BigTV English

Twitter Blue Tick Removed : బ్లూ టిక్ తొలగింపు.. మళ్లీ గందరగోళం..

Twitter Blue Tick Removed : బ్లూ టిక్ తొలగింపు.. మళ్లీ గందరగోళం..

Twitter Blue Tick Removed : ట్విట్టర్‌ను మస్క్ సొంతం చేసుకోగానే.. అనేక మార్పులు వచ్చాయి. వీటితో పాటు ట్విట్టర్లో గందరగోళం కూడా మొదలైంది. నకిలీ ఖాతాలను ఏరివేస్తామని కొనుగోలుకు ముందే మస్క్ హెచ్చరించారు. డిస్ల్పే ప్రొఫైల్ ఖాతాకు సంబంధించినిదే ఉండాలి లేదంటే అకౌంట్ డిలీట్ చేస్తామని మస్క్ రెండు రోజుల క్రితమే హెచ్చరించారు. గత కొన్ని రోజులుగా ప్రతీ రోజు ట్విట్టర్‌లో గందరగోళాలు, కొత్త ఫీచర్స్ గురించి కన్ఫ్యూజన్ ప్రజల్లో ఎక్కువైంది.


ట్విటర్‌లో నెలకు 8 డాలర్లు చెల్లిస్తే బ్లూటిక్‌ను ఖాతాకు జత చేస్తామని మస్క్ ప్రకటించడంతో అనేక మంది ఈ ఆఫర్‌కు స్వాగతం పలికారు. అయితే నిన్న మధ్యాహ్నం నుంచి కొత్త బ్లూటిక్ ఖాతాను కొనుగోలు చేసినవారికి కనిపించడం లేదు. దీనిపై నెటిజన్స్ ఆందోళనకు గురయ్యారు. నెలకు 8 డాలర్లతో బ్లూటిక్ ఖాతా అని ప్రకటించగానే కొన్ని చిన్న సంస్థలు, బిజినెస్ యూనిట్లు ప్రముఖ బ్రాండ్లతో ఉన్న పేరుపై బ్లూటిక్‌ను కొనుగోలు చేశారు. దీంతో అనేక నకిలీ ఖాతాలు ఇబ్బడిముబ్బడిగా పుట్టుకొచ్చాయి. వీటిని కంట్రోల్ చేయడం ట్విట్టర్‌కు కూడా పెద్ద సవాల్‌గా మారింది.

మస్క్ ట్విట్టర్‌ను కొనుగోలు చేయకముందు.. ప్రముఖులను వెరిఫై చేసి బ్లూటిక్ కేటాయించేవారు. అయితే ప్రస్తుతం ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. కేవలం 8 డాలర్లతో బ్లూటిక్ రావడంతో కొందరు స్పామర్స్‌కు ఇది ఓ పెద్ద అవకాశంగా మారింది. ఇక ప్రస్తుతం ఉన్న గందరగోళం నుంచి మస్క్ ఎలా బయటపడేయనున్నారో తెలుసుకోవాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.


Tags

Related News

Trump and Putin: ట్రంప్, పుతిన్ భేటీపై ఉత్కంఠ..! ఎవరి పంతం నెగ్గుతుంది..

America-Russia: అమెరికా-రష్యా చర్చలు విఫలమైతే భారత్ ని బాదేస్తాం.. తల, తోక లేని ట్రంప్ వార్నింగ్

Tsunami: నిశబ్దంగా.. 100 అడుగుల ఎత్తైన కెరటాలతో ముంచెత్తిన సునామీ, భారీ విధ్వంసం

India China Flights: అంతా సిద్ధమేనా? వచ్చేనెల నుంచే, భారత్-చైనా మధ్య విమాన సర్వీసులు

Donald Trump: ఆ వ్యాధితో బాధపడుతున్న ట్రంప్.. అందుకేనా ఇంత తేడాగా ఉన్నాడు?

Botulism Outbreak: ఆ సాండ్‌విచ్ తిన్న కొద్ది సేపట్లోనే ప్రముఖ గాయకుడు మృతి.. ఆ కూరగాయే కారణమా?

Big Stories

×