BigTV English

Soaked Peanuts: వీటిని తరచూ నానబెట్టుకుని తింటే బాదం కూడా పనికి రాదండోయ్..

Soaked Peanuts: వీటిని తరచూ నానబెట్టుకుని తింటే బాదం కూడా పనికి రాదండోయ్..

Soaked Peanuts: తరచూ డ్రైఫ్రూట్స్ తినడం వల్ల ఆరోగ్యానికి చాలా రకాల ప్రయోజనాలు ఉంటాయి. ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితులలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి పండ్లు, డ్రైఫ్రూట్స్, కూరగాయలు, ఆకుకూరలు ముఖ్య పాత్రను పోషిస్తాయి. అంతేకాదు డ్రైఫ్రూట్స్ అయితే ప్రత్యేకంగా ఇచ్చే ప్రయోజనాలు బోలెడు ఉంటాయి. ఈ తరుణంలో డ్రైప్రూట్స్ అనగానే ముందుగా బాదం పప్పు గుర్తుకు వస్తుంది. బాదంపప్పు, జీడిపప్పు, కిస్మిస్, అంజీర పండు వంటి చాలా రకాల డ్రైఫ్రూట్స్ ఆరోగ్యానికి పుష్కలమైన ప్రయోజనాలు ఇస్తాయి. అయితే కేవలం ఇవి మాత్రమే కాకుండా ఒక తెలియని డ్రైఫ్రూట్ కూడా చాలా రకాల ప్రయోజనాలు కలిగిస్తుంది. బాదం పప్పు కంటే ఎక్కువ పోషకాలను కలిగి ఉంటుంది. అయితే ఆ డ్రైఫ్రూట్స్ ఏంటి, దాని ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.


నానబెట్టిన వేరుశెనగలు తినడం వల్ల ఆరోగ్యానికి పుష్కలమైన ప్రయోజనాలు ఉంటాయి. బాదం పప్పు కంటే వేరుశెనగ పప్పులో పోషకాలు ఎక్కువగా ఉంటాయని చాలా మందికి తెలియదు. వేరుశెనగలను నానబెట్టి తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఇవి తక్కువ ధరకు లభించడమే కాకుండా చాలా పోషకాలను అందించి మేలు చేస్తాయి. అయితే వేరుశెనగ పప్పును ప్రతీ రోజు తీసుకోవడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ మెరుగ్గా జరుగుతుంది.

అంతేకాదు రక్త ప్రసరణను అదుపులో కూడా ఉంచుతుంది. ఇక గుండె ఆరోగ్యానికి కూడా వేరుశెనగ చాలా మేలు చేస్తుంది. అయితే వేరుశెగను కేవలం నానబెట్టి తినడం మాత్రమే కాకుండా వేరుశెనగలను బెల్లంతో కలిపి తీసుకున్నా కూడా మంచి ప్రయోజనం ఉంటుంది. దీనివల్ల కీళ్ల నొప్పులు, వెన్ను నొప్పి వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇక వీటిని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు కూడా తగ్గించుకోవచ్చు.


వేరుశెనగల్లో యాంటీ ఆక్సిడెంట్లు, కాల్షియం, ఫోలేట్, జింక్, ఐరన్ వంటి పుష్కలంగా ఉంటాయి. వీటి వల్ల క్యాన్సర్ వంటి ప్రాణాంతకర వ్యాధి బారిన పడకుండా కూడా తోడ్పడుతుంది. ఇక గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. మరోవైపు ఇందులో ఉండే ఫైటిక్ యాసిడ్ వంటి సమ్మేళనాలు సులభంగా జీర్ణం అయ్యేలా జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తాయి. వేరుశెనగల్లో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల దీనిని స్నాక్ రూపంలో తీసుకున్నా కూడా జీర్ణ సమస్యలను తగ్గించుకోవచ్చు.

(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)

Related News

Pneumonia causes: న్యుమోనియా రావడానికి అసలు కారణాలివే !

Pineapple Benefits: ఖాళీ కడుపుతో పైనాపిల్ తింటే.. ఇన్ని లాభాలా ?

Night Shift Workers: నైట్ షిప్ట్ చేస్తున్నారా ? ఈ టిప్స్ మీకోసమే !

Late Sleep: రాత్రి 11 తర్వాత నిద్రపోతున్నారా ? ఈ సమస్యలు తప్పవంటున్న నిపుణులు !

Japanese Interval Walking: జపనీస్ ఇంటర్వెల్ వాకింగ్.. ప్రయోజనాలు తెలిస్తే ఈ రోజు నుంచి మొదలెడతారు !

Momos side effects: మొమోస్ తింటున్నారా? అయితే ఈ నిజం తప్పక తెలుసుకోండి..

Big Stories

×