E-Paper
Advertisement

కాంగ్రెస్‌ది ‘జెన్ జీ’ థింకింగ్.. ప్రత్యర్థులకు దిమ్మతిరిగేలా మంత్రి పొంగులేటి షాకింగ్ కామెంట్స్!

కాంగ్రెస్‌ది ‘జెన్ జీ’ థింకింగ్.. ప్రత్యర్థులకు దిమ్మతిరిగేలా మంత్రి పొంగులేటి షాకింగ్ కామెంట్స్!
Advertisement

Ponguleti Srinivas Reddy: ఖమ్మం నగరంలోని ఎస్సార్ గార్డెన్‌లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం ఉత్సాహంగా జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నింపాయి. ఎన్నికలకు ముందే అభ్యర్థిని ప్రకటించడం ద్వారా పార్టీ ఆధునిక ధోరణితో ముందుకు వెళ్తోందని ఆయన స్పష్టం చేశారు.

జెన్-జీ శైలిలో కాంగ్రెస్ వ్యూహం

Advertisement

రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చరిత్రలో తొలిసారిగా ఓటర్ల నమోదు ప్రక్రియకు ముందే అభ్యర్థిని ప్రకటించింది. పాత పద్ధతులకు స్వస్తి పలికి, నేటి ‘జెన్-జీ’ తరహాలో వేగంగా ఆలోచిస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నామని మంత్రి పొంగులేటి తెలిపారు. పట్టభద్రులలో ఉన్న కొంత అలసత్వాన్ని తొలగించి, ప్రతి మండలాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని విద్యావేత్తలను నియమిస్తే విజయం నల్లేరు మీద నడక అవుతుందని పేర్కొన్నారు.

సర్వోత్తమ రెడ్డి గెలుపే లక్ష్యం

Advertisement

కాంగ్రెస్ అభ్యర్థి సర్వోత్తమ రెడ్డి మొదటి ప్రాధాన్యత ఓటుతోనే ఘన విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఆయనకు పోటీ చేయడం ఇష్టం లేదంటూ కేంద్రంలోని పార్టీ, పింక్ పార్టీ చేస్తున్న గోబెల్స్ ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ‘మా కుటుంబమే కాంగ్రెస్ పార్టీ’ అని సర్వోత్తమ రెడ్డి స్పష్టం చేశారని, తమ్ముడు సర్వోత్తమ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు.

ఇచ్చిన హామీల అమలులో మనమే ముందు

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యువత, నిరుద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చామని పొంగులేటి గుర్తుచేశారు. గత ప్రభుత్వం కేవలం హామీలను కాగితాలకే పరిమితం చేస్తే.. నేటి ప్రభుత్వం వాటిని ఆచరణలోకి తెచ్చి చూపిస్తోందని తెలిపారు. రానున్న 25-26 రోజుల్లో మన మద్దతుదారుల ఓట్లను నూటికి నూరు శాతం నమోదు చేయిస్తే గెలుపు సునాయాసమవుతుందని ఆయన దిశానిర్దేశం చేశారు.

Also Read: ఏసీబీకి చిక్కిన అవినీతి తిమింగలం.. వంద కోట్ల బినామీ ఆస్తులు గుట్టురట్టు!

Tags

Related News

చింతల్‌లో విషాదం.. జువెలరీ షాపులో రసాయనం మింగి రెండేళ్ల చిన్నారి మృతి

ఏసీబీకి చిక్కిన అవినీతి తిమింగలం.. వంద కోట్ల బినామీ ఆస్తులు గుట్టురట్టు!

వరదలు లేని హైదరాబాద్ సాధ్యమేనా? హైడ్రా ఏమంటోందంటే..?

హైదరాబాద్‌లో పీఆర్టీ వ్యవస్థ.. భవిష్యత్ రవాణాకు సీఎం రేవంత్ మాస్టర్ ప్లాన్!

తెలంగాణ నుంచి మూడు హైస్పీడ్ ట్రైన్ రూట్స్.. కేంద్రమంత్రి కీలక ప్రకటన

గాంధీభవన్‌లో టీపీసీసీ చీఫ్ సంచలనం.. కేసీఆర్‌కి బీజేపీకి అంటే భయం అందుకే..?

అంగన్‌వాడీ సిబ్బందికి.. తెలంగాణ సర్కార్ భారీ గుడ్ న్యూస్?

Big Stories

Advertisement
×