Toxic Movie Update.. మొదట మోడల్ గా కెరియర్ మొదలుపెట్టి, ఆ తర్వాత పలు యాడ్స్ చేస్తూ లైమ్ లైట్ లోకి వచ్చిన హీరో యష్ (Yash). ఆ తర్వాత సీరియల్స్ లో నటించి తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్నారు. సీరియల్స్ ద్వారా వచ్చిన ఇమేజ్ తో సినిమాల్లోకి అడుగుపెట్టిన ఈయన అక్కడ కూడా సక్సెస్ అయ్యి నేడు పాన్ ఇండియా హీరోగా చలామణి అవుతున్నారు. ముఖ్యంగా కేజీఎఫ్, కేజీఎఫ్2 చిత్రాలతో సంచలనం సృష్టించి, ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసిన చిత్రాలుగా నిలిచాయి. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోల జాబితాలో చేరిపోయిన యష్ నుండి తాజాగా వస్తున్న చిత్రం టాక్సిక్(Toxic).
టీజర్ రిలీజ్..
ఇకపోతే ఈ సినిమా షూటింగ్ మొదలయ్యింది. దీనికి తోడు చిత్రీకరణ కూడా సగం పూర్తయింది. ఇటీవలే టీజర్ ని కూడా రిలీజ్ చేశారు. కానీ ఇందులో హీరోయిన్ గా నటిస్తున్న కియారా అద్వానీని మాత్రం టీజర్ లో చూపించలేదు. దీనికి తోడు ఈ సినిమాలో నయనతార కీలక పాత్ర పోషిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.అయితే ఇది చిత్ర బృందం నుండి లీక్ అవ్వడంతో అఫీషియల్ గా కన్ఫామ్ చేసేసుకుంటున్నారు అభిమానులు.
నయనతార గురించి హింట్ ఇచ్చిన అక్షయ్ ఒబెరాయ్..
ఇకపోతే ఈ విషయాన్ని ఎవరో కాదు ఇందులో విలన్ పాత్ర పోషిస్తున్న బాలీవుడ్ నటుడు అక్షయ్ ఒబెరాయ్(Akshay oberai) వెల్లడించారు. ఒక ఇంటర్వ్యూలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం తాను సినిమా షూటింగ్లో ఉన్నట్లు తెలిపారు. ఈ సినిమాలో నయనతార (Nayanthara) కూడా నటిస్తోందని హింట్ ఇచ్చారు అక్షయ్. ఇంతకుమించి వివరాలను ఆయన ఏమి వెల్లడించలేదు. త్వరలోనే ఈ సినిమా మహిళా దర్శకురాలు గీతూ మోహన్ దాస్ (Geethu Mohan Das) ఒక ప్రకటన చేస్తారని చెప్పిన ఆయన, అప్పటివరకు ఎదురుచూడాల్సిందే అని కూడా తెలిపారు. ఇకపోతే ఇందులో హీరోయిన్ గా ఉన్న కియారాతో రెండు కీలక షెడ్యూల్స్ కూడా చిత్ర బృందం పూర్తి చేసింది.
టీజర్ లో ఈమె పాత్ర గురించి రివీల్ చేస్తారని అనుకున్న అభిమానులకు మాత్రం నిరాశ మిగిలిందని చెప్పవచ్చు. ఇక ఇప్పుడు అదనంగా సౌత్ టాప్ హీరోయిన్ నయనతార కూడా నటిస్తోందని చెప్పడంతో ఆమె ఎలాంటి పాత్రలో దర్శనమిస్తుందో చూడాలని అభిమానులు సైతం ఎదురుచూస్తున్నారు. ఇక త్వరలోనే ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించనుంది. ఇక సమ్మర్ రిలీజ్ దశగా ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. మరి అనుకున్న సమయానికి సినిమాను పూర్తి చేస్తారో లేక మరోసారి వాయిదా వేస్తారో చూడాలి.
నయనతార కెరియర్..
ఇకపోతే నయనతార విషయానికి వస్తే ఇప్పటికే పలు చిత్రాలలో నటిస్తూ భారీ పాపులారిటీ అందుకున్న ఈమె, అటు బాలీవుడ్ లో కూడా భారీ ఇమేజ్ సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు యష్ సినిమాలో కీలక పాత్ర పోషించబోతుందని సమాచారం. ఏదేమైనా నయనతార క్రేజ్ ఇప్పటికీ తగ్గలేదు అనడంలో సందేహం లేదు. ఇండస్ట్రీకి వచ్చి రెండు దశాబ్దాలకు పైగానే అవుతున్నా.. అత్యధిక పారితోషకం తీసుకుంటూ.. వరుస అవకాశాలు అందుకుంటూ మరింత బిజీగా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ.