BigTV English

Pushpa 2 Movie : ఒళ్లు జలదరించే యాక్షన్ సీన్… సెన్సార్ కట్ చేసినా చిన్న పిల్లలు భయపడుతారు

Pushpa 2 Movie : ఒళ్లు జలదరించే యాక్షన్ సీన్… సెన్సార్ కట్ చేసినా చిన్న పిల్లలు భయపడుతారు

Pushpa 2 Movie : ట్రైలర్‌కి మంచి టాక్ వచ్చింది. సెన్సార్ కూడా అయింది. అక్కడ కూడా బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. ఇక బొమ్మ థియేటర్‌లో పడి ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి అని వెయిట్ చేస్తున్నారు అల్లు అర్జున్ అభిమానులు. డైరెక్టర్ సుకుమార్ కాస్త టైం తీసుకుంటేనే రంగస్థలం లాంటి ఇండస్ట్రీ హిట్ మూవీస్ వచ్చాయి. ఇప్పుడు ఏకంగా 3 ఏళ్లు టైం తీసుకున్నాడంటే… అవుట్ పుట్ ఎలా ఉంటుందో అని కూడా ఎదురుచూస్తున్నారు. ఇదంత పక్కన పెడితే సినిమాలో కొన్ని అసలు మిస్ చేయకుండా చూడాల్సిన సీన్స్ ఉన్నాయట. అందులో ఒకటి యాక్షన్ సీన్ ఉందట. ఆ సీన్ కు సెన్సార్ కొన్ని కట్స్ కూడా చెప్పింది. అయినా… ఆ సీన్‌ చూస్తే చిన్న పిల్లలు భయపడుతారని అంటున్నారు. ఆ సీన్ ఎంటో, ఎప్పుడు వస్తుందో ఇక్కడ చూద్ధాం…


యాక్షన్ సీన్స్ అంటే అందరికీ గుర్తొచ్చే డైరెక్టర్ బోయపాటి శ్రీను. ఆయన డైరెక్షన్‌లో వచ్చే సినిమాల్లో తలలు ఎగరడం, కాళ్లు, చేతులు ఎగరడం లాంటివి కనిపిస్తాయి. అలాంటివి క్రియేటేవ్ డైరెక్టర్ సుకుమార్ సినిమాలో మాత్రం పెద్దగా కనిపించవు. కానీ, ఈ సారి అలాంటివి సుక్కు మూవీలో కూడా ఉండబోతున్నాయి.

గూస్ బంప్స్ పక్కా…


సినిమాలో చేయి, కాళు తెగి పడే సీన్ ఉంటుందని సెన్సార్ రిపొర్ట్ ద్వారా అందరికీ తెలిసింది. అయితే ఆ సీన్ వచ్చే టైంలో గూస్ బంప్స్ వస్తాయట. ఫైట్‌లో విలన్ చేయి, కాళును పుష్ప రాజ్ నరికేస్తాడట. తర్వాత ఆ తెగిపడిపోయిన చేయి, కాళును పుష్ప రాజ్ చేతిలో పట్టుకుని వస్తాడట. ఆ… టైంలో వచ్చే హీరో ఎలివేషన్‌కు ఆడియన్స్ కు పూనకాలు రావడం పక్కా అంటున్నారు. అయితే ఆ విలన్ ఎవరు అనేది మనం సినిమాలోనే చూడాలి.

సెన్సార్ కట్స్ ఇక్కడే… 

ఇలాంటి వైల్డ్ యాక్సన్ సీన్స్‌లో సెన్సార్ బోర్డ్ కొన్ని కట్స్ చెప్పింది. ఈ కట్స్ వల్ల విలన్ చేయి, కాళును పుష్ప రాజ్ నరికే సీన్‌ను సినిమా నుంచి రిమూవ్ చేశారు. నరికే సీన్ రిమూవ్ చేసినా… పుష్ప రాజ్ ఆ నరికిన  చేయి, కాళును చేతితో పట్టుకుని రావడం అనేది సినిమాకే హైలైట్ ఉంటుందట.

జాతర ఎపిసోడ్… 

పుష్ప 2 లో అసలు మిస్ చేయకుండా చూడాల్సిన సీన్స్‌లలో జాతర ఎపిసోడ్ కూడా ఉంది. ఈ సీన్ థియేటర్‌లో వచ్చే టైంలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ సీట్స్ లో మాత్రం అసలు కూర్చోలేరట. అంతలా ఎలివేషన్స్‌తో సుక్కు ఆ జాతర ఎపిసోడ్ ను డిజైన్ చేశాడట. ఈ ఎపిసోడ్ షూటింగ్ కోసం అల్లు అర్జున్, సుకుమార్ చాలా కష్టపడ్డారట. అలాగే జాతర ఎపిసోడ్ కి నిర్మాతలు భారీ గానే ఖర్చు చేశారట.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×