Kavitha : కవిత భయపడ్డారా? మైకుల ముందు నిజాలు చెప్పడానికి ధైర్యం చాలలేదా? అన్న కుట్రలు బయట పెట్టలేక పోయారా? దెయ్యాలెవరో చెప్పలేక పోయారా? బీఆర్ఎస్‌తో తెగదెంపులే అని స్టేట్‌మెంట్ ఇవ్వలేక పోయారా? అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు. తెలంగాణ జాగృతి కొత్త కార్యాలయం ఓపెనింగ్ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కవిత.. తాను చెప్పాలనుకున్నది సూటిగా చెప్పలేక చేతులెత్తేశారని అంటున్నారు.
కవిత భయపడ్డారా?
ఇటీవల చిట్‌చాట్‌లో చాలానే బాంబులు పేల్చారు కవిత. కేటీఆర్ టార్గెట్‌గా పదునైన విమర్శలు చేశారు. ఇంటి గుట్టు అంతా బయటపెట్టేశారు. ఇన్నాళ్లూ చాటుమాటుగా దెబ్బ కొట్టిన కవిత.. అసలు టైమ్ వచ్చేసరికి నోటికి తాళం వేసేశారు. అన్నను ఒక్కమాట కూడా అనలేదు. పార్టీలో కుట్రల జోలికి వెళ్లలేదు. బీజేపీలో విలీనం ప్రస్తావనే తేలేదు. కేవలం కేసీఆర్ గొప్పలు చెప్పారు. రేవంత్‌రెడ్డిపై విమర్శలు చేశారు. ఎందుకు? కవిత భయపడ్డారా?
జాగృతితో క్లియర్ కట్ మెసేజ్
అయితే, అసలు మేటర్ మాత్రం సూటిగా, సుత్తి లేకుండా.. ఇన్‌డైరెక్ట్‌గా చెప్పేశారు కవితం. ఇక బీఆర్ఎస్‌తో పని చేయను.. తనకూ కారు పార్టీకి సంబంధం లేదు.. అని చెప్పకుండా.. మరో రకంగా విషయం కక్కేశారు. ఇకనుంచి కేసీఆర్‌కు బీఆర్ఎస్ ఒక కన్ను అయితే.. ఇంకో కన్నులా జాగృతి ఉంటుందంటూ అసలు సంగతి చెప్పేశారు. అంటే, ఇక నుంచి బీఆర్ఎస్ వేరు, జాగృతి వేరు అన్నట్టేగా? గులాబీ పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పకనే చెప్పేసినట్టేగా? జాగృతితో కవిత కొత్త కుంపటి పెట్టుకున్నట్టేగా? ఇకనుంచి ఆమె జెండా, ఎజెండా వేరే అన్నట్టేగా? కొత్త కార్యాలయం అందుకేగా? అనే చర్చ మొదలైంది.
ఆ ముగ్గురూ ఫెయిల్?
ఇకపై తెలంగాణ జాగృతి.. బీఆర్ఎస్‌కు అనుబంధం కాదు. సరికొత్త రాజకీయ పార్టీ అనే మెసేజ్ ఇచ్చారు కవిత. పార్టీ అనుబంధ విభాగాలను సైతం ఏర్పాటు చేస్తున్నారు. అయితే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాటాలకు బీఆర్ఎస్ ఉండగా.. మళ్లీ కొత్తగా జాగృతి ఎందుకు అనేది ప్రశ్న. ప్రజా సమస్యలపై పోరాటాలు చేయడంలో కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావు ఫైయిలయ్యారని కవిత చెప్పకనే చెప్పారా? కేసీఆర్ పెట్టిన బీఆర్ఎస్‌తో ఆయన కూతురు కవిత తెగదెంపులు చేసుకున్నట్టేనా? కేసీఆర్ చుట్టూ దెయ్యాలున్నాయని చెప్పిన ఆమె.. తన దారి తాను చూసుకున్నారా? అంటూ సోషల్ మీడియాలో విమర్శలు వినిపిస్తున్నాయి.
Also Read : మళ్లీ నీ విగ్రహమే పెట్టుకున్నావా కవితక్క?