E-Paper
Advertisement

Mahesh Kumar Goud: రాజ్యసభ రేసు.. రాష్ట్రంలో ఒకరికా..? లేదా ఇద్దరికా..? మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు

Mahesh Kumar Goud: రాజ్యసభ రేసు.. రాష్ట్రంలో ఒకరికా..? లేదా ఇద్దరికా..? మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు
Advertisement

రాజ్యసభ స్థానాల భర్తీ విషయంలో అధిష్టానం నిర్ణయం కోసం వేచి చూస్తున్నట్లు టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ తెలిపారు. రాష్ట్రం నుండి ఒకరికి అవకాశం దక్కుతుందా..? లేదా ఇద్దరికి ఇస్తారా..? అనేది త్వరలోనే స్పష్టత వస్తుందని చెప్పారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి రాజ్యసభ స్థానాన్ని కోరడం లేదని ఆయన స్పష్టం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ.. ఆ పార్టీ కేవలం కార్పొరేట్ శక్తులకే రాజ్యసభ అవకాశాలు కల్పించిందని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమం కోసం పనిచేసిన ఒక్కరికైనా బీఆర్ఎస్ పెద్దల సభకు వెళ్లే అవకాశం ఇచ్చిందా అని ఆయన ప్రశ్నించారు.

కార్పొరేషన్ పదవుల భర్తీపై పార్టీలో కసరత్తు జరుగుతోందని మహేష్ గౌడ్ వెల్లడించారు. మార్చి నెలలో కొన్ని కార్పొరేషన్ పదవులను భర్తీ చేస్తామని ప్రకటించారు. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు న్యాయం జరుగుతుందని భరోసా ఇచ్చారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ వ్యాఖ్యల గురించి స్పందిస్తూ.. మంత్రి పొంగులేటి ఇప్పటికే వాటికి సమాధానం ఇచ్చారని గుర్తు చేశారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే విజయన్ మాట్లాడుతున్నారని.. రాబోయే ఎన్నికల్లో కేరళలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

జాతీయ రాజకీయాల్లో మార్పు మొదలైందని మహేష్ గౌడ్ పేర్కొన్నారు. ప్రధాని మోదీ ఇచ్చిన వాగ్దానాలు అమలుకు నోచుకోకుండా అటకెక్కాయని విమర్శించారు. సామాన్య ప్రజలు ఇప్పుడు మోదీ పాలనను కోరుకోవడం లేదని చెప్పారు. ఇండో-అమెరికా ట్రేడ్ ఒప్పందాల వల్ల దేశంలోని రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ తదుపరి ప్రధాని కావడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు.

పార్టీ బలోపేతం కోసం మంత్రులు కచ్చితంగా క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. నెలకు ఒకసారి మంత్రులు తమ పరిధిలోని డీసీసీ కార్యాలయాల్లో కూర్చోవాలని సూచించారు. మంత్రులు ఎవరూ డీసీసీల శిక్షణకు రావొద్దని తాను ఎప్పుడూ చెప్పలేదని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి పార్టీకి మధ్య సమన్వయం పెంచడమే లక్ష్యమని మహేష్ గౌడ్ వివరించారు.

Advertisement

ALSO READ: Weather News: రానున్న 4 రోజులు జాగ్రత్త..! ఈ జిల్లాల్లో 40 డిగ్రీల వరకు టెంపరేచర్, బయటకు రావొద్దు..!

Related News

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ ఆత్మహత్యాయత్నం.. వెంటనే ఆసుపత్రికి తరలింపు

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

Big Stories

Advertisement
×