E-Paper
Advertisement

Phone Tapping Case: ఫోన్ టాపింగ్ కేసులో కీలక మలుపు: మాజీ మంత్రి హరీష్ రావుకు సిట్ నోటీసులు!

Phone Tapping Case: ఫోన్ టాపింగ్ కేసులో కీలక మలుపు: మాజీ మంత్రి హరీష్ రావుకు సిట్ నోటీసులు!
Advertisement

Phone Tapping Case: గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతలు, వ్యాపారవేత్తలు, సినీ ప్రముఖుల ఫోన్లను అక్రమంగా ట్యాప్ చేశారనే ఆరోపణలపై సిట్ ఇప్పటికే పలువురు ఉన్నత స్థాయి పోలీసు అధికారులను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ టాపింగ్ కేసు విచారణలో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక విచారణ బృందం (SIT) మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుకు నోటీసులు జారీ చేసింది. రేపు (మంగళవారం) ఉదయం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరుకావాలని పోలీసులు ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.

విచారణలో భాగంగా అరెస్టయిన నిందితులు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా హరీష్ రావుకు ఈ నోటీసులు అందినట్లు తెలుస్తోంది. ఫోన్ టాపింగ్ ద్వారా సేకరించిన సమాచారం ఎవరికి చేరింది? ఇందులో రాజకీయ నాయకుల ప్రమేయం ఎంతవరకు ఉందనే కోణంలో సిట్ అధికారులు ఆయనను ప్రశ్నించనున్నారు. ఈ పరిణామంతో తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పెరిగింది. మరోవైపు, ఈ కేసులో మరికొంతమంది కీలక నేతలకు కూడా నోటీసులు అందే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

Advertisement

Read Also: Uttam Kumar Reddy: హుజూర్‌నగర్ రైతాంగానికి శుభవార్త..  మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన!

Related News

వినాయక నిమజ్జనానికి డీజే పెడుతున్నారా.. అయితే మీకో షాకింగ్ న్యూస్!

కేసీఆర్ చిటికె వేస్తే కాంగ్రెస్ నాయకులు ఊళ్లలో తిరగలేరు: జీవన్ రెడ్డి

చేయూత పింఛన్ అప్లై చేసుకోలేదా.. సాయంత్రం 5 గంటల వరకే లాస్ట్ ఛాన్స్!

మెదక్ జిల్లాలో మైండ్ బ్లాక్ అయ్యే న్యూస్.. 3 ఎకరాల రైతు ఖాతాలో 3,850 ఎకరాల భూమి?

ఇందిరమ్మ ఇండ్లు అప్లికేషన్ బిగ్ అప్డేట్.. లాస్ట్ డేట్ పొడిగింపు!

తల్లి కాంగ్రెస్‌నే ఎదిరించాం.. ఈ పిల్ల కాంగ్రెస్ ఓ లెక్కా? రేవంత్ సర్కార్‌పై కవిత ఫైర్!

ఎంపీడీవో, ఆర్‌ఐపై భద్రాద్రి జిల్లా కలెక్టర్ ఫైర్.. చర్యలు తీసుకోవాలని ఆదేశం!

అధికారులు కాదు.. తప్పు చేసిందే ప్రభుత్వం.. 22A వివాదంపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

Big Stories

Advertisement
×