E-Paper
Advertisement

జనగామలో అబార్షన్ తర్వాత తల్లి మృతి.. ఆడపిల్ల పుట్టడం నేరమా అంటూ.. కన్నీళ్లు పెట్టుకున్న ‘బిగ్ టీవీ’ యాంకర్

జనగామలో అబార్షన్ తర్వాత తల్లి మృతి.. ఆడపిల్ల పుట్టడం నేరమా అంటూ.. కన్నీళ్లు పెట్టుకున్న ‘బిగ్ టీవీ’ యాంకర్
Advertisement

Jangaon: సభ్య సమాజం తలదించుకునే ఘటన జనగామలో చోటు చేసుకుంది. మహిళ రేషియా తగ్గిపోతోందని ఓ వైపు గగ్గోలు పెడుతుంటే.. మరోవైపు పుట్టబోయే ఎవరన్నది తెలియడం కోసం లింగ నిర్ధారణ పరీక్ష జరిగింది. ఆడ బిడ్డ పుడుతుందని తెలిసి అబార్షన్ చేయించుకుంది. అది కాస్త వికటించడంతో శ్రావణి ఈ లోకాన్ని విడిచిపెట్టింది. సంచలనం రేపిన ఈ ఘటన జనగామ జిల్లాలో వెలుగుచూసింది. ఈ వార్త లైవ్‌లో చదివిన ‘బిగ్ టీవీ’ యాంకర్ కన్నీరు పెట్టుకున్నారు.

జనగామలో ఏం జరిగింది? జనగామ జిల్లా రఘునాథపల్లి మండలానికి చెందిన భాస్కర్‌గౌడ్-కోల్కొండకు చెందిన శ్రావణిలకు వివాహం జరిగింది. ఈ జంటకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. మూడోసారి శ్రావణి గర్భం దాల్చింది. తల్లి శోభతో కలిసి తన గ్రామానికి చెందిన ఆర్‌ఎంపీ వద్దకు వెళ్లింది. అతడు సూచనతో జనగామలోని ఏఎన్‌ఎం సలహా కోసం వెళ్లింది. ఏఎన్‌ఎం సూచన మేరకు హనుమకొండలో ఓ ప్రైవేటు స్కానింగ్‌ కేంద్రంలో లింగ నిర్ధారణ పరీక్ష చేశారు. పుట్టబోయే బిడ్డ ఆడ పిల్ల తెలుసుకుంది శ్రావణి, ఆమె తల్లి.

Advertisement

 వార్త చదివి కన్నీరు పెట్టుకున్న బిగ్ టీవీ యాంకర్- ఈనెల 21న శ్రావణికి అబార్షన్‌ చేయడం జరిగింది. ఆమెకి తీవ్ర రక్తస్రావం కావడంతో నాలుగు రోజుల తర్వాత అంటే 25న చనిపోయింది. కూతురు చనిపోయిన విషయాన్ని శ్రావణి పేరెంట్స్ అల్లుడికి తెలిపారు. ఈ విషయం తెలుసుకుని ఆమె భర్త భాస్కర్ షాకయ్యాడు. తన భార్య మృతికి కారణమైన స్కానింగ్‌ కేంద్రం నిర్వాహకుడు, ఆర్‌ఎంపీ శ్రావణ్, ఏఎన్‌ఎం అనసూయ, తన అత్త శోభపై చర్య తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశాడు భాస్కర్‌గౌడ్‌. ఆ నలుగురిపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ వార్త లైవ్‌లో చదివిన బిగ్ టీవీ యాంకర్ కన్నీరు పెట్టుకున్నారు.

లింగ నిర్ధారణ పరీక్ష నేరం- శ్రావణి అబార్షన్ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ చేయడం ముమ్మాటికీ నేరం. భ్రూణహత్యలను అరికట్టడానికి బాలికల నిష్పత్తిని కాపాడటానికి ఈ చట్టం ఉంది. దీనిప్రకారం కడుపులో ఉన్న శిశువు ఎవరన్నది తెలుసుకోవడం నేరం. అల్ట్రాసౌండ్ లేకుంటే ఇతర స్కానింగ్ పద్ధతుల ద్వారా పిండం లింగాన్ని పరీక్షించడం నేరం. దాన్ని బయట పెట్టడం నిషేధం. ఈ చట్టాన్ని ఉల్లంఘించి పరీక్షలు చేసినా, ప్రోత్సహించినా మూడేళ్ల వరకు జైలు శిక్ష. భారీ జరిమానా విధించవచ్చు.

Advertisement

అబార్షన్ – గర్భస్రావం అనేది మందులు లేకుంటే ఆపరేషన్ ద్వారా గర్భాన్ని తొలగించే ప్రక్రియ. తొలుత మాత్రల ద్వారా ట్రీట్‌మెంట్ చేస్తారు. లేకుంటే అబార్షన్ చేస్తారు. శ్రావణి విషయంలో అనాలోచితంగా చేసిన ప్రక్రియ వల్ల అబార్షన్ కాస్త తీవ్ర రక్తస్రావానికి దారి తీసింది. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ కన్నుమూసింది.

 

Related News

జీహెచ్ఎంసీలో రెనొవేషన్ దందా కలకలం.. ఆఫీసర్ల మోజుకు కోట్లు ఖర్చు!

నడిరోడ్డుపై డెలివరీ బాయ్స్ నరకం.. తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం

పెట్రోల్ బంకులోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. క్షణాల్లో ప్రమాదం..!

ఉద్యోగులకు రూ.కోటి బీమా.. దేశంలోనే తొలిసారి-డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

శామీర్‌పేట్‌లో కాంగ్రెస్ నాయకులు ఫైర్.. BRS ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దుచేయాలని డిమాండ్!

1980s ట్రెండ్.. అచ్చం హీరోలా సీఎం రేవంత్, ఓల్డ్ ఈజ్ గోల్డ్

అదుపు తప్పిన లారీ.. డ్రైవర్‌ సహా 200 గొర్రెలు సజీవదహనం.. మహబూబ్‌నగర్ జిల్లాలో ఘోర ప్రమాదం

మూసీ నది ప్రాజెక్టు.. దసరా రోజు నుంచి పనులకు శ్రీకారం, ఏర్పాట్లలో అధికారులు నిమగ్నం

Big Stories

Advertisement
×