జిల్లా.. జనవరిలో భక్త జనసంద్రోహం

Warangal: జాతరల ఖిల్లాగా ఓరుగల్లు జిల్లా.. జనవరిలో భక్త జనసంద్రోహం
Advertisement

ఓరుగల్లు జిల్లా జాతరల ఖిల్లాగా మారబోతోంది. జనవరి నెలలో వరుస జాతరలతో భక్త జనసంద్రంగా మారనుంది. తెలంగాణ కుంభమేళాగా పిలుచుకునే మేడారం మహా జాతరతో పాటు… ఐలోని మల్లన్న, కొత్తకొండ వీరభద్ర స్వామి, గట్టుమల్లన్న, కట్ట మల్లన్న, దూడల మల్లన్న, అగ్రంపాడ్ జాతరలు జనవరి నెలలో జరగనున్నాయి.

ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొలువైన కొమరవెల్లి వీరన్న, కొత్తకొండ వీరభద్ర స్వామి, ఐలోని మల్లన్న ఉత్సవాలు, మేడారం సమ్మక్క జాతరలు జనవరి నెలలో జరగనున్నాయి. ఓరుగల్లు జిల్లాలో, జానపదుల జాతరలు జనవరి నెలలో సందడి చేయనున్నాయి. ప్రముఖ శైవ క్షేత్రాలుగా విలసిల్లుతున్న హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండలోని భద్రకాళి సమేత వీరభద్ర స్వామి, ఐలోని మల్లన్న జాతరలు, వనదేవతలైన సమ్మక్క, సారలమ్మలను దర్శించుకునేందుకు లక్షల సంఖ్యలో భక్తులు రానున్నారు.

Advertisement

జనవరి 28 నుండి 31 వరకు వనదేవతలైన సమ్మక్క సారలమ్మల మేడారం జాతర అంగరంగ వైభవంగా జరగనుంది. నెల రోజుల ముందు నుండే భక్తులు సమ్మక్క సారలమ్మలను దర్శించుకొని మొక్కులు సమర్పిస్తున్నారు. సమ్మక్క సారలమ్మ ఆలయాన్ని 251 కోట్ల రూపాయల నిధులతో మహా అద్భుత కళాఖండంగా ప్రభుత్వం తీర్చిదిద్దింది. దీంతో గత జాతరల కంటే ఈసారి భక్తుల సంఖ్య విపరీతంగా పెరగనుంది. జాతర సమయంలో కోటికి పైగా భక్తులు వచ్చినా… ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం.

ప్రాచీన శైవ క్షేత్రమైన అయినవోలు మల్లన్న మహా జాతర జనవరి 13 నుండి 15 వరకు జరుగనుంది. 13న బ్రహ్మోత్సవాలు ప్రారంభమై, 14న భోగి, 15న సంక్రాంతి రోజున ప్రభ బండ్ల ప్రదక్షిణతో మూడు రోజుల బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఐలోని మల్లన్న జాతర సంక్రాంతికి మొదలై ఉగాది వరకు మూడు నెలల పాటు కొనసాగుతుంది. గత ఎడాది అయినవోలు మల్లన్న జాతరకు 30 లక్షల మంది పైగా భక్తులు హాజరయ్యారు.

Advertisement

మకర సంక్రాంతి పర్వదినం నేపథ్యంలో భీమదేవరపల్లి మండలం కొత్తకొండలోని వీరభద్ర స్వామి జాతర జరుగుతుంది. కోరినకోర్కెలు నెరవేర్చే కోర మీసాల వీరభద్ర స్వామిని దర్శించుకునేందుకు లక్షల సంఖ్యలో భక్తులు తరలిరానున్నారు. జనవరి 10న అంకురార్పణ, స్వామివారి బ్రహ్మోత్సవ కళ్యాణం జరగనుంది. 13న మహా లింగార్చన, 14న అరుణయంత్రస్థాపన చండీ హోమం, 15న ఉత్తరాయన పుణ్యకాలం, ప్రభవన్ ల ప్రదక్షిణ ఉండనుంది. 18న అగ్నిగుండాలో, స్వామి వారి గ్రామ పర్యటనతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. గతేడాది వీరభద్ర స్వామి జాతరకు సుమారు 26 లక్షల మంది హాజరయ్యారు.

కీలకమైన మేడారం, ఐనవోలు, కొత్తకొండ జాతరలతో పాటు… అగ్రంపాడు సమ్మక్క జాతర, గొర్రెకుంటలోని కట్ట మల్లన్న, మల్లికుదుర్లలోని గట్టు మల్లన్న, దూడల మల్లన్న జాతరలు సైతం జనవరి నెలలోనే జరగనున్నాయి. జనవరి నెల మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లాలో జాతరల సందడి కనిపించనుంది. కోట్లాదిమంది భక్తుల రాకతో ఆధ్యాత్మిక కేంద్రంగా మారనుంది ఓరుగల్లు.

ALSO READ: Bandi Sanjay: పండగలు వచ్చినప్పుడే డ్రగ్స్ కేసులు గుర్తొస్తాయా..? బండి సంజయ్ ఆగ్రహం

Related News

ఎండిపోతున్న ప్రాజెక్టులు.. హైదరాబాద్‌కు తగ్గిన నీటి సరఫరా.. రాబోయే రోజుల్లో తిప్పలు తప్పవా?

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ ఆత్మహత్యాయత్నం.. వెంటనే ఆసుపత్రికి తరలింపు

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Big Stories

Advertisement
×