E-Paper
Advertisement

MLC Kavitha : కవిత మరో షర్మిల..?

MLC Kavitha : కవిత మరో షర్మిల..?
Advertisement

MLC Kavitha : కవిత లేఖ కారు పార్టీలో కలకలం రేపుతోంది. తెలంగాణలో హాట్ టాపిక్‌గా మారింది. కవిత స్థాయి నేత.. తండ్రికి లేఖ రాస్తే.. అది ఎలా బయటకు వచ్చింది? లెటర్ ఎలా లీక్ అయింది? ఎవరు లీక్ చేశారు? సరిగ్గా కవిత విదేశాల్లో ఉన్న సమయంలోనే లేఖ వైరల్ కావడం వెనుక వ్యూహం ఉందా? కవిత వేరు కుంపటి కన్ఫామా? బీఆర్ఎస్, బీజేపీల పొత్తు ఉంటుందా? ఇలా తెలంగాణ రాజకీయ ముఖచిత్రాన్నే మార్చేలా ఉంది కవిత గొడవ.

తెలంగాణలో కవిత కాక..

Advertisement

కవితది రాజకీయ పంచాయితీనా? ఆస్తుల పంచాయితీనా? అంటూ బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు ప్రశ్నించడం ఆసక్తికరంగా మారింది. కవితను బయటకు పంపించడం కోసం బావా, బామ్మర్దులు ఒక్కటి అయ్యారన్నారు. కవిత మరో షర్మిల కాబోతున్నట్టుగా కనిపిస్తున్నదని అన్నారు. రఘునందన్ చేసిన కామెంట్స్‌పై జోరుగా చర్చ నడుస్తోంది.

షర్మిలలానే కవిత..?

Advertisement

రఘునందన్‌రావు అంచనా వాస్తవికంగానే ఉందని అంటున్నారు. కవిత మరో షర్మిల అవుతుందని మాట్లాడుకుంటున్నారు. జగనన్నతో షర్మిలకు విభేదాలు వచ్చాయి. పార్టీ కోసం వాడేసుకుని.. గెలిచాక పక్కనపెట్టేశారంటూ చెల్లి మండిపడింది. ఆస్తులు సరిగ్గా పంచకుండా తనకు అన్యాయం చేశారంటూ అన్నతో గొడవ పెట్టుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అంటూ వేరు కుంపటి పెట్టుకుంది. కొంతకాలం బాగానే ట్రై చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్‌లో కలిపేశారు. ఏపీ పీసీసీ చీఫ్ అయ్యారు. కవిత ఎపిసోడ్ సైతం షర్మిల స్టోరీతో సరిపోలుతోందని విశ్లేషిస్తున్నారు.

కవితకు పొగ పెట్టేశారా?

కల్వకుంట్ల కుటుంబంలో సైతం కుంపటి రాజుకుందని అంటున్నారు. జైలు నుంచి వచ్చాక కవిత పార్టీకి దూరంగా ఉంటున్నారు. పార్టీయే ఆమెను దూరం పెట్టిందనే టాక్ కూడా ఉంది. జాగృతి జెండా కిందనే యాక్టివ్ పాలిటిక్స్ చేస్తున్నారు కవిత. బీసీ నినాదం ఎత్తుకున్నారు. ఫూలే విగ్రహం కోసం పట్టుబడుతున్నారు. సామాజిక తెలంగాణ రావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇవన్నీ బీఆర్ఎస్‌కు ఇబ్బంది కలిగించే స్ట్రాటజీలే అంటున్నారు. చెల్లి ఎత్తుగడలు పసిగట్టిన కేటీఆర్.. ఇటీవల బావ హరీశ్‌రావుతో వరుస మీటింగ్‌లు జరిపారని అంటున్నారు. కవిత పార్టీని వీడితే సరే.. లేదంటే వాళ్లే వెళ్లగొట్టేలా ఉన్నారని తెలుస్తోంది. అందుకే, ఇటీవల కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ఆరు నెలలు జైల్లో ఉండొచ్చా.. ఇంకా తనను కష్టపెడతారా? తనపై కుట్ర చేస్తుంది ఎవరో తెలుసు.. రెచ్చగొడితే మరింత రెచ్చిపోతా.. అంటూ ఇన్‌డైరెక్ట్‌గా కేటీఆర్ టార్గెట్‌గా హాట్ కామెంట్స్ చేశారని అంటున్నారు.

Also Read : హరీశ్‌రావుతో మళ్లీ మళ్లీ మీటింగ్స్.. అందుకేనా?

లేఖ లీక్ చేసింది ఎవరు?

కేటీఆర్‌, కవిత మధ్య తీవ్ర విభేదాలు ఉన్నాయని చెబుతున్నారు. ఆస్తుల నుంచి రాజకీయ వారసత్వం వరకూ.. సేమ్ టు సేమ్ జగన్ వర్సెస్ షర్మిల వివాదం మాదిరే.. కేటీఆర్ vs కవిత ఎపిసోడ్ కాక మీదుందని బీఆర్ఎస్ అంతర్గత వర్గాల్లో చర్చ నడుస్తోంది. అన్నను దెబ్బకొట్టేందుకే.. చెల్లి సొంత ఎజెండాతో కలకలం రేపుతున్నారని చెబుతున్నారు. మై డియర్ డాడీ అంటూ బీఆర్ఎస్‌ను కార్నర్ చేసేలా ఉన్న కవిత రాసిన లేఖ సైతం అందులో భాగమేనని అంటున్నారు. లేఖ రాసింది.. లీక్ చేసిందీ కవితనే అనే అనుమానాలు లేకపోలేదు. త్వరలోనే కొత్త పార్టీ పెట్టడం కూడా ఖాయమనే ప్రచారం జరుగుతోంది. మరి, కవిత వేరు కుంపటి ఎవరికి కలిసొస్తుంది? బీజేపీకా? కాంగ్రెస్‌కా? కూతురు గొడవను గులాబీ బాస్ హ్యాండిల్ చేయగలరా?

Related News

కేటీఆర్ వచ్చే వేళ మిర్యాలగూడలో పొలిటికల్ హీట్.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య వార్!

ఢిల్లీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్ 2026.. సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ వైరల్!

యూట్యూబ్‌లో చూసి నకిలీ నోట్ల తయారీ.. కానీ చివరికి ఎలా చిక్కాడంటే..?

హుజూరాబాద్‌లో మళ్లీ కాకరేపుతున్న రాజకీయ వేడి.. కాంగ్రెస్ వైఫల్యాలపై కౌశిక్ రెడ్డి భారీగా ధర్నా!

క్రికెట్ గ్రౌండ్ కోసం చెరువు కబ్జా చేస్తారా.. పట్టించుకోని అధికారులు!

ఆయనకు అన్నీ ఆశలు, కోరికలే ఉన్నాయి.. కేటీఆర్‌పై జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్!

తెలంగాణలో భారీ డిఫెన్స్ ఎక్స్‌పో.. రాజ్‌నాథ్ సింగ్‌కు రేవంత్ స్పెషల్ ఇన్విటేషన్!

కుషాయిగూడ పీహెచ్‌సీలో ఊహించని పరిణామం.. డాక్టర్‌గా మారిన డీఎంహెచ్‌ఓ!

Big Stories

Advertisement
×