Gundeninda GudiGantalu Today episode june 9th: నిన్నటి ఎపిసోడ్ లో.. పూలు కట్టడానికి వచ్చిన సుమతి రవి తో క్లోజ్ గా ఉండడం ఓర్వలేని ప్రభావతి శృతికి క్లాస్ పీకుతుంది. లేనిపోని అనుమానాలు క్రియేట్ చేస్తుంది. నువ్వు ఊరుకోకుండా సుమతికి గట్టిగా వార్నింగ్ ఇవ్వాలని కోరుతుంది. శృతి మాత్రం బయటకు వచ్చి అందరికి అభిప్రాయం కనుక్కుంటుంది. రవి, శృతి క్లోజ్ గా ఉండటం మీకు ఎవరికైనా అభ్యంతరంగా ఉందా అనేసి అడుగుతుంది. మా సుమతి చాలా మంచిది మాకెందుకు అభ్యంతరమవుతుందని బస్తీ జనాలు అంటారు. ఇక రవి శృతి ఏమైంది ఏం చేస్తున్నావ్.? నాకేమీ అనుమానం లేదు మీ అమ్మకే అనుమానంగా ఉంది అందుకే క్లారిటీ ఇద్దామని ఇలా తీసుకొచ్చాను అని శృతి ప్రభావతికి దిమ్మతిరిగే షాక్ ఇస్తుంది.. ఎప్పటిలాగే ప్రభావతికి సత్యం క్లాస్ పీకుతాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. పూలమాలన్నీ అనుకున్న టైంలో కల్లా ముందే పూర్తి చేయాలని బాలు మీనా అనుకుంటారు. ఇంట్లో అందరూ సరదాగా మాట్లాడుకుంటూ మాలల్ని పూర్తి చేసే పనిలో ఉంటారు. మధ్యలో బాలు అందరికీ నెద్దమ్మత్తు వస్తుందని ప్లేట్ పట్టుకొని గట్టిగా సౌండ్ చేస్తాడు. ఏంట్రా ఈ గోల అంటే అందరూ నిద్రమత్తులో ఉన్న నాన్న నిద్రమత్తులో ఉంటే పూలు ఎలా కడతారు అని ఇలా చేశానని బాలు అంటాడు. ఇప్పుడు నిద్రమత్తు అందరికీ వదిలిందా అని బాలు అడుగుతాడు. ఈ నిద్రమత్తు పోవాలంటే సరదాగా కాసేపు పాటలు పాడుకోవాలని సత్యం అంటాడు.
ఇప్పుడు పూల గురించి మనం ఇన్ని పాట్లు పడుతున్నాం కదా.. అయితే పూలపైనే పాటలు పాడాలని ముందుగా మీనా అని పాట పాడమని సత్యం కోరుతాడు.. మీనా పాట పాడుతుంది. నా ఒక్కొక్కరు ఇంట్లోని వాళ్ళందరూ పూలపై పాటలు పాడతారు. కానీ ప్రభావం మాత్రం ఈ పాటలు గీటలు నాకు తెలీదు అని అంటుంది. అయితే సత్యం మాత్రం నీకు పాటలు రాకపోతేనే భరతనాట్యం వచ్చు కదా నాలుగు స్టెప్పులు వెయ్యొచ్చుగా అంటాడు. ఇక భర్త మాట కాదని లేక ప్రభావతి భరతనాట్యంతో అందరినీ మెప్పిస్తుంది..
ప్రభావతి భరతనాట్యంపై అక్కడున్న వాళ్ళందరూ ప్రశంసలు కురిపిస్తారు. కామాక్షి మాత్రం ఏడుస్తూ బయటకు వెళ్ళిపోతుంది. వెనకాల వెళ్లిన ప్రభావతి ఏమైంది కామాక్షి నేను ఇక్కడికి వచ్చి నాకు తోడుగా ఉండమంటే నువ్వేంటి వాళ్లకు సపోర్టుగా కూర్చుని పూలు కడుతున్నావని అడుగుతుంది. నువ్వు పిల్లలు లేరు అదృష్టం నాకు లేదు వదినా.. నీకు పిల్లలు ఉన్నారు ఇంట్లో ఇంత సందడి ఉంది నువ్వు చాలా అదృష్టవంతురాలివి అని ఎమోషనల్ అవుతుంది.
ఇక అప్పుడే బాలు ఫ్రెండ్ అశోక్ ఫోన్ చేస్తాడు. ప్రభావతి ఆ ఫోన్ రాగానే మాలలు వద్దని చెప్తాడేమో అని అపశకనపు మాటలు మాట్లాడుతుంది. బస్తీ జనాల్లో ఒక ఆవిడ మీ అత్తయ్యని ఎలా భరిస్తున్నావ్ మీనా.. ఆమె నోటికి మంచి మాటలే రావా అని అంటుంది. నీకు సీరియస్ అయినా ప్రభావతి నా ఇంటికి వచ్చి నా తిండి తిని నన్నే అంటావా అని అరుస్తుంది. నీ బాలు మాత్రం కాసేపు ఆగండి అని అశోక్ తో ఫోన్ మాట్లాడుతాడు. దానికంటే ముందుగానే ఆర్డర్ ఇచ్చేస్తాము నా భార్య చాలా కష్టపడుతుంది అని అతనితో అంటాడు.
ఐస్ క్రీమ్ రావడంతో శృతి నాకు ఐస్ క్రీమ్ కావాలి అందరికీ ఐస్ క్రీమ్ తీసుకొద్దాం అనేసి అంటుంది.. నా దగ్గర డబ్బులు లేవు నేను రాను అంటాడు మనోజ్.. శృతి నేను ఇస్తాను. అందరికీ తీసుకురండి అని అంటుంది. కానీ బాలు మాత్రం వీళ్ళందరూ నాకోసం పనిచేస్తున్నారు కదా.. నేనే ఆ డబ్బులు ఇస్తే నాకు తృప్తిగా ఉంటుంది అని అంటాడు. ఇక మీ నాకు బాలు ఐస్ క్రీమ్ తినిపించడంతో ప్రభావతి కుళ్ళుకుంటుంది. కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ సిగ్గుపడతారు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో వీరబాబు ఆర్డర్ ఇచ్చిన 5 వందల పూలల మాటలు తీసుకుని వెళ్లాడానికి ఓ పెద్ద ఆటో వస్తుంది. దానిలోకి బాలు, మీనా ఇద్దరూ పూల మాలను సద్ది జాగ్రత్తగా తీసుకుని వెళ్లమని డ్రైవర్‌కి చెప్పి పంపిస్తారు. అయితే అప్పటికే గుణ మనుషులు బాలు ఇంటికి సమీపంలో కాపుకాస్తారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..