Rashmika mandanna:వరుస ప్రాజెక్టులు చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్న రష్మిక మందన్న (Rashmika mandanna) కాలుకి గాయం అవ్వడం కారణంగా సినిమా షూటింగ్స్ అన్నీ వాయిదా పడ్డాయి. ఇప్పటికే ఈ హీరోయిన్ నాలుగైదు సినిమాల్లో హీరోయిన్ గా చేస్తోంది. ఇలాంటి సమయంలో ఆమె కాలికి గాయం అవ్వడంతో ఆమెతో సినిమాలు చేసే దర్శక నిర్మాతలకు, హీరోకి ఇబ్బందిగా మారింది. అయితే కనీసం నడవలేని పరిస్థితిలో ఉన్నా కూడా రీసెంట్ గా రష్మిక మందన్న తాను నటించిన ‘ఛావా’ సినిమాకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో పాల్గొని అందర్నీ ఆశ్చర్యపరిచింది. అయితే రష్మికా మందన్న తనకు గాయమైనప్పటి నుండి ఏదో ఒక అప్డేట్ అభిమానులకు తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఇస్తూనే ఉంది. అయితే తాజాగా తన కాలికి ఎన్ని చోట్ల ఫ్రాక్చర్ అయింది అనే విషయం సోషల్ మీడియా ద్వారా బయటపెడుతూ అందరికి షాక్ ఇచ్చింది.మరి ఇంతకీ రష్మిక మందన్న తన సోషల్ మీడియాలో పెట్టిన ఆ పోస్ట్ లో ఏముందో ఇప్పుడు చూద్దాం..
మూడు చోట్ల ఫ్రాక్చర్ అయిందని తెలిపిన రష్మిక..
రష్మిక తన పోస్టులో.. “నా కాలికి మూడు చోట్ల ఫ్రాక్చర్ అయ్యింది. అలాగే కండరాల్లో చీలిక ఏర్పడడం వల్ల నేను నడవడానికి ఇంకొన్ని రోజులు పడుతుందని డాక్టర్లు చెబుతున్నారు. ఈ గాయమైనప్పటి నుండి కనీసం కాలు కింద పెట్టి నడవలేక పోతున్నాను. అర్జెంటుగా ఏదైనా వర్క్ మీద బయటకు వెళ్లాలంటే ఒంటి కాలు మీదే వెళ్తున్నాను. ఇక నాకు ఎంత నొప్పి ఉన్నా కూడా నాపై మీరు చూపించే ఎనలేని అభిమానానికి, ప్రేమకి ఈ నొప్పి కూడా నాకు తెలియడం లేదు” అంటూ రష్మిక మందన్న తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ పెట్టింది. ఇక రష్మిక పోస్ట్ చూసిన చాలా మంది నెటిజన్లు రష్మిక మందన్న ఆ గాయం నుండి త్వరగా కోలుకొని సినిమా షూటింగ్స్ లో పాల్గొనాలని కోరుకుంటున్నారు.ఇక రష్మిక మందన్న రీసెంట్ గా తన నెక్స్ట్ సినిమా కోసం జిమ్ లో తెగ కష్టపడుతూ కనిపించింది. అయితే ఆ టైంలోనే తన కాలికి గాయమై బెణికినట్టు తెలిపింది. కాలికి కట్టుతో కనిపించి జిమ్ లో వ్యాయామం చేస్తున్న సమయంలో గాయం అయిందని కొద్ది రోజులు డాక్టర్లు రెస్ట్ తీసుకోమన్నారని చెప్పింది.
కుంటుకుంటూ కనిపించి అందరిని ఆశ్చర్యపరిచిన రష్మిక..
ఇక రీసెంట్గా బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ (Vicky koushal) తో రష్మిక మందన్న నటించిన ఛావా మూవీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొనడానికి ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కారు నుండి దిగుతూ ఒంటి కాలు మీద నడిచి ఆ తర్వాత వీల్ చైర్ మీద కూర్చొని వెళ్లిన వీడియో నెట్టింట చక్కర్లు కొట్టింది. ఇక ఆ టైం లో రష్మిక బయటికి కనిపించకుండా ఫేస్ ని ఎంత కవర్ చేసుకున్నప్పటికీ అభిమానులు గుర్తుపట్టేసి వీడియోలు తీసి నెట్టింట్లో షేర్ చేశారు. ఇక ఈ గాయం నుండి కోలుకోవడానికి రష్మికకి మరో రెండు వారాలు పడుతుందని డాక్టర్లు చెప్పడంతో ఈమె సినిమా షూటింగ్స్ అన్నీ వాయిదా పడ్డాయి. రష్మిక మందన్న సినిమాల విషయానికి వస్తే.. తెలుగులో ది గర్ల్ ఫ్రెండ్ తో పాటు బాలీవుడ్ లో ఆయూష్మాన్ ఖురానా తో కలిసి థామ, సల్మాన్ ఖాన్ తో కలిసి సికిందర్ మూవీస్ లో చేస్తోంది.