Nagachaitanya: సినీ నటుడు నాగచైతన్య (Nagachaitanya)తాజాగా తన భార్య శోభిత (Sobhita)తో కలిసి ఒక క్యూట్ సెల్ఫీ ఫోటోని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. సోషల్ మీడియాకు చాలా దూరంగా ఉండే నాగచైతన్య ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ అవుతూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా తన భార్య శోభిత పుట్టినరోజు(Birth Day) సందర్భంగా ఆమెతో కలిసి దిగిన ఒక సెల్ఫీ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ శోభితకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
హ్యాపీ బర్త్ డే మై లేడీ….
నేడు(మే 31) శోభిత తన 33వ పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్న నేపథ్యంలో నాగ చైతన్య ఆమెకు శుభాకాంక్షలు చెబుతూ… “పుట్టినరోజు శుభాకాంక్షలు మై లేడీ” అంటూ ఒక సెల్ఫీ ఫోటోని షేర్ చేశారు. దీంతో ఈ ఫోటో కాస్త వైరల్ అవుతుంది. నాగచైతన్య శోభిత వివాహం జరిగిన తర్వాత వచ్చిన మొదటి పుట్టినరోజు కావడంతో ఈ పుట్టినరోజు వేడుకలను ఎంతో ప్రత్యేకంగా జరుపుకుంటున్నారని తెలుస్తోంది. అయితే ఈ పుట్టినరోజు వేడుకలను జరుపుకోవడం కోసం ఈ జంట విదేశాలకు వెళ్లినట్టు సమాచారం.
పెళ్లి తర్వాత మొదటి పుట్టినరోజు…
ఇక శోభిత నాగచైతన్య గత ఏడాది డిసెంబర్ 4వ తేదీ అన్నపూర్ణ స్టూడియోలో ఎంతో ఘనంగా వివాహం జరుపుకున్నారు.. వీరి వివాహానికి అతి కొద్ది మంది స్నేహితులు, కుటుంబ సభ్యులు, సినీ సెలబ్రిటీలు హాజరై సందడి చేశారు. నాగచైతన్య సమంతకు విడాకులు ఇచ్చిన తర్వాత శోభిత ప్రేమలో పడటం పెద్దల సమక్షంలో ఆమెను వివాహం చేసుకోవడం జరిగింది. సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగచైతన్య కొన్ని భేదాభిప్రాయల కారణంగా ఆమె నుంచి విడాకులు తీసుకొని విడిపోయారు. ఇక సమంత నుంచి విడిపోయిన తర్వాత శోభిత పరిచయం కావడం, ఆమె పరిచయం ప్రేమగా మారడంతో వీరిద్దరూ పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు.
ఇక వీరి ప్రేమ గురించి సోషల్ మీడియాలో పలు సందర్భాలలో వార్తలు వచ్చినప్పటికీ కూడా ఈ జంట ఎక్కడ ఈ రూమర్లపై ఖండించలేదు కానీ నిశ్చితార్థం చేసుకుని షాక్ ఇచ్చారు. నాగ చైతన్య శోభితను వివాహం చేసుకున్న తర్వాత తాను చాలా సంతోషంగా ఉన్నానని, పలు సందర్భాలలో తెలియజేశారు. ఇక పెళ్లి తర్వాత కూడా శోభిత పలు సినిమాలకు కమిట్ అయిన విషయం మనకు తెలిసిందే. ఇక నాగచైతన్య కూడా ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. నాగచైతన్య చివరిగా తండేల్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో నాగచైతన్య జోడిగా సాయి పల్లవి నటించారు. నిజ జీవిత కథ ఆధారంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ద్వారా మరో సక్సెస్ ను తమ ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం ఈయన పలు ప్రాజెక్టులతో బిజీగా గడుపుతున్నారు.