Intinti Ramayanam Today Episode june 14th: నిన్నటి ఎపిసోడ్ లో.. పార్వతిని భానుమతిని అక్షయ్ తీసుకొని వెళ్ళిపోతుంటే శ్రీకర్ కమల్ వద్దని ఆపుతారు. కానీ శ్రియ మాత్రం పార్వతిని నగలు కావాలని డిమాండ్ చేస్తుంది. శ్రియ పై శ్రీకర్ కమల్ సీరియస్ అవుతారు. అవని పేరు మీద కోట్లు విలువ చేసే ఇంటిని రాసిచ్చారు కదా.. మేము నగలు అడగడంలో తప్పు లేదు కదా అని శ్రియ అంటుంది. పార్వతి శ్రియ అన్న దాంట్లో తప్పేమీ లేదు. ముగ్గురు కోడలికి సమానంగా నేను నగలుస్తాను ఇవిగోండి తీసుకోండి అని పల్లవికి శ్రీయకు నగలు ఇస్తుంది.. వాళ్ళింట్లోంచి వెళ్లిపోవడం కమల్ అవని కి ఫోన్ చేసి చెప్తాడు. మీకు కొంచెం కూడా బుద్ధి లేదు పెద్దవాళ్లు ఇంట్లోంచి వెళ్ళిపోతున్నారు అంటే ఆపాల్సింది పోయి నగలు కావాలని అంటారా అని శ్రీకర్ కమల్ తిడతారు.. ఇంట్లోంచి అక్షయ్ వెళ్లిపోవడంతో పండగ చేసుకుంటారు. అయితే ఇంట్లోంచి అక్షయ్ వాళ్లు వెళ్లిపోవడంతో గది కోసం శ్రీయా, పల్లవి కొట్టుకుంటారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. అక్షయ్ ఇంట్లోంచి వెళ్ళపోవడంతో ఆ విషయం తెలుసుకున్న అవని రాజేంద్రప్రసాద్, భరత్, అందరూ కలిసి బయటకు వచ్చి వీధులు వెతుకుతారు.. కానీ వాళ్ళు కనిపించరు. అవనిని చూసిన శ్రీకర్ కమల్ అక్కడికి వెళ్తారు.. అమ్మ వాళ్ళు ఎక్కడ కనిపించలేదు అని అందరూ అనుకుంటారు.. అయితే అక్షయ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా అని అవని అడుగుతుంది. కచ్చితంగా వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్లి ఉంటారని అనుకుంటారు.. ఆ తర్వాత కమల్, అవని, శ్రీకర్ అక్షయ్ ఫ్రెండ్ భాస్కర్ ఇంటికి వెళ్ళారేమో చూడాలని వెళ్తారు.
అయితే అందరు అనుకున్నట్లుగానే అక్షయ్ వాళ్లు అక్కడే ఉంటారు. అవని వెళ్ళగానే భాస్కర్ వాళ్ళ భార్య వీళ్ళందరూ కూడా ఇక్కడే ఉంటారా ఇది ఏమైనా హోటల్ అని మాట్లాడుతుంది.. మాటలు వినగానే అవని అత్తయ్య గారు మన ఇల్లు ఉండగా మీరు అక్కడే ఉండమని చెప్పిన కూడా ఎందుకు ఇలా వచ్చారు అని అంటుంది. అయినా అక్షయ్ వాళ్లు వినకుండా మమ్మల్ని ఇక్కడ కూడా ప్రశాంతంగా ఉండనివ్వరా అని అవని పై అక్షయ్ సీరియస్ అవుతారు.
నువ్వు అక్కడ ఉంటే అక్కడ ఉంటావని ఇక్కడికొస్తే ఇక్కడ మమ్మల్ని వదలవా తల్లి అని పార్వతి అవనిని దారుణంగా అవమానిస్తుంది. ఇక్కడ కూడా ఉండకుండా పంపించాలనే అనుకుంటున్నావు అని అవనిని పార్వతి అరుస్తుంది. అక్షయ్ మేమిక్కడ సంతోషంగా ఉండాలంటే నువ్వు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు వెళ్ళిపో అని అంటాడు. అయితే భాస్కర్ వాళ్ళ భార్య ఏంటి ఈ నటింట్లో ఈ పంచాయతీ అని అరుస్తుంది.. పదండి వెళ్లిపోదామని శ్రీకర్ అవని కమల్ ని తీసుకొని బయటికి వస్తాడు..
ఇప్పుడు మనం ఆలోచించాల్సింది వాళ్ళు ఇలా బయటకు వచ్చారని కాదు ఈ పరిస్థితి వెనకాల కారణము ఎవరో తెలుసుకోవాలని అవని అంటుంది. బయటికి వచ్చిన అవని దీని వెనకాల ఎవరో ప్లాన్ ఉంది ఇది తెలుసుకోవాలని శ్రీకర్ అవని మాట్లాడుకుంటారు. పల్లవి ఇదంతా చేసిందని నాకు అనుమానంగా ఉంది.. కన్నయ్యకు తెలియకుండా పల్లవిని చాలా జాగ్రత్తగా ఫాలో అయ్యి అసలు విషయాన్ని బయట పెట్టాలి అని అంటుంది.. ఈ విషయాన్ని ఎట్టి పరిస్థితులను బయటకు తెలియనివ్వకుండా మనం జాగ్రత్తగా చూసుకోవాలి అని అవని శ్రీకర్తో అంటుంది. రాజేంద్రప్రసాద్ మాత్రం అవని కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకోవాలని అనుకుంటాడు.
అప్పుడే ఇంటికి వచ్చిన అవని మీరేం కంగారు పడకండి మావయ్య ఆయన వాళ్ళ ఫ్రెండ్ భాస్కర్ ఇంటి దగ్గరే ఉన్నారు అని అవని అంటుంది. కంగారుపడుతుంది వాళ్ల కోసం కాదమ్మా నీకోసం. వాళ్లు నిన్ను ఎంత కాదనుకొని ప్రతిసారి నిన్ను అవమానించిన కూడా నువ్వు మాత్రం వాళ్ళ మంచినే కోరుకుంటున్నావు. ఎందుకు అవని ఇలా చేస్తున్నావ్ ఇంత మంచితనం పనికిరాదమ్మా అని రాజేంద్రప్రసాద్ క్లాస్ పీకుతాడు. వాళ్లు మనవాళ్లే కదా మామయ్య కక్ష పెంచుకొని వద్దని వదిలేస్తే తెంచుకునేది కాదు కదా కుటుంబం అంటే అని అవని అంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..