BigTV English

Police: ఆ శునకానికి పుష్పగుచ్ఛాలతో నివాళులు.. పోలీసు బ్యాండ్‌తో అంత్యక్రియలు

Police: ఆ శునకానికి పుష్పగుచ్ఛాలతో నివాళులు.. పోలీసు బ్యాండ్‌తో అంత్యక్రియలు

Dog Goldy: నిజామాబాద్ పోలీసు శాఖలో ఎనిమిదేళ్లు డాగ్ గోల్డీ సేవలు అందించింది. అనారోగ్యంతో బుధవారం ఆ శునకం కన్నుమూసింది. డాగ్ గోల్డీ మందుపాతరలను సమర్థవంతంగా గుర్తు పట్టేది. ఎనిమిదేళ్లు పోలీసు శాఖకు ఈ శునకం విలువైన సేవలను అందించింది. ఎంతో సహాయకారిగా పని చేసింది. ముఖ్యంగా రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంక ట్రంప్ పర్యటనల సమయాల్లో చురుకుగా పని చేసింది. ఉప్పల్ స్టేడియం వద్ద.. మరెన్నో చోట్ల ఈ శునకం డ్యూటీలు నిర్వహించింది. అనేక పతకాలు, ప్రశంసా పత్రాలను పొందింది.


బుధవారం అనారోగ్యంతో డాగ్ గోల్డీ మరణించింది. దీంతో ఈ శునకానికి అంత్యక్రియలు నిర్వహించాలని పోలీసు కమిషనర్ కల్మేశ్వర్ సింగనవార్ ఆదేశించారు. ఆయన ఆదేశాల మేరకు అదనపు డీసీపీ (అడ్మిన్) బి కోటేశ్వర్ రావు పుష్పగుచ్ఛాలతో నివాళుల్పించారు. పోలీసు బ్యాండ్‌తో ఈ శునకానికి అంత్యక్రియలు నిర్వహించారు.

ఈ సందర్భంగా అదనపు డీసీపీ బి కోటేశ్వర్ రావు మాట్లాడుతూ.. డాగ్ గోల్డీ 2016 బ్యాచ్ నుంచి విధులు నిర్వహిస్తున్నదని వివరించారు. ఎందరో ప్రముఖుల పర్యటనలో పోలీసు శాఖకు సహకారం అందించిందని తెలిపారు. గోల్డీ అంత్యక్రియల్లో ఆర్మ్ రిజర్వు ఏసీపీ నాగయ్య, హోం గార్డు ఏసీపీ అరుణ్ కుమార్, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ (అడ్మిన్) సతీశ్, ఎంటీవో తిరుపతి, వెల్ఫేర్ శ్రీనివాస్, జిల్లా వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ హనుమంత్ రెడ్డి, డాగ్ స్క్వాడ్ సిబ్బంది మనోహర్, సాయన్న, జగదీశ్, మోహన్, శ్రీకాంత్, స్పెషల్ పార్టీ సిబ్బంది సహా పలువురు పాల్గొన్నారు.


Also Read: NTRNeel: వీడి కంట పడితే నీడకైనా చెమటలే.. ఎన్టీఆర్ కు ట్రిబ్యూట్ ఇచ్చిన కెజిఎఫ్ మ్యూజిక్

ఇదిలా ఉండగా.. ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం పల్లామల్లి గ్రామానికి చెందిన హరి కిశోర్ తన పెంపుడు కుక్క రెండో వర్ధంతిని ఘనంగా నిర్వహించాడు. ఆరేళ్ల క్రితం విజయవాడలో లాబ్రడార్ జాతికి చెందిన శునకాన్ని నెల వయసు ఉన్నప్పుడు హరి కిశోర్ కొనుగోలు చేశాడు. ఆ శునకానికి ముద్దుగా హాచీ అని పేరు పెట్టుకున్నాడు. ఎప్పుడూ హాచీతో కిశోర్ ప్రేమగా మెలిగేవాడు. ఆ శనకం కిశోర్ కుటుంబంలో ఒక సభ్యుడిగా మెలిగింది. కానీ, రెండేళ్ల క్రితం హాచికి తలలో బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది. దీంతో ఒంగోలు వెటర్నరీ హాస్పిటల్‌లో ఆపరేషన్ చేశారు. కానీ, ఆ ఆపరేషన్ వికటించింది. శునకం చిపోయింది.

ఇది హరి కిశోర్‌ను బాధపెట్టింది. కుటుంబంలో ఒక్కరిగా భావించిన హాచీ డాగ్ మరణించడంతో దానికి అంత్యక్రియలు నిర్వహించాడు. నేడు రెండో వర్ధంతి కావడంతో బంధు మిత్రుల మధ్య పెద్ద కర్మ చేసి భోజనాలు పెట్టాడు.

Related News

Hyderabad News: జీహెచ్ఎంసీ నిఘా.. ఆ పని చేస్తే బుక్కయినట్టే, అసలు మేటరేంటి?

Weather News: కొన్ని గంటల్లో ఈ ఏరియాల్లో భారీ వర్షం.. ఇక రాత్రంతా దంచుడే

Nagarjunasagar flood: నాగార్జునసాగర్‌ గేట్లు ఎత్తివేత.. సందర్శకులకు బిగ్ అలర్ట్!

Hyderabad Rains: అమీర్‌పేట ముంపు ప్రాంతాల్లో సీఎం రేవంత్ పర్యటన.. అధికారులకు కీలక ఆదేశాలు

Malreddy Ranga Reddy: రంగారెడ్డి ఎమ్మెల్యే మల్‌రెడ్డి కుటుంబంలో రాఖీ పండుగ రోజే విషాదం

Rain News: భారీ వర్షం.. ఈ జిల్లాల్లో కుండపోత వాన.. ఇళ్ల నుంచి బయటకు రావొద్దు

Big Stories

×