BigTV English

PC Ghosh commission: కట్టిందా బ్యారేజీనా మరేమైనా? ప్రతినిధులపై ఘోష్ కమిషన్ ప్రశ్నలు, అంతా అప్పటి ప్రభుత్వమే

PC Ghosh commission: కట్టిందా బ్యారేజీనా మరేమైనా? ప్రతినిధులపై ఘోష్ కమిషన్ ప్రశ్నలు, అంతా అప్పటి ప్రభుత్వమే

PC Ghosh commission: ఘోష్ కమిషన్ విచారణతో ఉక్కిరి బిక్కిరి పడుతున్నదెవరు? బీఆర్ఎస్‌కు చెమటలు పడుతున్నాయా? ప్రాజెక్టుల్లో అడ్డంగా దోపిడీ జరిగిందా? ప్రతీ అంశంలోనూ నిబంధనలకు తలొగ్గారా?  ఈ అంశాన్ని డైవర్ట్ చేసేందుకు ప్రభుత్వంపై బురద జల్లడమే పనిగా కారు పార్టీ నేతలు పెట్టుకున్నారా? అన్నారం బ్యారేజ్ నిర్మాణ లోపాలను కమిషన్ తప్పుపట్టిందా? ఎందుకు నిర్మాణ కంపెనీ ప్రతినిధులు నీళ్లు నమిలారు?


దశాబ్దాలపాటు ఉండాల్సిన బ్యారేజీ కేవలం ఏడాదికే డ్యామేజ్ కావడం షేమ్‌గా లేదా అంటూ నిర్మాణ సంస్థ ప్రతినిధులను ప్రశ్నించింది ఘోష్ కమిషన్. అన్నారం బ్యారేజీ నిర్మాణ సంస్థ ఆఫ్కాన్స్ ప్రతినిధులపై కాళేశ్వరం జ్యుడీషియల్ కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. బ్యారేజీల నిర్మాణానికి ముందు ఆ ప్రాంతాన్ని పరిశీలించాల్సిన బాధ్యత నిర్మాణ సంస్థకు లేదా? అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు సంధించింది.

కాళేశ్వరం కమిషన్ విచారణలో భాగంగా శనివారం ఘోష్ కమిషన్ ఎదుట అన్నారం బ్యారేజీ నిర్మాణ ఆఫ్కాన్స్ ప్రతినిధులు హాజరయ్యారు. బ్యారేజ్ నిర్మాణం ఎందుకు ఆలస్యమైంది? నిర్మాణం కోసం తొలుత ఎంపిక చేసిన స్థలం సరిపోదని అప్పటి ప్రభుత్వం భావించిందన్నది ప్రతినిధుల మాట. మేడిగడ్డ బ్యారేజ్ నుంచి అన్నారం వరకు కాలువ పొడవు తగ్గించేందుకు నిర్ణయించిన స్థలానికి దిగువన బ్యారేజీని నిర్మించామన్నారు. కొత్త ప్రదేశంలో పరిశోధన చేయడానికి కొంత సమయం పట్టిందన్నారు.


భూములు అప్పగించడంలో విపరీతమైన జాప్యం జరిగిందంటూ ప్రభుత్వానికి రాసిన లేఖ గురించి కమిషన్ ప్రశ్నించింది. బ్యారేజీ సైట్ మార్చాక భూసేకరణకు చాలా సమయం పట్టిందన్నారు. వరదలు వచ్చినప్పుడు బ్యారేజీ సీసీ బ్లాకులు కొట్టుకుపోయాయని వివరించారు. ఆ సమస్య మళ్లీ రిపీట్ కాకుండా ఎలాంటి చర్యలు చేపట్టారని కమిషన్ ప్రశ్నల మీద ప్రశ్నలు సంధించింది.

ALSO READ: బీజేపీ బొమ్మ రాజకీయం.. కొత్త టాపిక్‌తో తెరపైకి.. డైవర్షన్‌ గేమ్స్‌ మొదలు

2018 ఏడాది అక్టోబర్‌లో 5 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చినా, సీసీ బ్లాకులు ఏమాత్రం చెక్కుచెదరలేదని వివరించారు ప్రతినిధులు. పంప్ హౌస్‌‌లకు నీటిని లిఫ్ట్ చేసేందుకు 119 మీటర్ల వరకు స్టోర్ చేశామన్నారు. ఆ ఏడాది రెండుసార్లు వరదలు వచ్చాయన్నారు. గేట్లు తక్కువ ఎత్తులో తెరిచి నీటిని కిందికి విడుదల చేయాల్సి ఉందన్నారు.

డ్యామేజ్ తర్వాత నేషనల్ సేఫ్టీ అథారిటీ సిపార్సుల మేరకు అక్కడ టెస్టులు జరిపించామని ఆ నివేదికలను ప్రభుత్వానికి సమర్పించామన్నారు. బ్యారేజీ రిపేర్ల విషయంలో మీ సలహా ఏంటని ప్రశ్నించింది. ఎన్‌డీఎస్ఏ చేసిన సిపార్సులపై ఆరా తీసింది. పీసీ బ్లాకులను రీస్టోర్ చేయాలని సూచించిందని, అందుకు తగ్గుట్గుగా పునరుద్ధరణ చేశామన్నారు. పగుళ్లు ఏమైనా వచ్చాయో లేదో తలుసుకునేందుకు డ్రోన్ సర్వే చేశామన్నారు. ఈ క్రమంలో పలు లోపాలను కమిషన్ ఎత్తి చూపింది. దీనిపై ప్రతినిధులు నీళ్లు నమిలారు.

Related News

Rakhi Festival: తమ్ముడికి రాఖీ కట్టేందుకు సాహసం చేసిన అక్క.. 20 అడుగుల ఎత్తున్న రైల్వే బ్రిడ్జి గోడపై నుంచి..?

MLA Mallareddy: రాజకీయాలకు గుడ్ బై.. బిగ్ బాంబ్ పేల్చేసిన మల్లారెడ్డి.. అసలేమైంది..?

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Big Stories

×