BigTV English

PM Modi: సింగరేణిపై మోదీ క్లారిటీ.. కేసీఆర్ కు ఈరోజు నిద్ర పట్టదా?

PM Modi: సింగరేణిపై మోదీ క్లారిటీ.. కేసీఆర్ కు ఈరోజు నిద్ర పట్టదా?

PM Modi: పీఎం మోదీ బ్యాక్ టు బ్యాక్ పంచ్ లు వేస్తున్నారు. పరోక్షంగా టీఆర్ఎస్, కేసీఆర్ కు స్ట్రాంగ్ కౌంటర్లు వేశారు. ఇటు హైదరాబాద్ లో బీజేపీ నేత హోదాలో గట్టి హెచ్చరిక పంపగా.. రామగుండం సభలో సైతం అదే జోరు కంటిన్యూ చేశారు. సింగరేణి గనుల ప్రైవేటీకరణపై ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. హైదరాబాద్ లో ఉన్నోళ్లకు ఈ రోజు నిద్ర పట్టదంటూ.. ఇన్ డైరెక్ట్ గా కేసీఆర్ ను టార్గెట్ చేశారు మోదీ.


సింగరేణిని ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని బహిరంగ సభ సాక్షిగా స్పష్టం చేశారు ప్రధాని మోదీ. హైదరాబాద్ నుంచి కొందరు కావాలనే రెచ్చగొడుతున్నారని అన్నారు. సింగరేణిలో తెలంగాణ వాటా 51 శాతం ఉందని.. కేంద్రం వాటా కేవలం 49 శాతమేనని గుర్తు చేశారు. ఏదైనా నిర్ణయం తీసుకునే హక్కు తెలంగాణ ప్రభుత్వానికి మాత్రమే ఉంటుందని తేల్చి చెప్పారు. బొగ్గు గనులపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. ఈరోజు వారికి నిద్ర పట్టదంటూ పీఎం మోదీ ఆగ్రహంగా మాట్లాడారు.

మోదీ మాటలన్నీ కేసీఆర్, టీఆర్ఎస్ సర్కారును ఉద్దేశించేనని అందరికీ తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ సంస్థలన్నిటినీ మోదీ అమ్మేస్తున్నారని.. ముందుముందు సింగరేణి గనులను కూడా ప్రైవేటుకు కట్టబెడతారంటూ కొంతకాలంగా గులాబీ నేతలు బాగా ప్రచారం చేస్తున్నారు. వారి ఆరోపణలకు చెక్ పెట్టేందుకు రామగుండం బహిరంగ సభను వేదికగా చేసుకున్నారు పీఎం మోదీ. లక్షలాది ప్రజల సమక్షంలో.. సింగరేణిని ప్రైవేటీకరించేది లేదని, ఆ హక్కు రాష్ట్రానిదే కానీ కేంద్ర ప్రభుత్వానిది కాదంటూ.. క్లారిటీగా చెప్పేశారు.


Related News

Bigg Boss 9 Promo: పాపం మరీ అంత బోర్ కొట్టేసిందా? కాస్త వారితో కూడా మింగిల్ అవ్వమ్మా?

US Army in Bangladesh: బంగ్లాలో సీక్రెట్ మిషన్..! రంగంలోకి యూఎస్ ఆర్మీ..

Amit Shah: మావోయిస్టుల రూట్ చేంజ్! కొత్త వ్యూహం ఇదేనా?

Telangana Sports: టార్గెట్ 2036 ఒలింపిక్స్..! గోల్డ్ తెచ్చిన వారికి రూ.6 కోట్ల నజరానా

Telangana BJP MP’s: మారకపోతే అంతే.. బీజేపీ ఎంపీలకు ఢిల్లీ పెద్దల వార్నింగ్

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్‌పై.. వైసీపీ పొలిటికల్ గేమ్

Bigg Boss 9 Promo: హౌస్ లో మరో స్టోరీ… ఇమ్మానుయేల్ నడుము గిల్లిన తనూజ!

Kakinada: కాకినాడ రూరల్ సెగ్మెంట్‌పై ఫోకస్ పెట్టని టీడీపీ పెద్దలు

Big Stories

×