BigTV English

IND Vs ENG 4th Test: రాంచీ టెస్ట్ కి యశస్వికి విశ్రాంతి.. వచ్చేస్తున్న KL రాహుల్

IND Vs ENG 4th Test: రాంచీ టెస్ట్ కి యశస్వికి విశ్రాంతి.. వచ్చేస్తున్న KL రాహుల్
kl rahul latest news

India Vs England 4th Test in Ranchi: ఇంగ్లాండ్ తో మూడో టెస్ట్ ముగిసిన వెంటనే నాలుగు రోజుల తేడాలో నాలుగో టెస్ట్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో జట్టులో మూడు మార్పులు జరగనున్నాయి. ఫిబ్రవరి 23 నుంచి 27 వరకు రాంచీలో జరగనున్న టెస్ట్ మ్యాచ్ కి స్టార్ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ కి విశ్వ్రాంతినివ్వాలని టీమ్ ఇండియా మేనేజ్మెంట్ ఆలోచన చేస్తోంది. వరుసగా రెండు టెస్టు మ్యాచ్ ల్లో రెండు డబుల్ సెంచరీలు సాధించిన యశస్వి వెన్నునొప్పితో బాధపడుతున్నాడు.


మూడో టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో సెంచరీ చేసిన తర్వాత గాల్లోకి ఎగిరి ఫీట్లు చేశాడు. దీంతో వెన్ను పట్టీసింది. ఎక్కువ సేపు క్రీజులో ఉండలేకపోయాడు. వెంటనే రిటైర్డ్ హర్ట్ గా వెనుతిరిగాడు. తర్వాత నాలుగోరోజు వచ్చి డబుల్ సెంచరీ పూర్తి చేశాడు. అయితే అప్పుడు నొప్పి తగ్గిందని అనుకున్నారు గానీ, ఫీల్డింగ్ లో చాలా అసౌకర్యంగా కనిపించాడు.దీంతో టీమ్ మేనేజ్మెంట్ ఆలోచించి నాలుగో టెస్ట్ కు విశ్రాంతి ఇవ్వాలని భావిస్తున్నట్టు సమాచారం.

Read More: విరాట్ కోహ్లీ వినయంగా ఉంటాడు.. పాకిస్థాన్ యువ పేసర్ ప్రశంసలు..


ఈ నేపథ్యంలో మొదటి టెస్టులో చక్కగా ఆడి, గాయపడి రెస్ట్ లో ఉన్న కేఎల్ రాహుల్ మళ్లీ నాలుగో టెస్టులో ఆడే అవకాశాలున్నాయని బీసీసీఐ తెలిపింది. దీంతో యశస్వి ప్లేస్ లో కేఎల్ రాహుల్ వస్తాడా? అని అంతా అనుకుంటున్నారు.

ఆల్రెడీ జస్ప్రీత్ బుమ్రాకి కూడా విశ్రాంతిని ఇచ్చారు. తన ప్లేస్ లో రంజీలు ఆడుతున్న ముఖేష్ కుమార్ రావచ్చు, లేదంటే కొత్త ఆటగాడు ఆకాశ్ దీప్ కి అవకాశం ఇవ్వవచ్చునని అంటున్నారు. ఇక యశస్వి ప్లేస్ లో దేవదత్ పడిక్కల్ అరంగేట్రం చేయవచ్చునని అంటున్నారు. లేదంటే రజత్ పటీదార్ కి మరొక అవకాశం ఇచ్చినా ఇవ్వవచ్చునని భావిస్తున్నారు.

ఇప్పుడు రజత్ పటీదార్ పరిస్థితి అర్థం కావడం లేదు. యశస్వి లేడు కాబట్టి, రాహుల్ అక్కడ సరిపోతున్నాడు. ఇప్పుడు రజత్ పటీదార్ కి మరొక అవకాశం ఇస్తారా? లేదంటే కొత్త ఆటగాడు దేవదత్ పడిక్కల్ తీసుకుంటారా? అనేది డౌటుగా ఉంది. అలా రజత్ పటీదార్ కి అవకాశం ఇస్తే, శుభ్ మన్ గిల్ ఓపెనర్ గా రావాల్సి ఉంటుంది.

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×