E-Paper
Advertisement

Ponguleti Srinivas Reddy : పొంగులేటికి షాక్.. ముఖ్య అనుచరుడు జంప్? ఇంకా ఉన్నారా?

Ponguleti Srinivas Reddy : పొంగులేటికి షాక్.. ముఖ్య అనుచరుడు జంప్? ఇంకా ఉన్నారా?
Advertisement
Ponguleti Srinivas Reddy

Ponguleti Srinivas Reddy : పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్య అనుచరుడు, భద్రాచలం నియోజక వర్గంలో ఆయనకు నమకస్తుడిగా ఉన్న డాక్టర్ తెల్లం వెంకట్రావు పార్టీ మార‌బోతున్నారు. తాను కాంగ్రెస్‌ను వీడి సొంత గూడైన బీఆర్‌ఎస్‌లో చేరబోతున్నట్టు ఆయన ప్రకటించారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో పొంగులేటితో పాటు రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. 2014 నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దిశా నిర్దేశంలో నడిచిన ఆయన షాక్ ఇచ్చి బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు.

Advertisement

2018లో బీఆర్ఎస్ నుంచి భద్రాచలం ఎమ్మెల్యేగా తెల్లం వెంకటరావు పోటీ చేశారు. ఆనాడు తెల్లంకు సీట్ దక్కెందుకు పొంగులేటి కృషి చేశారు. అయితే తాజాగా వెంక‌ట‌రావు కాంగ్రెస్ పార్టీని వీడాల‌ని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన చర్చలు ముగిసినట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ నేత‌లు ఇచ్చిన హామీతో వెంక‌ట‌రావు కాంగ్రెస్ కు, అలాగే పొంగులేటికి బైబై చెప్పి కారు గూటికి చేర‌నున్నట్లు తెల్లం అంటున్నారు.అయితే కార్యకర్తల కోరిక మేరకే ఆయన పార్టీ మారుతున్నట్టు ప్రకటించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే ఈ నిర్ణయం తీసుకున్నానని ఆయన తెలిపారు.

ఇటీవల కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలే వెంకట్రావు పార్టీ మారేందుకు కారణాలుగా తెలుస్తోంది. గతంలో పోటీ చేసిన వారికే సీట్లంటూ టీపీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి ప్రకటించడంతో తనకు ఈసారి కూడా టికెట్ రాదేమోనని వెంకట్రావు అనుమానిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే మళ్ళీ అధికార పార్టీ వైపు వెళ్లేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్టు సమాచారం.

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×