E-Paper
Advertisement

ఆక్రమణ నిరూపిస్తే ప్రభుత్వానికే రాసిచ్చేస్తా.. రేవంత్ సర్కార్‌కు పవన్ కళ్యాణ్ సవాల్!

ఆక్రమణ నిరూపిస్తే ప్రభుత్వానికే రాసిచ్చేస్తా.. రేవంత్ సర్కార్‌కు పవన్ కళ్యాణ్ సవాల్!
Advertisement

Pawan Kalyan: హైదరాబద్‌లోని నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కోడి చెరువు ఆక్రమణ ఆరోపణలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో స్పందించారు. ‘తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అంటే నాకు ఇష్టం, అభిమానం. ఒకవేళ నేను నిజంగానే చెరువును ఆక్రమించానని తెలంగాణ ప్రభుత్వం నిరూపిస్తే, ఆ భూమిని సంతోషంగా ప్రభుత్వానికే రాసిచ్చేస్తా’ అని ప్రకటించారు. అనుమతి లేకుండా ప్రైవేట్ ప్రాపర్టీలోకి ఇష్టం వచ్చినట్టు వెళ్తే క్రిమినల్ కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఆ స్థలంలో గోశాల ఉంచామని, అందులోని 70 గోవుల గడ్డి కోసమే ఆ ల్యాండ్ వాడుతున్నామని స్పష్టం చేశారు. ఇలాంటి వాటితో కూర్చొని భయపెట్టాలని చూస్తే భయపడే ప్రసక్తే లేదన్నారు.

ఇక ఉద్యోగాలు, ఉపాధి అవకాశాల గురించి మాట్లాడుతూ.. తెలంగాణలో ఉద్యోగాలు రాకపోతే ప్రతిదానికీ ఆంధ్ర వాళ్లే కారణం అనడం సరికాదన్నారు. అసలు ఉద్యోగాల సమస్యకు, తనకు ఏంటి సంబంధం అని ప్రశ్నించారు.

Advertisement

ఇదే సమయంలో హైదరాబాద్‌కు సినిమా పరిశ్రమ రావడం వెనుక ఉన్న చరిత్రను ఆయన గుర్తుచేశారు. వైజాగ్ లేదా మరెక్కడికో వెళ్లాల్సిన ఇండస్ట్రీని హైదరాబాద్‌ వైపు మళ్లించి, ఇక్కడ సినిమా పరిశ్రమ స్థిరపడటానికి అప్పటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి గారే అసలైన కారణమని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

Also Read: పవన్ సంచలన ప్రకటన.. తెలంగాణలో జనసేన పోటీ.. తేల్చుకుందామని సవాల్!

Related News

ప్రపంచ స్థాయి చదువులంటే ఇదేనా? ఫీజు బకాయిల పెండింగ్‌పై హరీశ్ రావు నిలదీత

1000 రోజుల పాలన కాదు.. 1000 అబద్ధాల పాలన.. కాంగ్రెస్‌పై రాంచందర్ రావు ఫైర్

సత్తుపల్లిలో భూవివాదం కలకలం.. కోర్టు ఉత్తర్వులు ఉన్నా తహసీల్దార్ నివేదిక రైతుల ఆగ్రహం!

మెదక్ జిల్లాలో వింత ఘటన.. కుక్క పిల్లలకు పాలిస్తున్న వరాహం

పార్టీలో నుండి కవితను అందుకే తొలగించారు: ప్రశాంత్ రెడ్డి క్లారిటీ!

మహబూబాబాద్ జిల్లాలో షాకింగ్ సీన్.. లగ్జరీ కారులో వచ్చి మేకల దొంగతనం కలకలం

ఆమె మా బోధన్ కోడలు.. కవిత పై మాజీ ఎమ్మెల్యే షకీల్ సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్‌లో ఓటర్ల వెరిఫికేషన్.. నోటీసులిచ్చినా దక్కని స్పందన!

Big Stories

Advertisement
×