Big Stories

Radha Kishan Rao Phone Tapping Case: ఆయన ఆదేశించారు.. నేను పాటించాను..!

Radha Kishan Rao Phone Tapping Case Update: రాధాకిషన్ రావు.. బీఆర్ఎస్‌ ప్రభుత్వ హయాంలో ఆ పార్టీ కోసం అన్ని తానై కష్టపడ్డ ఆఫీసర్లలో ఒకరు. అది కూడా అడ్డదారులలో.. అలాంటి అధికారి నోరు విప్పాడు. ట్యాపింగ్ ఎలా చేశాం? ఎందుకు చేశాం? ఎవరి కోసం చేశాం? డబ్బును ఎలా పట్టుకున్నాం? ఎవరికి చేరవేశాం? ఇలా అన్ని విషయలను పూసగుచ్చినట్టు చెప్పేశారు. ఇంతకీ రాధాకిషన్‌రావు చెప్పిన విషయాలేంటి? ఈ విషయాలతో ఇప్పుడు కేసు ఎవరి మెడకు చుట్టుకోనుంది?

- Advertisement -

ప్రభాకర్‌ రావు.. రాధాకిషన్ రావు.. భుజంగరావు.. ప్రణీత్‌ రావు.. తిరుపతన్న.. ఏంటీ రైమింగ్ బాగుందా.. ఇలాంటి రావు అనే రైమింగ్‌ అనుకోకుండా వచ్చింది కాదు. దీనికి పక్కా ప్లానింగ్ ఉంది.. ఆ ప్లాన్‌ ప్రకారమే రావులంతా ఒక్కగూటికి చేరారు. ఖాకీ చొక్కా వేసుకొని ప్రజలకు సేవ చేయాల్సిన వీరంతా. బీఆర్ఎస్‌ జెండాను నిలబెట్టేందుకు సర్వం ధారపోశారు. ఈ కథ మొదలయ్యింది ఇప్పుడు కాదు. తెలంగాణ నూతన రాష్ట్రంగా ఏర్పడి ఎన్నికలు జరిగిన తర్వాత బీఆర్ఎస్‌ గద్దెనెక్కినప్పుడు మొదలైంది. అది 2016 అప్పుడే ఇంటెలిజెన్స్‌ డిపార్ట్‌మెంట్‌కు బదిలీ అయ్యారు ప్రభాకర్ రావు మరి ఆయనకున్న అదనపు అర్హత ఏంటి? క్యాస్ట్.. అధికార పార్టీ పెద్ద. ఆయన ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడం.

- Advertisement -

సో ప్రభాకర్‌ రావు వెంటనే చీఫ్‌గా అపాయింట్ అయ్యారు. ఆ వెంటనే ఓ టీమ్‌ను ఏర్పాటు చేశారు. అది కూడా ఆయన సామాజిక వర్గానికి చెందిన ఆఫీసర్స్‌నే సెలక్ట్ చేసుకున్నారు. ఒక్కోక్కరిని స్వయంగా హ్యాండ్‌పిక్ చేశారు. వాళ్లు ఎవరయా అంటే.. నల్లగొండ నుంచి ప్రణీత్ రావు హైదరబాద్ సిటీ పోలీస్ నుంచి తిరుపతన్న రాచకొండ నుంచి భుజంగరావు.. సైబరాబాద్ నుంచి వేణుగోపాల రావు  ఇలా కొనసాగుతూ వెళ్లింది లిస్ట్.. ఇక హైదరాబాద్‌పై ఫుల్ కంట్రోల్‌ ఉండాలంటే ఒకరు ఉండాలి. అది మనవాడై ఉండాలి.. సో ప్రభాకర్‌ రావు వెంటనే ఓ పేరును సజెస్ట్ చేశారు. బీఆర్ఎస్‌ సుప్రిమో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.. ఆయనే రాధాకిషన్ రావు.. వీరందరి పని ఏంటంటే.. ప్రజలు ఏటైనా పోనీ.. బీఆర్ఎస్‌ పార్టీ మాత్రం సుభిక్షంగా ఉండాలి.. ఆ పార్టీ చేతుల నుంచి అధికారం పోకూడదు.

Also Read: కావ్య ‘కుల’కలం.. కడియం కావ్యపై ఆరూరి రమేష్ సంచలన వ్యాఖ్యలు

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ఏ1గా ఉన్న ప్రణీత్‌ రావు సెలక్షన్ కూడా ప్రభాకర్‌ రావు చాయిసే అని చెప్పేశారు రాధాకిషన్ రావు.. స్పెషల్ ఇంటెలిజెన్స్‌ బ్యూరోలో మళ్లీ ఓ స్పెషల్ టీమ్‌ను ఏర్పాటు చేశారు. ప్రణీత్‌రావును దానికి హెడ్‌గా పెట్టారు. ఈ టీమ్‌ పని ఓన్లీ లీడర్స్‌ను టార్గెట్ చేయడం అది అపోజిషన్ కావచ్చు.. సొంత పార్టీ కావొచ్చు. వాళ్ల ఫోన్లు ట్యాప్ చేయడం.. వివరాలను ప్రభాకర్‌రావుకు చేరవేయడం ఇదే వారు చేసిన పని నిజానికి రాధాకిషన్‌ రావు అప్పటికే రిటైర్ అయ్యారు. కానీ ఆఫీసర్ ఆన్‌ స్పెషల్ డ్యూటీగా ఆయన మూడేళ్లు ఆ తర్వాత కూడా పనిచేశారు. ఇదేలా సాధ్యమయ్యిందో కూడా క్లారిటీ ఇచ్చారు రాధాకిషన్ రావు. ఇక్కడ కూడా క్యాస్ట్‌ ఇక్వేషన్‌ వాడినట్టు ఆయన అంగీకరించారు. SIB చీఫ్‌గా ఉన్న ప్రభాకర్‌రావు కూడా దీనికి వత్తాసు పలికారు. బీఆర్ఎస్‌ పార్టీ పెద్దలు కూడా తన అవసరాన్ని గుర్తించారు..
సో ఇంకేముంది.. వడ్డించేవాడు మనవాడైతే బంతిలో ఎక్కడ కూర్చున్నా పర్లేదన్నట్టుగా ఇయన రిక్వెస్ట్ చేయడం.. అటు నుంచి అనుమతులు రావడం చకాచకా జరిగిపోయాయి.

మరి ఇదంతా చేసింది ఎందకు? ఈ క్వశ్చన్స్‌కి ఆన్సర్స్‌ రావాలంటే ఓ రెండు ఎగ్జాంపుల్స్ చూస్తే అర్థమవుతోంది. అది 2020.. దుబ్బాక బై ఎలక్షన్స్‌ జరుగుతున్న సమయం. ప్రణీత్‌రావు బీజేపీ నేత రఘునందన్‌రావు అనుచరుల ఫోన్‌ ట్యాప్‌ చేశారు. ఆయన బంధువుకు చెందిన డబ్బు సిటీకి వస్తుందని కనిపెట్టారు. ఇన్ఫో వెంటనే టాస్క్‌ఫోర్స్‌ టీమ్‌కు చేరింది.. టాస్క్‌ఫోర్స్ అంటే రాధాకిషన్‌ రావు ఇంకేముంది బేగంపేట్‌లో ఆ కోటి రూపాయలను స్వాధీనం చేసుకున్నారు.

మునుగోడు ఎలక్షన్స్‌ సమయంలో ఇవే సీన్లు.. మొన్న జరిగిన అసెంబ్లీలోనూ ఇలాంటి సీన్లు అనేకం.. ప్రణీత్‌ రావు ఇన్ఫర్మేషన్‌ ఇస్తాడు.. టాస్క్‌ఫోర్స్‌ రంగంలోకి దిగుతుంది. విపక్షాల డబ్బును ఎక్కడికక్కడ సీజ్ చేస్తుంది. ఇలా కోటాను కోట్ల రూపాయలను ఎక్కడిక్కడ సీజ్ చేసింది టాస్క్‌ఫోర్స్ టీమ్.. ఇవన్నీ ఒకెత్తు అయితే.. గవర్నమెంట్ వెహికల్స్‌లో డబ్బును తరలించడం మరో హైలెట్.. రాధాకిషన్‌ తన స్టేట్‌మెంట్‌లో ఈ విషయాలను కూడా బయటపెట్టారు. అయితే ఇందులో యశోధా హాస్పిటల్ పేరు బయటికి రావడం విశేషం.

Also Read: Darsi Politics: దర్శి యూటర్న్.. మార్పులతో సతమతం..

తన ఆదేశాలతో SI సాయి కిరణ్ రెండు సార్లు యశోధా హాస్పిటల్‌కు డబ్బు తీసుకెళ్లాడు. ఈ విషయాలు చెప్పింది కూడా రాధాకిషన్ రావే దివ్య చరణ్‌ రావు.. ఇయన ఓ మాజీ పోలీస్ అధికారి ఆ సమయంలో ఆయన యశోధా ఆసుపత్రిలో పనిచేస్తున్నారు.మొదటి సారి SI సాయి.. రాణిగంజ్‌ నుంచి కోటి రూపాయలు తీసుకెళ్లి చరణ్‌రావుకి ఇచ్చాడు.సెకండ్‌ టైమ్ అఫ్జల్‌ గంజ్‌ నుంచి మరో కోటి రూపాయలు తీసుకెళ్లి మలక్‌ పేట యశోధా హాస్పిటల్‌లో ఉన్న చరణ్‌రావుకు ఇచ్చారు. మరోసారి ఎమ్మెల్సీ, బీఆర్ఎస్‌ నేత వెంకట్‌ రామ్‌ రెడ్డికి చెందిన డబ్బును కూడా గవర్నమెంట్ వెహికల్స్‌లో తరలించారు.

వాళ్ల సోదరులు రాజపుష్ప కన్‌స్ట్రక్షన్స్ యజమానులు కావడం విశేషం. వెంకట్ రామ్‌ రెడ్డి తనకు చిన్నప్పటి ఫ్రెండ్ మాత్రమే కాదు. ఫ్యామిలీ ఫ్రెండ్ అని చెప్పారు రాధాకిషన్ రావు.. ఇలా మొత్తం నాలుగు సార్లు.. రాధాకిషన్‌ రావు చెప్పడం.. ఎస్‌ కిరణ్‌ వెళ్లడం డబ్బులు కలెక్ట్ చేయడం వారికి సంబంధించిన వారికి అందించడం జరిగిపోయింది. వెళ్లిన ప్రతిసారి కోటి రూపాయల క్యాష్‌ను ట్రాన్స్‌ఫర్ చేశారు. కానీ వారు ఆశించింది జరగలేదు.. బీఆర్ఎస్‌ దారుణంగా ఓడిపోయింది. ఫలితాలు వెలవడిన తర్వాతి రోజే.. తన పోస్ట్‌కు రిజైన్ చేశారు రాధాకిషన్ రావు అంతకుముందే తన ఫోన్లను ఫార్మాట్ చేశారు. పోలీస్ అధికారే కదా.. దొరక్కుండా ఉండేందుకు ఏమేం చేయాలో.. అన్ని చేశారు. కానీ తప్పు తప్పే కదా.. మార్చి 29న పోలీసులు అరెస్ట్ చేశారు.

Also Read: స్వ(వి)పక్షం.. వైసీపీలో రగులుతున్న మంటలు

ఇవీ రాధాకిషన్‌ రావు గారి భాగోతాలు.. ఆయన నోటి నుంచి వెలువడి ఆణిముత్యాలు.. తప్పు చేశానని ఒప్పుకున్నారు. తన అధికారాలను దుర్వినియోగం చేసినందుకు.. ఆయనకు శిక్ష పడటం ఖాయం. ఎట్ ది సేమ్‌ టైమ్.. ఈ కన్‌ఫెషన్ స్టేట్‌మెంట్స్‌తో కొన్ని డౌట్స్‌ మాత్రం మిగిలిపోయాయి. రాధాకిషన్‌ పదే పదే చెప్పిన ఆ బీఆర్‌ఎస్‌ సుప్రిమో ఎవరు? డబ్బులను కలెక్ట్ చేసి చరణ్‌రావుకు ఎందుకిచ్చారు? ఆ తర్వాత ఆ క్యాష్‌ ఎక్కడికి చేరింది? అసలు అఫ్జల్‌గంజ్‌, రాణిగంజ్‌లలో ఆ క్యాష్‌ వాళ్లకి ఇచ్చింది ఎవరు? ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డికి చెందిన క్యాష్‌ ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరికి చేరింది? అన్న ప్రశ్నలకు సమాధానం ప్రస్తుతం లేదు. కానీ త్వరలోనే వీటికి కూడా సమాధానాలు రావడం ఖాయం.. బీఆర్ఎస్‌ పెద్దల మెడకు ఈ కేసు చుట్టుకోవడం మరింత ఖాయంగా కనిపిస్తోంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News