Phone Tapping Case Update: ఫోన్ ట్యాపింగ్ కేసులో సస్పెండ్ అయిన ASPలకు నాంపల్లి కోర్టు రిమాండ్ విధించింది. ఈ నెల 6వరకు భుజంగరావు, తిరుపతన్నకు రిమాండ్ విధిస్తున్నట్లు ధర్మాసనం వెల్లడించింది. వీరిద్దరికీ మరో 5 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ ను నాంపల్లి కోర్టు విధించింది. కోర్టు వీరికి రిమాండ్ విధించడంతో వీరిని పోలీసులు మరి కాసేపట్లో చంచల్‌గూడ జైలుకు తరలించనున్నారు.
గత కొన్ని రోజులుగా ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపులు చోటుచేసుకుంటున్నాయి. ఈ కేసుతో సంబంధం ఉన్న ఒక్కొక్కరూ క్రమంగా బయటకు వస్తున్నారు. బాధితులు సైతం పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. అయితే ఈ కేసులో అరెస్టైన పోలీసు అధికారులు తిరుపతన్న, భుజంగరావుల కస్టడీ నేటితో ముగియగా పోలీసులు వీరిని నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. అయితే నాంపల్లి కోర్టు వీరికి రిమాండ్ విధించింది.
తిరుపతన్న, భుజంగరావుల్ని కస్టడీ పొడిగింపు కోరగా.. కోర్టు అనుమతిచ్చింది. ప్రస్తుతం పోలీసులు వీరిద్దరిని విచారిస్తున్నారు. వీరు ఇచ్చే సమాచారం మేరకు మరికొందరిని అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Also Read: Kadiyam Kavya: వరంగల్ ఎంపీ అభ్యర్థిగా కడియం కావ్య.. ప్రకటించిన కాంగ్రెస్..
ప్రస్తుతం కస్టడీలో ఉన్న మాజీ డీసీపీ రాధా కిషన్ రావు రిమాండు రిపోర్టులో మరో అధికారి వేణుగోపాలరావు పేరును ప్రస్తావించారు. దీంతో పోలీసులు అతన్ని కూడా అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే రాధా కిషన్ రావును 10రోజుల కస్టడీ కోరుతూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ పై నేడు కోర్టులో విచారణ జరగనుంది. దీంతో పాటుగా ట్యాంపింగ్ కేసులో ముఖ్య సూత్రధారి అయిన ప్రణీత్ రావు వేసిన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై నాంపల్లి కోర్టు విచారణ జరపనుంది.