Big Stories

MI Vs CSK Match Preview: హార్దిక్ మళ్లీ మెరుస్తాడా..? నేడు ముంబై ఇండియన్స్ వర్సెస్ చెన్నయ్ సూపర్ కింగ్స్..!

MI vs CSK IPL 2024 Prediction: ఐపీఎల్ 2024 సీజన్ లో ముంబై ఇండియన్స్ మ్యాచ్ అనేసరికి అందరిలో ఒకవిధమైన వైబ్రేషన్ స్టార్ట్ అవుతోంది. ఎందుకంటే ఆ మ్యాచ్ హై ఓల్టేజ్ మధ్య సాగుతుంది. అంతేకాదు చిరకాల ప్రత్యర్థి  చెన్నయ్ సూపర్ కింగ్స్ తో ఆడనున్నారు.

- Advertisement -
ఒకప్పుడు రోహిత్ శర్మ వర్సెస్ మహేంద్ర సింగ్ ధోనీ అన్నట్టు ఉండేది. గురు శిష్యుల మధ్య పోరు ఎప్పుడూ రసవత్తరంగా ఉండేది. కానీ ఇప్పుడు వీళ్లిద్దరూ సైడ్ అయ్యారు. కుర్రాళ్లకు పగ్గాలిచ్చారు.
ఆదివారం రాత్రి 7.30కి ముంబై వాంఖేడీ స్టేడియంలో ముంబై వర్సెస్ చెన్నయ్ మధ్య హై ఓల్టేజ్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇంతవరకు ఈ రెండు జట్ల మధ్య 38 మ్యాచ్ లు జరిగాయి. వీటిలో చెన్నయ్ 17 సార్లు, ముంబై 21 సార్లు విజయం సాధించాయి.

ఐపీఎల్ 2024 సీజన్ లో ముంబై ఇండియన్స్ ఇంతవరకు 5 మ్యాచ్ లు ఆడి వరుసగా మూడు ఓడి, రెండింట్లో విజయం సాధించింది. పాయింట్ల టేబుల్ లో 7వ స్థానంలో ఉంది. ఇక చెన్నయ్ విషయానికి వస్తే 5 మ్యాచ్ లు ఆడి మూడు విజయం సాధించింది. రెండింట్లో పరాజయం పాలైంది. అయినా సరే మెరుగైన రన్ రేట్ తో  పాయింట్ల టేబుల్ లో 3వ స్థానంలో ఉంది.

- Advertisement -

ముంబై విషయానికి వస్తే జట్టులో అసమ్మతులు, అసంత్రప్తులు అన్నీ సద్దుమణిగినట్టే కనిపిస్తున్నాయి. వరుసగా రెండు మ్యాచ్ లు నెగ్గి మళ్లీ ట్రాక్ ఎక్కినట్టే కనిపిస్తున్నారు. సూర్య వచ్చిన తర్వాత బ్యాటింగ్ బలం పెరిగింది. ధనాధన్ ఆడుతున్నారు. బుమ్రా బౌలింగులో పదును పెరిగింది. తనే ఒక ప్రధాన ఆయుధంగా ఉన్నాడు.

ఇక చెన్నయ్ విషయానికి వస్తే మహేంద్ర సింగ్ ధోనీ ఒక్కడు చాలు అన్నట్టుగానే ఉంది. తన కెప్టెన్సీయే ఆ జట్టు బలంగా చెప్పాలి. అప్పటికప్పుడు సమయానుకూలంగా పన్నే వ్యూహాలు ఆట తీరునే మార్చి వేస్తుంటాయి.

కెప్టెన్ రుతురాజ్ బాధ్యతగా ఆడటం జట్టుకి కలిసి వస్తోంది. రచిన్ రవీంద్ర ఆల్ రౌండర్ నైపుణ్యం చెన్నయ్ కి కలిసొచ్చింది. రవీంద్ర జడేజా సమయానుకూలంగా ఆడే తీరు జట్టుకి  ప్రధాన బలంగా మారింది. మరి ఈ రెండు జట్లు ఎలా ఆడతాయో, ఎవరు విజయం సాధిస్తారో వేచి చూడాల్సిందే.
- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News