Police Seized Ganja : తెలంగాణలోని కొత్తగూడెం జిల్లా భద్రచలం వద్ద భారీగా గంజాయి పట్టుబడింది. ఒరిస్సా నుంచి హైదరాబాద్ కు రెండు ఆటోల్లో తరలిస్తున్న 118 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రానికి సరిహాద్దుగా ఉన్న ఒరిస్సాలోని కలిమెళ్ల ప్రాంతం నుంచి తెలంగాణలోని హైదరాబాద్ కు నిందితులు అక్రమంగా గంజాయిని తరలిస్తున్నట్లు పోలీసులు పక్కా సమాచారం అందింది. దాంతో.. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అండ్ ఎక్సైజ్ శాఖ, పోలీసులు కలిసి కూనవరం రోడ్డు భద్రాచలం ఆర్టీవో చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు చేపట్టారు. ఇక్కడే రెండు ఆటోల్లో తరలిస్తున్న గంజాయి పట్టుపడింది.
అనుమానాస్పదంగా గుర్తించిన రెండు ఆటోలను తనిఖీలు చేసిన పోలీసులు అందులో గంజాయి ఉన్నట్లు నిర్థరించుకున్నారు. ఈ సమయంలో ఇద్దరు నిందితులు పట్టుపడగా, ఒక వ్యక్తి పోలీసులను చూపి పరారయ్యాడు. స్వాధీనం చేసుకున్న గంజాయి 118 కేజీలుగా పోలీసులు తేల్చారు. గంజాయితో దొరికిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, మరోవ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఘటనలోని రెండు ఆటోలను సీజ్ చేశారు. మొత్తంగా ఈ సోదాల్లో రూ. 31.50 లక్షల గంజాయిని సీజ్ చేసినట్లు ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ కరమ్ చందు తెలిపారు. ఈ తనిఖీల్లో ఎస్.ఐ గౌతమ్ ఆధ్వర్యంలో సిబ్బంది పాల్గొన్నారు. వీరిని ఉన్నతాధికారులు అభినందించారు.
ఈ కేసులో అరెస్టైన నిందితులు హైదరాబాద్ కు చెందిన కనిగల స్వాతిక్, మణుగూరు కు చెందిన గుంజు ఆమోస్ లుగా గుర్తించిన పోలీసులు.. సపావత్ వెంకన్న అనే వ్యక్తి పరారైనట్లు గుర్తించారు. అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
తెలంగాణాలో డ్రగ్స్ వినియోగంపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని సూచించిన నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. గంజాయి సహా ఎలాంటి మత్తు పదార్థాలు నగరాల్లోకి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
Also Read : డబ్బులు ఇస్తావా.? చస్తావా.?.. అధికార పార్టీ ఎమ్మెల్యేకే బెదిరింపు
ఈ కారణంగా ఇటీవల కాలంలో హైదరాబాద్ నగరంతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలు పెద్ద ఎత్తున పట్టుబడుతున్నాయి. వాటిపై కఠిబ సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తున్న పోలీసులు, నిందితుల్ని రిమాండ్ కు పంపిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్ లోని మూడు డివిజన్ల పరిధిలోని మూడు ఎక్సైజ్ పోలీసు స్టేషన్లలో నమోదైన 79 కేసుల్లో.. పట్టుపడిన సుమారు రూ.3 కోట్ల విలువైన గంజాయి, డ్రగ్స్ ను పోలీసులు దహనం చేశారు.