BigTV English

PM Modi: ఫాంహౌజ్ కేసుపై వ్యూహాత్మక మౌనం?.. అందుకేనా మోదీ వార్నింగ్?

PM Modi: ఫాంహౌజ్ కేసుపై వ్యూహాత్మక మౌనం?.. అందుకేనా మోదీ వార్నింగ్?

PM Modi: హైదరాబాద్ గడ్డపై మోదీ స్పీక్ అదిరిపోయింది. సీఎం కేసీఆర్ కు పరోక్షంగా గట్టి హెచ్చరిక చేశారు. దోచుకునే వాళ్లను వదిలిపెట్టబోమంటూ వార్నింగ్ ఇచ్చారు. ఐటీలో ముందున్న రాష్ట్రాన్ని మూఢవిశ్వాస శక్తులు పాలిస్తున్నాయని.. అవినీతిపరులతో చేతులు కలిపారంటూ.. ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. అవినీతిని సహించనందుకే కొందరు తనను తిడుతున్నారని.. రోజూ రెండు, మూడు కిలోల తిట్లు తింటున్నానని.. అవే ప్రోటీన్లుగా మారి తనకు మరింత శక్తి ఇస్తోందంటూ సెటైరికల్ గా పంచ్ లు వేశారు. తనను, బీజేపీని ఎంత తిట్టినా పట్టించుకోనని.. కానీ, తెలంగాణ ప్రజల జోలికి వస్తే సహించేది లేదని తేల్చి చెప్పారు.


మునుగోడు ఎన్నిక గురించి కూడా మాట్లాడారు మోదీ. ఒక్క అసెంబ్లీ సీటు కోసం తెలంగాణ సర్కారు మొత్తం మునుగోడులో మకాం వేసిందని ఎద్దేవా చేశారు. మునుగోడులో కమల వికాసం కనిపించిందని.. తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని ప్రజలు చాటి చెప్పారని మోదీ అన్నారు.

ఇలా, తెలంగాణ అంశాలన్నిటినీ టచ్ చేస్తూ మోదీ ప్రసంగం కొనసాగింది. కేసీఆర్ విమర్శలు, మునుగోడు ఎన్నికలు, కమ్యూనిస్టులతో టీఆర్ఎస్ పొత్తు, అవినీతి ఆరోపణలు.. ఇలా తెలంగాణ రాజకీయాలపై మోదీ తనదైన స్టైల్ లో మాట్లాడారు. కానీ, ఒక్కటి మాత్రం మిస్ చేశారు. అదే మొయినాబాద్ ఫాంహౌజ్ ఎపిసోడ్. కావాలనే ఫాంహౌజ్ కేసుపై మోదీ మాట్లాడలేదని టీఆర్ఎస్ అంటోంది. అదంతా వ్యూహాత్మక మౌనమనేది విశ్లేషకుల మాట.


ఫాంహౌజ్ కేసే ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్. రిలీజైన వీడియో, ఆడియోల్లో.. అమిత్ షా, బీఎల్ సంతోష్ ల పేర్లు పదే పదే వినిపించాయి. మధ్య మధ్యలో మోదీ పేరు కూడా ప్రస్తావనకు వచ్చింది. కీలకమైన ఫాంహౌజ్ విషయం వదిలేసి.. మునుగోడు, అవినీతి, కామ్రేడ్ల పేరు తీసి మరీ మోదీ వార్నింగ్ ఇవ్వడం ఆసక్తికరం. ఫాంహౌజ్ ప్రస్తావన తీసుకొస్తే.. బీజేపీ ఇమేజ్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉందనే ఉద్దేశ్యంతోనే మోదీ కావాలనే ఆ విషయం దాటేశారని అంటున్నారు.

Related News

AP Politics: రచ్చ రేపుతున్న కావలి పాలిటిక్స్..

Palakurthi Politics: ఎర్రబెల్లి యూ టర్న్.. యశస్విని రెడ్డికి షాక్ తప్పదా?

Kadapa MLA: కడప రెడ్డమ్మ కథ రివర్స్..?

BJP Vs BRS: కేసీఆర్‌కు బీజేపీ షాక్! వెనుక స్కెచ్ ఇదే!

Urea War: బ్లాక్ మార్కెట్‌కు యూరియా తరలింపు.? కేంద్రం చెప్పిందెంత..? ఇచ్చిందెంత..?

AP Politics: సామినేని అంతర్మథనం..

Big Stories

×