Big Stories

RCB Vs GT Match Preview: ఆర్సీబీ మళ్లీ పంజా విసురుతుందా..? నేడు గుజరాత్ టైటాన్స్‌‌తో మ్యాచ్!

IPL 2024 52nd Match RCB Vs GT Preview: మొదట్లో మ్యాచ్‌లన్నీ ఓడిపోయి, అట్టడుగు స్థానానికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పడిపోయింది. చివర్లో టీమ్ అంతా యాక్టివ్ అయ్యింది. ఇప్పుడంతా అద్భుతంగా ఆడుతున్నారు.. ఇంతకు ముందు వరుసగా ఓడిపోయిన టీమ్ ఇదేనా? అని అంతా ఆశ్చర్యపోతున్నారు. ఈ నేపథ్యంలో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో నేడు గుజరాత్ వర్సెస్ ఆర్సీబీ మధ్య రాత్రి 7.30కి మ్యాచ్ జరగనుంది.

- Advertisement -

ఇకపోతే ప్రస్తుతం 10 మ్యాచ్ లు ఆడి 4 గెలిచిన గుజరాత్ 8 పాయింట్లతో 8వ స్థానంలో ఉంది. ఆర్సీబీ కూడా 10 మ్యాచ్ లు ఆడి 3 గెలిచి 6 పాయింట్లతో అట్టడుగు స్థానంలో ఉంది. ఈ రెండు జట్ల మధ్య ఇప్పటివరకు 4 మ్యాచ్ లు జరిగాయి. 2 గుజరాత్, 2 ఆర్సీబీ విజయం సాధించాయి.

- Advertisement -

ఆర్సీబీలో ఇప్పుడందరూ ఫామ్ లో ఉన్నారు. ఓపెనర్లు కోహ్లీ, కెప్టెన్ డుప్లెసిస్ ఇద్దరూ బాగా ఆడుతున్నారు. అలాగే విల్ జాక్స్, రజత్ పటీదార్, కెమరూన్ గ్రీన్ వీళ్లందరూ టచ్ లోకి వచ్చారు. ఇరగదీసి వదిలేస్తున్నారు. అంతేకాదు మహ్మద్ సిరాజ్ సెట్ అయ్యాడు. యష్ దయాల్, కరణ్ శర్మ, ఫెర్గ్యూసన్ అందరూ బాగా బౌలింగ్ చేసి, ప్రత్యర్థులను కట్టడి చేస్తున్నారు.

Also Read: ప్లే ఆఫ్ నుంచి ముంబై అవుట్.. కోల్ కతా మరో విజయం

గుజరాత్ టైటాన్స్ విషయానికి వస్తే కెప్టెన్ శుభ్ మన్ గిల్ ఆటతీరు చాలా నిరాశజనకంగా ఉంది. తను కరెక్ట్ గా ఆడకపోతే, నాయకత్వానికే మచ్చ వచ్చేలా ఉంది. ఓపెనర్ వృద్ధిమాన్ సాహా భారీ స్కోర్లు బాకీ ఉన్నాడు. సాయి సుదర్శన్, రాహుల్ తెవాతియా అప్పుడప్పుడు నిలబెడుతున్నారు. డేవిడ్ మిల్లర్, ఓమర్ జాయ్, షారూఖ్ ఖాన్ మ్యాచ్ లు అయిపోతున్నాగానీ, టచ్ లోకి రావడం లేదు.

రషీద్ ఖాన్, మోహిత్ శర్మ, నూర్ అహ్మద్, సాయి కిశోర్ బాగా బౌలింగు చేస్తున్నా, బ్యాటర్లు భారీ స్కోరు చేయలేకపోవడంతో మ్యాచ్ లను నిలబెట్టలేకపోతున్నారు. మరి ఇప్పుడే ఫామ్ లోకి వచ్చిన ఆర్సీబీని గుజరాత్ నిలువరిస్తుందా? లేదా అనేది వేచి చూడాల్సిందే.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News