E-Paper
Advertisement

Ponnam Prabhakar: బంగారు తెలంగాణ చేసుంటే.. ప్రజావాణికి ప్రజలు బారులు ఎందుకు తీరుతారు ..?

Ponnam Prabhakar:  బంగారు తెలంగాణ చేసుంటే.. ప్రజావాణికి ప్రజలు బారులు ఎందుకు తీరుతారు ..?
Advertisement

Ponnam Prabhakar: రాష్ట్రంలో ప్రభుత్వం మారిందని బీఆర్ఎస్ నేతలు గ్రహించాలని తెలంగాణ రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు . గతంలో బంగారు పాలన అందించామని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు.. బంగారు పాలన అందిస్తే ప్రజావాణి కోసం ప్రజలు ఎందుకు బారులు తీరుతారని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చనందుకే బీఆర్ఎస్ కు ప్రజలు బుద్ది చెప్పారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను‌ ఖచ్చితంగా అమలు చేస్తుందని అందులో సందేహించాల్సిన అవసరమేమి లేదని పొన్నం ప్రభాకర్‌ స్పష్టం చేశారు.

కేంద్రపైనా మంత్రి పొన్నం విమర్శలు గుప్పించారు. పార్లమెంట్‌లో భద్రతపై ప్రశ్నిస్తే ఎంపీలను సస్పెండ్ చేస్తున్నారని, ఇంత దారుణంగా ఎప్పుడు జరగలేదని తీవ్రంగా మండిపడ్డారు. బీజేపీ ఎంపీ సిఫార్సుల వల్లే నిందితులకు పాస్‌లు వచ్చాయని ఆరోపించారు. నిందితులను కాపాడేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు.

Advertisement

పార్లమెంట్ ఘటన జరిగి వారం రోజులైనా దోషులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని పొన్నం ప్రశ్నించారు. పార్లమెంట్‌ భద్రత అంశంపై తక్షణమే విచారణ జరపాలన్నారు. విపక్ష ఎంపీలపై సస్పెన్షన్‌ను ఎత్తివేసి పార్లమెంట్ సమావేశాలు సజావుగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Related News

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

Big Stories

Advertisement
×