Phone Tapping Case Updates: తెలంగాణలో హాట్ టాపిక్‌గా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు పెంచింది. ఈ కేసులో నిందితులుగా ఉన్నవాళ్లందరినీ.. వరుసపెట్టి విచారిస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఎస్ఐబీ మాజీ చీఫ్ టీ ప్రభాకర్ రావును.. శనివారం మూడోసారి ప్రశ్నించనున్నారు. శుక్రవారం ప్రణీత్ రావు ఇచ్చిన స్టేట్‌మెంట్‌పై.. ప్రభాకర్ రావును విచారించన్నారు సిట్ అధికారులు. ముఖ్యంగా.. జడ్జిల కాల్ లిస్ట్ తీయడం వెనుక ఎవరి డైరెక్షన్ ఉందనే దానిమీదే సిట్ ఫోకస్ చేసింది. ప్రభాకర్ రావును ఏం అడగబోతున్నారు? ఏం ఆరా తీయబోతున్నారు? అనేది ఆసక్తి రేపుతోంది.
ప్రణీత్ రావు స్టేట్మెంట్ ఆధారంగా ప్రభాకర్ రావును ప్రశ్నించనున్నారు సిట్ అధికారులు. ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజే హార్డ్ డిస్కులు ఎందుకు ధ్వంసం చేశారన్నదే ఇక్కడ మెయిన్ క్వశ్చన్. SOTని ఎవరు చెబితే ఏర్పాటు చేశారు? గత ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే ఈ టీమ్‌ను ఏర్పాటు చేశారా? SOT ఏర్పాటు వెనుక ఉన్న ఉద్దేశ్యం ఏమిటి? అనే అంశాలపై ప్రభాకర్ రావును ప్రశ్నించే అవకాశం ఉంది.
ఇక వేల సంఖ్యలో ఫోన్‌లు ట్యాప్ అయినట్లు ఆధారాలున్నందున, ఆ నంబర్‌లను ఎవరు ఇచ్చారు? లాయర్లు, పొలిటికల్ లీడర్లు, ప్రముఖులు, జర్నలిస్టుల ఫోన్‌లను ఎందుకు ట్యాప్ చేశారు? దీనికి ఎవరైనా ఉన్నతాధికారులు ఆదేశాలు ఇచ్చారా? అనే యాంగిల్‌లో ప్రభాకర్ రావును విచారించన్నట్లు తెలుస్తోంది. ప్రభాకర్ రావు, ప్రణీత్ రావుతో పాటు ఇతర నిందితుల వాంగ్మూలాలను సరిపోల్చడం, వాటిలోని నిజానిజాలను నిర్ధారించడం SITకి సవాలుగా మారనుంది.
కేవలం ప్రభాకర్ రావు వాంగ్మూలం మాత్రమే కాకుండా, SIT ఫోన్ ట్యాపింగ్ పరికరాలు, ధ్వంసమైన హార్డ్ డిస్క్‌ల నుండి డేటా రికవరీ, ఆర్థిక లావాదేవీలు వంటి ఇతర సాక్ష్యాలను కూడా సేకరిస్తోంది. మరోవైపు ఇదే క్రమంలో ప్రణీత్ రావు, ప్రభాకర్ రావును ఇద్దరినీ కలిపి విచారించే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఇద్దరి విడివిడిగా విచారించిన సిట్…ఇప్పుడు ఇద్దరి కలిపి విచారిస్తే ఫుల్ క్లారిటీ వస్తుందని భావిస్తున్నారు.
ప్రభాకర్ రావు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు.. అమెరికా నుంచి వచ్చి సిట్ విచారణకు హాజరయ్యారు. ప్రణీత్ రావు ఇప్పటికే అరెస్ట్ అయి.. బెయిల్‌పై బయట ఉన్నారు. దాంతో.. సిట్ అధికారులు ఇప్పటికే రాధా కిషన్ రావు, భుజంగరావు, తిరుపతన్న వాంగ్మూలాలను రికార్డ్ చేసింది. వాటితో పాటు లభించిన ఆధారాలతో.. ప్రభాకర్ రావును అనేక కోణాల్లో ప్రశ్నించారు. శుక్రవారం దాదాపు 4 గంటలుగా సిట్ అధికారులు ప్రణీత్ రావును ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్, హార్డ్ డిస్క్ ధ్వంసంపైనే.. మరోసారి ప్రణీత్ రావు స్టేట్ మెంట్ రికార్డ్ చేశారు.
Also Read: కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు.. ఈసారి పక్కా..?
నిజానికి.. ఫోన్ ట్యాపింగ్ కేసులో 14 నెలలుగా కొనసాగుతున్న విచారణపై.. ప్రభాకర్ రావుకు పూర్తి అవగాహన ఉంది. అందుకోసమే సమాధానాలు దాటవేస్తూ.. తెలివిగా వ్యవహరిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయ్. ప్రభాకర్ రావు తనకేం తెలియదన్న ప్రతిసారీ.. సిట్ అధికారులు ఆధారాలు ముందు పెడుతున్నారు. దాంతో.. ప్రభాకర్ రావు సైలెంట్ అయిపోతున్నారు. అందువల్ల.. విచారణలో.. ఒకరి వాంగ్మూలాన్ని మరొకరు చెప్పిన విషయాలతో పోల్చి చూస్తోంది సిట్.