BigTV English

Sharmila: ‘టాక్ ఆఫ్ ది స్టేట్’ షర్మిల.. అంతా కేసీఆర్ స్కెచ్చా!?

Sharmila: ‘టాక్ ఆఫ్ ది స్టేట్’ షర్మిల.. అంతా కేసీఆర్ స్కెచ్చా!?

Sharmila: ఉన్నట్టుండి షర్మిల టాక్ ఆఫ్ ది తెలంగాణ అయ్యారు. రెండు రోజులుగా షర్మిలనే బ్రేకింగ్ న్యూస్. నర్సంపేటలో ఆమె ఫ్లెక్సీలు, పార్టీ బస్సు తగలబెట్టడం.. అక్కడ అరెస్ట్ చేసి హైదరాబాద్ తీసుకురావడం.. కట్ చేస్తే, మర్నాడు మరో హైలైట్ సీన్. ధ్వంసమైన కారులో ప్రగతి భవన్ ముట్టడించేందుకు షర్మిల బయలుదేరడం.. పోలీసులు అడ్డుకోవడం.. ఆమె కారు దిగకపోవడం.. కారులోనే ఉన్న షర్మిలను అలానే పోలీస్ స్టేషన్ కు తరలించడం.. ఇంట్లో విజయమ్మ దీక్ష చేపట్టడం.. అంతా సినిమాటిక్ రేంజ్ లో సాగిపోయింది డ్రామా. అంతకుమించి హైడ్రామా నెలకొంది.


షర్మిల ఇప్పటివరకు 3,500 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. ప్రతీరోజు కేసీఆర్ అండ్ కో ను తిడుతూనే ఉన్నారు. ఏ ప్రాంతంలో పాదయాత్ర చేస్తే.. అక్కడి మంత్రిని, ఎమ్మెల్యేను విమర్శించడమే ఆమె పని. అలాంటిది సడెన్ గా నర్సంపేటలో ఆమె ఏదో అన్నారని టీఆర్ఎస్ శ్రేణులు దాడి చేయడం ఆసక్తికరం. షర్మిల కూడా అంత అనరాని మాటలేమీ అనలేదు. రొటీన్ విమర్శలే. అయినా కూడా గులాబీ శ్రేణులు రెచ్చిపోయారు. ఫ్లెక్సీలు, బస్సు తగలబెట్టారు. ఏదో తేడాగా లేదూ..? నెక్ట్స్ రోజు ఇష్యూ మరింత రక్తి కట్టింది. షర్మిలను కారుతో సహా స్టేషన్ కు తరలించడం.. ఈమధ్య కాలంలో ఎప్పుడూ చూడని దృశ్యం.

రాజకీయాలు ఇలానే ఉంటాయి. ఒకదానిపై ఒకటి బటర్ ఫ్లై ఎఫెక్ట్ లా పని చేస్తాయి. పైపైన చూస్తే ఏమీ అర్థం కాదు. మునుగోడు ఎలక్షన్స్ నాటి నుంచి తెలంగాణ పాలిటిక్స్ హాట్ హాట్ గా సాగుతున్నాయి. ఫాంహౌజ్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం వెలుగుచూడటం, ఆ వెంటనే మంత్రి గంగుల కమలాకర్ గ్రానైట్ కంపెనీలపై ఈడీ దాడులు జరిగాయి. ఆ తర్వాత సిట్ దూకుడు, బీఎల్ సంతోష్ కు నోటీసులు ఇవ్వడం.. ఆ వెంటనే తలసాని బ్రదర్స్ ను ఈడీ ప్రశ్నించడం, మంత్రి మల్లారెడ్డి ఇళ్లు, ఆస్తులపై పెద్ద ఎత్తున ఐటీ దాడులు జరగడం.. అంతా ఇంటర్ లింకే అంటున్నారు. తాజాగా, బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించడం, హైకోర్టు పర్మిషన్ ఇవ్వడం.. ఇదే సమయంలో షర్మిల ఇష్యూ తెరమీద రచ్చ చేయడం.. ఏదో అనుమానాస్పదం అంటున్నారు.


ఇటీవల ఎంపీ అర్వింద్ ఇంటిపై టీఆర్ఎస్ శ్రేణులు దాడులు చేశాయి. అప్పుడు కూడా అర్వింద్ అంతగా ఘాటు వ్యాఖ్యలు ఏమీ చేయలేదు. అయినా, కవితకు ఆగ్రహం తెప్పించింది. ఇప్పుడుకూడా అంతే. షర్మిల సైతం పెద్దగా ఏమీ అనలేదు. అయినా, గులాబీ నేతలకు కోపం వచ్చింది. ఈ కోపం కావాలనే తెచ్చిపెట్టుకున్నదా? అనే డౌట్. కొన్ని ఇష్యూలను సైడ్ ట్రాక్ చేయడానికి.. మరికొన్నిటిని యాక్టివేట్ చేస్తున్నారా? కాంగ్రెస్-రేవంత్ రెడ్డిని ఎదగకుండా చేసేందుకు బీజేపీకి హైప్ క్రియేట్ చేసినట్టు.. బీజేపీ ఎదుగుతున్న సమయంలో వరుస దాడులు జరుగుతుండటాన్ని ఎలా చూడాలి? షర్మిల ఎపిసోడ్ అనుకోకుండా జరిగిందా? కావాలనే హైడ్రామా క్రియేట్ చేశారా? ఏమో రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే అంటున్నారు.

Related News

AP Heavy Rains: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏపీకి అతి భారీ వర్ష సూచన.. రేపు ఈ జిల్లాల్లో

YS Jagan: మీది రెడ్ బుక్ అయితే.. మాది డిజిటిల్ బుక్, కథ వేరే ఉంటది.. జగన్ సంచలన వ్యాఖ్యలు

Yellow Shirt: అసలైన పసుపు సైనికుడు.. కూతురు పెళ్లిలో కూడా పసుపు చొక్కానే

Roja Hot Comments: శుక్రవారం వస్తే జంప్.. జగన్‌పై రోజా సెటైర్లు?

Digital Book: డిజిటల్ బుక్‌తో వైసీపీ వార్నింగ్.. రెడ్ బుక్ విజృంభించే టైమ్ వచ్చిందా?

Mother Killed Son: కళ్లలో కారం, చీరతో ఉరి.. ఎకరం భూమి కోసం కొడుకును చంపిన తల్లి

Jagan: ప్రతిపక్ష హోదా వల్ల లాభం ఏంటి? ఎమ్మెల్యేలకు ప్రశ్నించే హక్కు ఉండదా? జగన్ లాజిక్ ఏంటి?

Tirumala News: భక్తులకు నేరుగా శ్రీవారి దర్శనం, సాయంత్రం తిరుమలకు సీఎం చంద్రబాబు

Big Stories

×