Notice to Kaushik Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల తొమ్మిదిన కౌశిక్ రెడ్డి దళిత బంధు డబ్బులు విడుదల చేయాలని హుజురాబాద్ లో ధర్నా, రాస్తారోకో చేశారు. కానీ ధర్నా చేసేందుకు కౌశిక్ రెడ్డి పోలీసుల వద్ద ఎలాంటి పర్మిషన్ తీసుకోలేదు. దీంతో అనుమతులు లేకుండా ధర్నా చేసినందుకు సెక్షన్ 35(3) బీఎన్ఎస్ యాక్టు కింద కౌశిక్ రెడ్డి, మరికొందరు బీఆర్ఎస్ నాయకులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు.
Also read: కమెడియన్ ఆలీకి నోటీసులు.. రిప్లై ఎలా ఉంటుందో?
ఇదిలా ఉంటే బీఆర్ఎస్ లో యాక్టివ్ గా ఉండే నాయకుల్లో కౌశిక్ రెడ్డి కూడా ఒకరు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ఓటమి పాలైన నాటి నుండి కేటీఆర్ కు దగ్గరగా ఉంటూ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. తరచూ ప్రెస్ మీట్ లు నిర్వహిస్తూ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ఇటీవల ఎమ్మెల్యే అరికపూడి గాంధీపై ఘాటు విమర్శలు చేయడంతో ఆయన కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లి వార్నింగ్ ఇచ్చారు. పార్టీ ఫిరాయించిన ఇతర నేతలపైనా కామెంట్లు చేసి వార్తల్లో నిలిచారు.
అంతే కాకుండా ఆంధ్రా తెలంగాణ అంటూ కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. దీంతో ఆంధ్రా సెటిలర్లు బీఆర్ఎస్ పై నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఒకలా ఉండి అధికారం పోవడంతోనే సెంటిమెంట్ ను రగిలిస్తోందని విమర్శలు వచ్చాయి. ఇలా కౌశిక్ రెడ్డి వ్యవహారం కొన్ని సార్లు ఆ పార్టీకి సైతం నష్టం కలిగించేలా ఉందని సొంతపార్టీ నుండి విమర్శలు వచ్చాయి.