Ind VS Aus 2023 | ప్రపంచకప్ ఫైనల్.. ఇండియా ఆస్ట్రేలియా.. ఎవరి బలమెంత?

Ind VS Aus 2023 | ప్రపంచకప్ ఫైనల్.. ఇండియా ఆస్ట్రేలియా.. ఎవరి బలమెంత?

Share this post with your friends

Ind VS Aus 2023 | క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ మరికొన్ని గంటల్లోనే షురూ కానుంది. తుది పోరులో భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. లక్షా 30 వేల మంది ప్రేక్షకుల సిట్టింగ్ సామర్థ్యం గల అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియం వేదికగా రెండు జట్లు పోటీ పడనున్నాయి. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటికీ అనుకూలంగా ఉండే ఈ పిచ్‌పై జరిగే ఫైనల్ మ్యాచ్ ఆసక్తికరంగా ఉంటుందని క్రికెట్ అభిమానులు అంటున్నారు. మ్యాచ్‌లో టాస్ కూడా కీలకంగా మారే అవకాశాలు ఉన్నాయి.

మోదీ స్టేడియంలో గత రికార్డులను పరిశీలిస్తే ఇప్పటివరకు 30 వన్డే మ్యాచ్‌లు జరిగాయి. ఈ మ్యాచ్‌లలొ మొదటి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసిన జట్టు 15 సార్లు, రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసిన జట్లు 15 సార్లు విజయం సాధించాయి. మొదటి ఇన్నింగ్స్ సగటు స్కోర్ 243గా ఉంది. సెకండ్ ఇన్నింగ్స్ సగటు స్కోర్ 208గా ఉంది. మోదీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లలో అత్యధికంగా 365 స్కోర్ నమోదు కాగా.. అత్యల్ప స్కోర్ 85గా ఉంది.

ఇక్కడ అత్యధిక చేధన 325 పరుగులుగా ఉంది. టాస్ గెలిచిన జట్లు 17 మ్యాచ్‌ల్లో విజయం సాధిస్తే.. టాస్ ఓడిన జట్లు 13 మ్యాచ్‌ల్లో గెలిచాయి. దీంతో తొలుత బ్యాటింగ్ చేసే జట్టుకు అడ్వాంటేజ్ ఉంది. ఆ జట్టు భారీ స్కోరు సాధించే అవకాశాలు ఉన్నాయి. 3వందలకు పైగా పరుగులు చేస్తే… సెకండ్ బ్యాటింగ్ చేసే జట్టుకు ఇబ్బంది తప్పదు.

ఈ పిచ్‌లో స్పిన్ బౌలర్ల కంటే పేసర్లే ఎక్కువ వికెట్లు తీయగలుగుత్నారని గత రికార్డులలో తేలింది. ఇప్పటివరకు ఈ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లలో పేస్ బౌలర్లు 246 వికెట్లు సాధించగా.. స్పిన్నర్లు 135 వికెట్లు తీశారు. వన్డే ఫార్మాట్లో ఇండియా, ఆస్ట్రేలియా ఇప్పటివరకు 150 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. అత్యధికంగా ఆస్ట్రేలియా 83 మ్యాచ్‌ల్లో గెలిచింది. భారత జట్టు 57 మ్యాచ్‌ల్లో గెలిచింది. 10 మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు.

ప్రస్తుతం రెండు జట్లు అన్ని విభాగాల్లో బలంగా ఉన్నాయి. ప్రస్తుత ప్రపంచ కప్ టోర్నీలో ఇప్పటివరకు టీమిండియా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా అద్బుత ప్రదర్శన కనబరిచింది. లీగ్ దశలో ఆడిన 9 మ్యాచ్‌ల్లో అన్నీ గెలిచింది. సెమీ ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై 70 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్ చేరింది. దీంతో ఈ టోర్నీలో టీమిండియా వరుసగా 9 విజయాలు నమోదు చేసింది. మరోవైపు ఆస్ట్రేలియా ప్రారంభదశలో ఆడిన మ్యాచ్‌లలో తడబడినా ఆ తరువాత మెల్లగా పుంజుకుంది. వరుసగా విజయాలు సాధించింది. ప్రారంభంలో వరుసగా ఎదురైన రెండు ఓటములు మినహా ఆ తర్వాత మళ్లీ వెనక్కి చూసుకోలేదు. లీగ్ దశలో వరుసగా 7 విజయాలతోపాటు సెమీఫైనల్‌లో సౌతాఫ్రికాపై గెలిచి ఫైనల్‌లో అడుగుపెట్టింది.


Share this post with your friends

ఇవి కూడా చదవండి

Ambati Rayudu:-  ఏంటి.. మన అంబటి రాయుడు రాజకీయాల్లోకా,,? చేర్చుకోడానికి రెడీగా బీఆర్ఎస్

Bigtv Digital

Rajashyamala yagam : రాజశ్యామల యాగంపై ఆగమాగం.. ఇక్కడ జగన్, అక్కడ కేసీఆర్

Bigtv Digital

Veera Simha Reddy Review : వీరసింహారెడ్డి రివ్యూ.. సినిమాలో హైలెట్స్ ఇవే..

Bigtv Digital

KCR: కేసీఆర్ వరుస సభలు అందుకేనా? ముందస్తు ఖాయమా?

BigTv Desk

Kerala court : చిన్నారిపై అత్యాచారం.. చిల్డ్ర‌న్స్ డే రోజు దోషికి మరణశిక్ష!

Bigtv Digital

Congress: మమతానురాగం.. కాంగ్రెస్సే కీలకం..

Bigtv Digital

Leave a Comment