BigTV English

Praja Palana Vijayotsavam: అదరగొట్టిన ఎయిర్ షో.. వీక్షించిన సీఎం రేవంత్ రెడ్డి.. మార్మోగిన జయహే తెలంగాణ నినాదం

Praja Palana Vijayotsavam: అదరగొట్టిన ఎయిర్ షో.. వీక్షించిన సీఎం రేవంత్ రెడ్డి.. మార్మోగిన జయహే తెలంగాణ నినాదం

Praja Palana Vijayotsavam: ఆకాశం హోరెత్తింది. ఎటు చూసినా అద్భుత దృశ్యాలే. ట్యాంక్ బండ్ వద్ద ఇసుకవేస్తే రాలనంత జనసమూహం. అదే స్థాయిలో ఎటు తలతిప్పినా ఆకాశంలో విమానాలు. వాటి విన్యాసాలు తిలకించిన ప్రజలు ఆశ్చర్యకితులయ్యారు. భారత్ మాతాకీ జై.. అంటూ నినదిస్తూ.. ప్రజాపాలన విజయోత్సవాలకు స్పెషల్ ఎయిర్ షో ఏర్పాటు చేసిన సీఎం రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ సర్కార్ కు అభినందనలు తెలిపారు.


తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది ప్రజా పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజా విజయోత్సవ కార్యక్రమాలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించి విజయోత్సవ బహిరంగ సభలలో పాల్గొన్నారు. అయితే నిన్నటి నుండి ప్రజా పాలన ప్రజా విజయోత్సవ ప్రత్యేక కార్యక్రమాలను హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు.

హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ వద్ద ప్రజా పాలన విజయోత్సవాలలో భాగంగా ఆదివారం ప్రత్యేక ఎయిర్ షో నిర్వహించారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గ్రూప్ కెప్టెన్ అజయ్ దాశరధి ఆధ్వర్యంలో సూర్యకిరణ్ ఏరోబాటిక్ టీం హుస్సేన్ సాగర్ పైనుండి ఎయిర్ షో నిర్వహించింది. 9 విమానాలు ఎయిర్ షోలో పాల్గొనగా, ఆ అద్భుత విన్యాసాలను ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి వీక్షించారు. అసలే ఆదివారం సెలవు దినం కావడంతో ట్యాంకు బండి పరిసరాలు జనసంద్రంతో నిండిపోయాయి. త్రివర్ణ పతాకం కలర్ లో ప్రదర్శనలు సాగగా, ప్రజలు జయహో అంటూ నినదించారు.


ఎయిర్ షో వీక్షించిన సీఎం రేవంత్ రెడ్డి
ట్యాంక్ బండ్ వద్ద ప్రజా పాలన విజయోత్సవాలలో భాగంగా ఆదివారం ఏర్పాటు చేసిన ప్రత్యేక ఎయిర్ షోను సీఎం రేవంత్ రెడ్డి వీక్షించారు. సీఎం తో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, ఎమ్మేల్యేలు పాల్గొన్నారు. ఈ సంధర్బంగా ఎయిర్ షో వీక్షణకు వచ్చిన ప్రజలు సీఎం ను చూసి, సీఎం సార్ థ్యాంక్యూ సార్ అంటూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. ముందుగా ఎయిర్ షో లో పాల్గొంటున్న సూర్యకిరణ్ ఏరోబాటిక్ టీంను సీఎం అభినందించారు.

Also Read: Telangana Thalli Statue: మరీ ఇంత దిగజారాలా.. ఛీ.. ఛీ.. ఆ పార్టీపై ఫైర్

కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాదిపాలనపై ప్రజలు మాట్లాడుతూ.. కేవలం ఏడాది కాలంలో ఎన్నో ప్రభుత్వ పథకాలను ప్రవేశపెట్టడంతో పాటు, పలు ఉద్యోగాలను భర్తీ చేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. ప్రజా పాలన విజయోత్సవాలలో తాము పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని, అలాగే దేశభక్తిని చాటి చెబుతూ ప్రత్యేకంగా ఎయిర్ షో ఏర్పాటు చేయడం యావత్ దేశం గర్వించదగ్గ విషయమన్నారు. అంతేకాకుండా సచివాలయంలో ఏర్పాటు చేస్తున్న తెలుగు తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి తమ మద్దతు ఉంటుందని, ప్రతి విషయాన్ని రాజకీయ కోణంలో చూసే వైఖరిని రాజకీయ పార్టీలు మానుకోవాలని ప్రజలు హితవు పలికారు. ఎయిర్ షో సందర్భంగా చిన్నా, పెద్ద తేడా లేకుండా రాష్ట్రం నలుమూలల నుండి ప్రజలు అధిక సంఖ్యలో ట్యాంక్ బండ్ వద్దకు చేరుకున్నారు.

Related News

Ponnam Prabhakar: అయ్యా దయచేసి ఆ పిటిషన్ వెనక్కి తీసుకోండి.. రిజర్వేషన్ల పై పొన్నం రిక్వెస్ట్

CM Revanth Reddy: ఎన్‌ కన్వెన్షన్ కూల్చివేతపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

TG Local Body Elections: తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలు.. ఈసీ షెడ్యూల్ రిలీజ్, అక్టోబర్ నుంచి మొదలు

Hyderabad News: హైదరాబాద్‌లో ఇందిరమ్మ క్యాంటీన్లు ప్రారంభం.. ఐదు రూపాయలకే బ్రేక్ ఫాస్ట్-భోజనం

Delhi News: ఢిల్లీలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. సీఎం రేఖాగుప్తా, ఉపాసన హాజరు

Weather Update: హై అలర్ట్..! నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. ఉరుములు, మెరుపులు, పిడుగులు పడే ఛాన్స్..

CM Revanth Reddy: బతుకమ్మకుంటతో తొలి అడుగు.. కబ్జా కోరల్లో చిక్కిన ప్రతి చెరువును రక్షిస్తాం: సీఎం రేవంత్ రెడ్డి

Hydra Commissioner: ఇది ఒక చారిత్రక ఘట్టం, ఇందులో నేను భాగస్వామ్యం కావడం అదృష్టంగా భావిస్తున్నా: హైడ్రా కమిషనర్

Big Stories

×