Allu Arjun Driving : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న పాన్ ఇండియా హీరోస్ లో అల్లు అర్జున్ ఒకరు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమా తర్వాత అల్లు అర్జున్ రేంజ్ కంప్లీట్ గా మారిపోయింది. ఒకప్పుడు తెలుగు సినిమాలకు మాత్రమే పరిమితమైన ఆయన ఇమేజ్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తెలిసింది. ముఖ్యంగా పుష్పరాజ్ క్యారెక్టర్ ని సుకుమార్ డిజైన్ చేసిన విధానం చాలామందిని విపరీతంగా ఆకట్టుకుంది. ప్రముఖ క్రికెటర్స్, పొలిటిషన్ ఈ సినిమాలోని డైలాగులను విరివిగా చెప్పడంతో సినిమా ఎల్లలు దాటిపోయింది. ఇక ఈ సినిమాకు సంబంధించి అల్లు అర్జున్ కు నేషనల్ అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే. పుష్ప సినిమాకి సీక్వల్ గా వచ్చిన పుష్ప 2 సినిమా కూడా మంచి సక్సెస్ సాధించి అద్భుతమైన కలెక్షన్స్ వసూలు చేసింది.
అల్లు అర్జున్ పై ట్రోల్
అల్లు అర్జున్ కి సక్సెస్ తో పాటు కొన్ని ట్రోల్స్ కూడా వస్తూ ఉంటాయి. ముఖ్యంగా అల్లు అర్జున్ ప్రవర్తించే తీరు చాలామందికి నచ్చదు అని చెప్పాలి. దీనికి రకరకాల కారణాలు ఉండొచ్చు. అయితే అందరూ అందరికీ నచ్చాలని రూల్ లేదు. అల్లు అర్జున్ చేసిన కొన్ని పనుల వలన ఎప్పుడు ట్రోల్ కి గురి అవుతూ ఉంటాడు. అలానే ఇప్పుడు కూడా అల్లు అర్జున్ కార్ డ్రైవింగ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వాస్తవానికి ఆ కారులో ఉంది అల్లు అర్జున్ కాదా అని క్లారిటీ కూడా చాలామందికి లేదు. అల్లు అర్జున్ ఇంటి ముందు ఒక ఫుడ్ పాత్ ను ఆ కారు ఎక్కించినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోకు పలు రకాల కామెంట్స్ వస్తున్నాయి. ఇంకొంతమంది రీ ట్వీట్ చేసి ఏంటి భాయ్ అలా ఎక్కించేసావు సినిమా అనుకుంటున్నావా అంటూ కామెంట్ చేయడం మొదలుపెట్టారు.
అట్లీ సినిమాతో బిజీ
అల్లు అర్జున్ విషయానికి వస్తే అట్లీ దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఆరవ సినిమా ఇది. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. దాదాపు 800 కోట్లు వరకు ఈ సినిమా బడ్జెట్ కేటాయించినట్లు సమాచారం వినిపిస్తుంది. ఈ సినిమాకి సంబంధించి అల్లు అర్జున్ 130 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు అని తెలుస్తుంది. అలానే అట్లీ దాదాపు 70 కోట్లు ఈ సినిమాకి రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన దీపికా పదుకొనే నటిస్తున్నట్లు విశ్వసినీ వర్గాల సమాచారం. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మరో పాన్ ఇండియా సినిమాను ప్లాన్ చేస్తున్నట్లు ఇదివరకే ప్రకటించారు.
Aah driving enti bhAAi 🏃🏻♂️ @alluarjun pic.twitter.com/5auoBqbCcm
— Ajay Varma (@AjayVarmaaa) May 23, 2025