E-Paper
Advertisement

Eternity OTT Release : ఓవైపు ప్రియుడు… మరోవైపు భర్త… చచ్చాక ఇదేం డైలమారా సామీ

Eternity OTT Release : ఓవైపు ప్రియుడు… మరోవైపు భర్త… చచ్చాక ఇదేం డైలమారా సామీ
Advertisement

Eternity OTT Release : ఒక అదిరిపోయే రొమాంటిక్ ఫాంటసీ చిత్రం త్వరలో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో విడుదల కానుంది. ఎలిజబెత్ ఒల్సేన్ నటించిన ఈ సినిమా టొరంటో అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రీమియర్‌గా ప్రదర్శించబడింది. ఇది మరణానంతర జీవితంలో శాశ్వతత్వం గడపడానికి, ఇద్దరు పురుషులలో ఒకరిని ఎంచుకోవాల్సిన ఒక స్త్రీ కథాంశం. థియేటర్లలో విడుదలైన తర్వాత, డిజిటల్ ఆడియన్స్ ఈ చిత్రం ఎప్పుడు వస్తుందోనని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే కథ డిఫరెంట్ గా ఉండటమే అందుకు కారణం. ఈ సినిమా పేరు, ఏ ఓటీటీలోకి రానుంది ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే

ఈ అమెరికన్ ఫాంటసీ రొమాంటిక్ కామెడీ మూవీ పేరు ‘ఎటర్నిటీ’ (Eternity). డేవిడ్ ఫ్రెయిన్ దీనికి దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో ఎలిజబెత్ ఓల్సెన్, మైల్స్ టెల్లర్, కల్లమ్ టర్నర్ నటించారు. డా’వైన్ జాయ్ రాండోల్ఫ్, జాన్ ఎర్లీ, ఓల్గా మెరెడిజ్ సహాయక పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2025 నవంబర్ 26న A24 ద్వారా యునైటెడ్ స్టేట్స్‌లో థియేటర్లలో విడుదలైంది. 2026 ఫిబ్రవరి 13 నుండి Apple TV+లో ఇది స్ట్రీమింగ్ అవుతుందని సదరు సంస్థ Xలో ట్రైలర్‌ను షేర్ చేసింది.

కథలోకి వెళ్తే

Advertisement

మనిషి చనిపోయిన తర్వాత ఒక వింతైన ప్రపంచంలో కథ జరుగుతుంది. అక్కడికి వచ్చే ప్రతి ఆత్మ, తమ జీవితాన్ని శాశ్వతంగా ఎవరితో గడపాలో నిర్ణయించుకోవడానికి వాళ్ళకి సరిగ్గా ఒక వారం (7 రోజులు) సమయం ఇవ్వబడుతుంది. ఈ సందర్భంలో జోన్ (ఎలిజబెత్ ఓల్సన్) చనిపోయిన తర్వాత ఒక వెయిటింగ్ ఏరియాకు చేరుకుంటుంది. అక్కడ ఆమె ఒక పెద్ద చిక్కులో పడుతుంది. ఆమె ముందు ఇద్దరు వ్యక్తులు ఉంటారు. అందులో ఒకరు ఆమె భర్త . జోన్ తన నిజ జీవితంలో ఎక్కువ కాలం ఇతనితోనే గడిపింది. వీరిద్దరి మధ్య ఎన్నో ఏళ్ల అనుబంధం, జ్ఞాపకాలు ఉన్నాయి.

అయితే మరొకరు ఆమె మొదటి ప్రేమికుడు ఉంటాడు. ఇతను జోన్ యువతిగా ఉన్నప్పుడే చనిపోయాడు. అతను గత 40 ఏళ్లుగా అక్కడే ఉంటూ, జోన్ ఎప్పుడు వస్తుందా అని ఆమె కోసం ఎదురుచూస్తుంటాడు. ఒకవైపు తనతో కలిసి ముసలితనం వరకు తోడున్న భర్త, మరోవైపు తన మనసులో చెదరని ముద్ర వేసిన మొదటి ప్రేమ. ఏడు రోజుల్లో ఆమె ఎవరినో ఒకరిని ఎంచుకోవాల్సి వస్తుంది. చివరికి జోన్ ఎవరిని ఎంచుకుంది? తన శాశ్వత జీవితం కోసం ఎవరితో వెళ్ళింది? అనేదే ఈ సినిమా క్లైమాక్స్.

Advertisement

Read Also :  34 ఎపిసోడ్‌లు, 3 సీజన్‌లు…, 6.6 IMDb రేటింగ్… ఓటీటీ ప్రపంచాన్ని కుదిపేసిన క్రేజీ సిరీస్

Tags

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×