E-Paper
Advertisement

Ponnam Prabhakar | నేనే ఎమ్మెల్యే.. హుస్నాబాద్ ప్రజలే నా బలం : పొన్నం ప్రభాకర్

Ponnam Prabhakar | నేనే ఎమ్మెల్యే.. హుస్నాబాద్ ప్రజలే నా బలం : పొన్నం ప్రభాకర్
Advertisement

Ponnam Prabhakar | హుస్నాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ పోటీ చేయబోతున్నారు. హుస్నాబాద్ ప్రజలే తన బలమని.. అత్యధిక మెజారిటీతో కాంగ్రెస్ గెలుస్తుందని ఆయన బిగ్ టీవీ ఇంటర్వ్యూలో ధీమా వ్యక్తం చేశారు. హుస్నాబాద్‌లో ఆయన వరుస ప్రచారాలతో దూసుకుపోతున్నారు. ప్రభాకర్ ప్రచారానికి భారీ సంఖ్యలో ప్రజలు వస్తున్నారు.

హుస్నాబాద్ నియోజకవర్గంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ప్రభాకర్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీ చెప్పిన 6 గ్యారంటీలు తప్పకుండా అమలు చేస్తామని.. ఆ హామాలే ఎన్నికల ఆయుధాలని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్నికలలో తాను గెలిచాక ప్రజల గొంతును అసెంబ్లీలో వినిస్తానని.. ప్రజల తరపున ప్రశ్నించే గొంతుకగా మారతానని ఆయన అన్నారు. “గౌరవెల్లి ప్రాజెక్టు నిర్మిస్తానని హామీ ఇచ్చిన కేసీఆర్.. ఇంతవరకూ కట్టలేదు. ప్రజలకు డబుల్ బెడ్‌రూం ఇళ్లు, ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఎవరెవరికి ఇచ్చింది.. అర్హులకు అసలు ఇవ్వలేదు” అని చెప్పారు.

Advertisement

ఇలా మోడీ, కేసీఆర్ మోసాలను ప్రజలు తెలుసుకున్నారని.. పదేళ్లలో జరగని అభవృద్ధి చేసి చూపిస్తానని ప్రభాకర్ చెప్పారు. ప్రజల సమస్యలు తీర్చడంల కేసీఆర్ పూర్తిగా ఫెయిలయ్యారని చెప్పారు. “పదేళ్లుగా ఎంపీ పదవిలో ఉండి.. తెలంగాణ ఉద్యమంలో కూడా పాల్గొన్నాను. అందుకే హుస్నాబాద్‌లో నేను ఎమ్మెల్యేగా గెలిస్తే ప్రతి ఇంట్లో ప్రజల గెలిచినట్లే. ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు ఎప్పుడూ ముందుంటాను. ఇక్కడి ప్రజలు కూడా నా మీద ఎంతో నమ్మకం చూసిన్నారు,” అని అన్నారు.

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×