BigTV English

Varahi: రంగు పడింది.. ‘వారాహి’ రాజకీయం ముదిరింది..

Varahi: రంగు పడింది.. ‘వారాహి’ రాజకీయం ముదిరింది..

Varahi: ఏపీలో పవన్ కల్యాణ్ తుమ్మినా తప్పు. దగ్గినా తప్పు. అలాంటిది వారాహి వాహనమెక్కి ఎన్నికల యుద్ధానికి దిగితే.. అధికార పక్షం ఊరుకుంటుందా? అందుకే, మాజీ మంత్రి పేర్ని నాని వెంటనే మీడియా ముందు వాలిపోయారు. ఆర్మీ వాహనాలకు వాడే ఆలివ్ గ్రీన్ కలర్ ను ప్రైవేట్ వెహికిల్స్ కు వేయడం నిషిద్ధమంటూ హెచ్చరించారు. పనిలో పనిగా పసుపురంగు వేసుకోమంటూ సెటైర్లూ వేశారు పేర్ని నాని.


వారాహి రంగును వైసీపీ నేతలు వివాదాస్పదం చేస్తుండటంపై పవన్ కల్యాణ్ ఫైర్ అయ్యారు. ట్విటర్ లో చురుక్కులు అంటించారు. నిబంధనలు ఒక్క పవన్‌కల్యాణ్‌ కోసమేనా? అంటూ ఆలీవ్‌ గ్రీన్‌ కలర్‌లో ఉన్న పలు వాహనాల ఫొటోలను ట్విటర్‌లో పోస్టు చేశారు. అంతకుముందు గ్రీన్ కలర్ జాకెట్ ను చూపిస్తూ ఇదైనా వేసుకోవచ్చా? అంటూ వైసీపీని ట్విట్టర్ లో ప్రశ్నించారు పవన్.

“అసూయతో వైసీపీ ఎముకలు రోజురోజుకూ కుళ్లిపోతున్నాయి. వైసీపీ టికెట్‌ రేట్లు, కారు రంగులు, కూల్చడాలు లాంటి చిల్లర పనులు ఆపి రాష్ట్ర అభివృద్ధి మీద దృష్టి పెట్టాలి. ఇప్పటికే ఏపీలో లంచాలు, వాటాల వేధింపుల వల్ల ‘కారు నుంచి కట్‌ డ్రాయర్‌ కంపెనీల’ దాకా పక్క రాష్ట్రానికి తరలిపోయాయి” అంటూ ట్విట్టర్ లో పంచ్ లు వేశారు జనసేనాని.


Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×