Big Stories

Kadapa Lok Sabha Constituency: కడపలో కుటుంబ పోరు.. గెలుపెవరిది?

sharmila
 
- Advertisement -

దీంతో ఇప్పటికే ఎండలతో హాట్‌ హాట్‌గా మారిన రాయలసీమలో.. ఇప్పుడు అంతకన్నా రాజకీయాలు వేడేక్కడం కన్ఫామ్ అయ్యింది. ప్రస్తుతం కడప సిట్టింగ్‌ ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి.. అలాంటి అవినాష్‌పై అక్క వైఎస్‌ షర్మిల బరిలోకి దిగుతున్నారు.. మరి అవినాష్‌ గెలుస్తారా? లేదా షర్మిల నిలుస్తారా? అన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్‌గా మారింది. అసలు కడపలో పొలిటికల్ సీన్‌ ఎలా ఉందో ఓసారి అబ్జర్వ్‌ చేద్దాం.. నాలుగు దశాబ్దాలుగా కడప ఎంపీ స్థానంలో వైఎస్ కుటుంబ సభ్యులే ఉన్నారు.. 2014,2019 ఎన్నికల్లో రెండు సార్లు గెలిచిన అవినాష్ రెడ్డే.. ముచ్చటగా మూడోసారి బరిలోకి దిగనున్నారు. ఆయన సిట్టింగ్ ఎంపీ, అధికారంలో ఉన్నది కూడా వైసీపీనే.. మాములుగానే వైసీపీకి రాయలసీమ కంచుకోట.. అందులో సీఎం జగన్‌ సొంత ఇలాఖా కావడంతో.. ఆ జిల్లా మొత్తం ఆయన ఎఫెక్ట్ కనిపిస్తోంది.. చాలా నియోజకవర్గాల్లో వైఎస్ కుటుంబ సభ్యులే బరిలో ఉన్నారు.

- Advertisement -

Also Read: నేడే ఏపీ కాంగ్రెస్ జాబితా.. ఇడుపులపాయలో ప్రకటించనున్న షర్మిల

ఈసారి కూడా వైసీపీకే ఫేవర్‌గా ఉన్నట్టు ఉన్నాయి పరిస్తితులు.. ఇక టీడీపీ భూపేష్‌ రెడ్డిని బరిలోకి దింపుతోంది.. ఆయన ఆదినారాయణ రెడ్డి బంధువు.. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేఖత, ఆదినారాయణ రెడ్డి చరిష్మా.. ఇలా అన్ని తమకు కలిసివస్తాయన్న ధీమాలో ఉంది చంద్రబాబు. ఇప్పటి వరకు ఇదీ సీన్‌.. కానీ ఇప్పుడు షర్మిల ఎంట్రీతో సీన్ మారిపోనుంది.. ఇప్పటి వరకు వైఎస్ వివేకా హత్యను ప్రచారంలో వాడుకుంటున్న టీడీపీకి.. ఇప్పటికే నిందను మోస్తున్న వైసీపీ నేత అవినాష్‌ రెడ్డి కుటుంబానికి ఇది ఊహించని షాక్.. నేరుగా షర్మిల ఎంట్రీతో ఇప్పుడు వైఎస్‌ఆర్‌ అభిమానుల ఓట్లు చీలడం ఖాయంగా కనిపిస్తోంది. వివేకానంద రెడ్డి కూతురు సునీత, భార్య సౌభాగ్యమ్మ కూడా.. వైసీపీ వ్యతిరేక రాగం వినిపిస్తున్నారు.. ఇప్పుడు వీరంతా తమ మద్ధతును షర్మిలకు ప్రకటించడం ఖాయం.. సో.. గ్రౌండ్ లెవల్‌లో అవినాష్‌కు తలనొప్పులు తప్పవు.  నిజానికి ఒకప్పుడు తాను జగనన్న వదిలిన బాణాన్ని అని చెప్పే షర్మిల.. ఇప్పుడు అదే అన్నపై విమర్శల బాణాలను వదులుతున్నారు.

అన్నను అధికారం నుంచి దించడమే టార్గెట్‌ అన్న పంతంతో ముందుకు వెళుతున్నారు.. అందుకే వైఎస్‌ వివేకా హత్యను ఆమె హైలేట్ చేస్తున్నారు.. గత ఎన్నికల్లో ఇదే అంశాన్ని వాడుకొని కడప మొత్తం క్లీన్ స్వీప్ చేశారని.. ఇప్పుడు మాత్రం ఆ చాన్స్‌ లేదంటున్నారు షర్మిల.. సీబీఐ దర్యాప్తు నత్తనడకన సాగడానికి కారణం జగనే అంటున్నారు.. నిందితుడని తెలిసిన అవినాష్‌ రెడ్డి.. అతని కుటుంబాన్ని వెనకేసుకొస్తుంది జగనే అంటున్నారు.. అంతేకాదు నిందితుడిగా ఉన్న అవినాష్‌కు క్లీన్‌ చీట్‌ ఎలా ఇస్తారని నిలదీస్తూ.. వైసీపీకి ఓటు వేయద్దంటున్నారు షర్మిల. కానీ ఇదంతా షర్మిల అనుకున్నంతా ఈజీనా.. కాదు.. ఈ విషయం షర్మిలకు కూడా తెలుసు.

Also Read: నన్ను కలవడానికి వచ్చి.. సన్న బ్లేడ్‌లతో కట్ చేస్తున్నారు: పవన్ కళ్యాణ్

అందుకే తెర వెనక మంతనాలకు తెరలేపారు ఆమె.. అవినాష్ రెడ్డే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. జిల్లాలోని సీనియర్ కాంగ్రెస్ నేతలతో టచ్‌లో ఉంటున్నారు.. అంతేకాదు డీఎల్ రవీంద్ర రెడ్డి, వీరశివారెడ్డి, అహ్మదుల్లా లాంటి.. సీనియర్ మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే లను పార్టీలోకి ఇన్వైట్ చేస్తున్నారు. ఇటీవలే వైఎస్ వివేకా వర్థంతి సందర్భంగా ఆత్మీయ సమావేశం పేరిట భారీ సభను నిర్వహించారు.. అయితే తెర వెనక షర్మిలకు టీడీపీ సీనియర్లు మద్దతు పలుకుతున్నట్టు కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేకాదు.. వైసీపీలోని కీలక నేతలపై కూడా వైఎస్ఆర్‌ కూతురు కార్డును కూడా ప్రయోగిస్తున్నారు.

వైసీపీలోని సెకండ్ స్టేజ్‌ లీడర్లతో రహస్యంగా చర్చలు జరుపుతున్నారు. పెద్దల మాటకు ఎదురుచెప్పలేక ఇన్నాళ్లు అసంప్తిగా ఉన్న నేతలను గుర్తించి. వారితో కూడా టచ్ లోకి వెళ్తున్నారు.. సో మొత్తంగా చూస్తే కడప గడపలో జెండా పాతేందుకు చేయాల్సివన్నీ చేస్తున్నారు షర్మిల.మొత్తంగా చూస్తే ఈసారి కడప పాలిటిక్స్ మొత్తం వివేకా మర్డర్‌ చుట్టే తిరుగుతున్నాయి. చంద్రబాబు కావొచ్చు. ఇలా పార్టీ ఏదైనా.. నేతలు ఎవరైనా వారి ప్రచారాస్త్రం మాత్రం వివేక హత్య కేసే.. మరి ప్రజలు ఎవరి మాట నమ్ముతారు? ఎవరి పక్షాన నిలుస్తారు? ఎవరిని గెలిపిస్తారు? అక్కకు అండగా ఉంటారా? తమ్ముడికే మళ్లీ అధికారాన్ని కట్టబెడతారా? లేదంటే వైఎస్‌ ఫ్యామిలీని పక్కన పెట్టి సైకిల్‌పై సవారీకి రెడీ అవుతారా? మొత్తానికి మాత్రం కడప రాజకీయం మాత్రం చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News