BigTV English

BRS : మళ్లీ మళ్లీ మీటింగ్స్.. అరెస్ట్ నువ్వా నేనా?

BRS : మళ్లీ మళ్లీ మీటింగ్స్.. అరెస్ట్ నువ్వా నేనా?

BRS : 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడింది. అప్పటి నుంచీ అటాకింగ్ పాలిటిక్సే చేశారు గులాబీ బాస్. ఉద్యమాలు, సమ్మెలు, మానవహారాలు, రాజీనామాలు, ఉప ఎన్నికలతో ధూంధాం చేశారు. ప్రత్యేక రాష్ట్రంతో పవర్‌లోకి వచ్చాక కూడా ప్రతిపక్షాలపై అదే దూకుడు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను లాగేసుకున్నారు. అక్రమ అరెస్టులతో అరాచకంగా పాలించారు. ధర్నా చౌక్ ఎత్తేశారు. ఉద్యమకారులను అణగదొక్కారు. పదేళ్లు బంగారు తెలంగాణ భ్రమ కల్పించారని అంటారు. కట్ చేస్తే…


భయపడుతున్నారా?

ఫస్ట్ టైమ్ కేసీఆర్‌లో.. టన్నుల్లో భయం కనిపిస్తోందని అంటున్నారు. కాళేశ్వరం ఉచ్చు ఆయన మెడకు గట్టిగానే బిగుస్తోంది. తమ ముందు హాజరుకావాలంటూ కమిషన్ నోటీసులు ఇవ్వడంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని తెలుస్తోంది. కేసీఆర్‌తో పాటు హరీశ్‌రావు సైతం హడలిపోతున్నారట. అందుకే, మామా అల్లుల్లు వరుసబెట్టి మీటింగులు పెట్టుకుంటున్నారు. గంటల తరబడి వ్యూహాలు రచిస్తున్నారు. కాళేశ్వరం ఊబిలోంచి ఎలా బయటపడాలా అని మెదళ్లకు పదును పెడుతున్నారు. తెలంగాణ చాణక్యుడిగా పేరు గాంచిన కేసీఆర్‌లో ఇంతటి ఉలిక్కిపాటు ఇంతకు ముందెప్పుడూ చూడలేదని చెబుతున్నారు. ట్రబుల్ షూటర్‌గా ఇమేజ్ ఉన్న హరీశ్‌రావు గతంలో ఎప్పుడూ ఇంతగా హైరానా పడలేదని అంటున్నారు. ఆ ఇద్దరు మేధావులు.. కాళేశ్వరం కమిషన్ ముందు ఏం చెప్పాలి? ఎలా గండం నుంచి గట్టెక్కాలి? అంటూ తెగ కసరత్తు చేస్తున్నట్టు సమాచారం.


ఈటల ఇరికిస్తారా?

మరోసారి ఎర్రవల్లి ఫాంహౌజ్‌లో హరీశ్‌రావు ప్రత్యక్షమయ్యారు. మాజీ సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. మే 20న ఇలానే ఫాంహౌజ్‌కు వెళ్లి కేసీఆర్‌తో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. అంటే, రెండు రోజుల గ్యాప్‌లో వాళ్లిద్దరూ అలా గంటల తరబడి చర్చలు జరిపారంటే.. ఎంతలా భయపడుతున్నారో తెలుస్తోందని అంటున్నారు. కాళేశ్వరం కమిషన్ నోటీసులపైనే ఇద్దరు నేతలు చర్చిస్తున్నట్టు సమాచారం. కేటీఆర్ సైతం వారి చర్చల్లో పార్టిసిపేట్ చేశారు. ముగ్గురు కలిసి కాళేశ్వరం స్కాం నుంచి బయటపడే వ్యూహాలు రచిస్తున్నారని తెలుస్తోంది. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు సైతం కమిషన్ నోటీసులు ఇవ్వడంతో.. ఆయనేమైనా మనల్ని ఇరికిస్తారా? అనే అనుమానమూ వారిలో వ్యక్తం అవుతోందని అంటున్నారు. కేసీఆర్, హరీశ్‌రావులపై ఈటలకు పాత పగలు చాలానే ఉన్నాయంటున్నారు. తనను పార్టీ నుంచి వెళ్లగొట్టిన గులాబీ బాస్‌పై రివేంజ్‌కు ఇదే కరెక్ట్ ఛాన్స్ అనుకుంటున్నారా? పదవుల కోసం మిత్రుడికి వెన్నుపోటు పొడిచిన హరీశ్‌రావుతో ఈటల ఆటాడుకుంటారా?

హరీశ్‌రావు హ్యాండిస్తారా?

ఈటలపైనే కాదు.. హరీశ్‌రావుపైనా కేసీఆర్ డౌట్ పడుతున్నారట. హరీశ్ బీజేపీలో చేరుతారంటూ ఈమధ్య కాలంలో భారీ ఎత్తున ప్రచారం జరుగుతోంది. వరంగల్ సభ తర్వాత అల్లుడు అలిగాడని అంటున్నారు. రేపేమాపో పార్టీని వీడిపోతారంటూ సోషల్ మీడియా కోడై కూస్తోంది. అదే నిజమైతే? హరీశ్ వెళ్తూ వెళ్తూ మామను ఇరికించేస్తారా? కాళేశ్వరం కమిషన్ ముందు నిజాలన్నీ కక్కేస్తారా? అనే ఆందోళన కల్వకుంట్ల ఫ్యామిలీలో కనిపిస్తోందని టాక్. అందుకే, ఇటీవలే కేటీఆర్ స్వయంగా హరీశ్‌రావు ఇంటికెళ్లి మరీ గంటన్నర పాటు ఏకాంతంగా బుజ్జగించారని అంటున్నారు. ఆ తర్వాత కేసీఆర్ పిలిపించుకుని నచ్చజెప్పారు. ఇప్పుడు మరోసారి హరీశ్‌రావుతో కేసీఆర్, కేటీఆర్ ఇద్దరూ చర్చలు జరిపారు.

Also Read : హోంమంత్రి ఇంటికి నిప్పు.. పాకిస్తాన్‌లో తిరుగుబాటు..

ముగ్గురి కళ్లల్లో భయం?

హరీశ్‌రావు పార్టీలోనే కొనసాగేలా ఒత్తిడి తెస్తున్నారా? కాళేశ్వరం గుట్టు బయటపెట్టొద్దని వేడుకుంటున్నారా? కమిషన్ ముందు ఏం చెప్పాలని చర్చిస్తున్నారా? ఆ ముగ్గురూ కలిసికట్టుగానే ఉన్నారా? ఇలా ఎవరికి తోచిన యాంగిల్ వాళ్లు ప్రచారం చేసేస్తున్నారు. సోషల్ మీడియాలో కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావుల టాపిక్ హాట్ హాట్‌గా సాగుతోంది. ఇంతకీ, మామ కళ్లల్లో ఆనందం కోసం అల్లుడు ఏం చెప్పబోతున్నారు? కాళేశ్వరం కమిషన్ ముందు కేసీఆర్ నోరు విప్పుతారా? ముగ్గురి కళ్లల్లో అరెస్ట్ భయం కనిపిస్తోందా?

Related News

Fake APK App: హైదరాబాద్‌లో ఫేక్ ఏపీకే యాప్‌ల ఘరానా మోసం.. రూ.4.85 లక్షలు ఖేల్ ఖతం, దుకాణం బంద్..

Formula-E Race Case: ఫార్ములా-ఈ కార్ రేస్ కేసు.. ఇద్దరు ఐఏఎస్ లపై చర్యలకు విజిలెన్స్ సిఫారసు

Telangana Group-1 Exam: టీజీపీఎస్సీకి హైకోర్టులో రిలీఫ్.. తెలంగాణ గ్రూప్-1 నియామకాలకు గ్రీన్‌సిగ్నల్

Hyderabad News: జూబ్లీహిల్స్ బైపోల్ పై మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు, ఇంకా భ్రమల్లో ఆ పార్టీ

SC Stay On Elections: గిరిజన వర్సెస్ గిరిజనేతర.. ఆ 23 గ్రామాల్లో స్థానిక ఎన్నికలపై సుప్రీం స్టే

Rain: మళ్లీ అతిభారీ వర్షాలు వచ్చేస్తున్నయ్ భయ్యా.. కమ్ముకొస్తున్న పిడుగుల వాన, అలర్ట్‌గా ఉండండి..!

TGPSC Group-1: గ్రూపు-1 వివాదం కీలక మలుపు.. హైకోర్టులో మరో అప్పీలు

Medaram Maha Jatara: మేడారం మహాజాతర డిజిటల్ మాస్టర్ ప్లాన్ విడుదల

Big Stories

×