E-Paper
Advertisement

Priyanka Gandhi : నిరుద్యోగంలో తెలంగాణ నంబర్ వన్.. బీఆర్ఎస్ సర్కార్‌కు కాలం చెల్లింది..

Priyanka Gandhi :  నిరుద్యోగంలో తెలంగాణ నంబర్ వన్.. బీఆర్ఎస్ సర్కార్‌కు కాలం చెల్లింది..

Priyanka Gandhi : తెలంగాణలో బీఆర్ఎస్ పాలనకు కాలం చెల్లిందని ప్రియాంక గాంధీ స్పష్టం చేశారు. పాలకుర్తిలో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి సభలో ఆమె పాల్గొన్నారు. తెలంగాణలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను వివరించారు. పరీక్ష పేపర్ల లీకుల వల్ల విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.

తెలంగాణ అభివృద్ధి కోసం కాంగ్రెస్ కు మంచి విజన్ ఉందని తెలిపారు. రాజస్థాన్ లో రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చామని.. అదే తరహాలో ఇక్కడ కూడా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్నారు. యువతకు రూ. 5 లక్షల ఆర్థికసాయం చేస్తామని ప్రకటించారు.

తెలంగాణలోని గ్రామాల్లో వైన్ షాపులు పెరిగిపోయాయని ప్రియాంక గాంధీ మండిపడ్డారు. కేంద్రం ప్రభుత్వం వల్ల ధరలు పెరిగాయన్నారు. దీంతో ప్రజలు కష్టాలు పడుతున్నారని.. మహిళల కష్టాలను దూరం చేయడానికి రూ. 2500 లు ఇస్తామని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే గ్యాస్ సిలిండర్ రూ. 500 లకే ఇస్తామని చెప్పారు. కర్ణాటక మాదిరిగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామన్నారు.

తెలంగాణలో రైతులు ఎన్నో కష్టాలు పడుతున్నారని ప్రియాంక గాంధీ ఆవేదన వ్యక్తంచేశారు. కేంద్రం అన్నింటిపైనే జీఎస్టీ విధిస్తోందని మండిపడ్డారు. రైతులకు పంటలకు సరైన ధర రావడంలేదన్నారు. తెలంగాణలో భూమాఫియా భూములు దోచుకుంటోందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రైతులను ఆదుకుంటామని భరోసా కల్పించారు. రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని.. రైతులకు ఏటా రూ. 15 వేలు, రైతు కూలీలకు రూ. 12 వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. కనీస మద్దతు ధరపై గ్యారంటీ ఇచ్చారు.

తెలంగాణలో కేసీఆర్ 10 ఏళ్ల పాలనకు కాలం చెల్లిందన్నారు. ప్రజల ఆశలను బీఆర్ఎస్ ప్రభుత్వం నెరవేర్చలేదని విమర్శించారు. నిరుద్యోగంలో తెలంగాణ దేశంలోనే నెంబర్‌ వన్‌గా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం ప్రజల త్యాగాల వల్ల ఏర్పడిందని ప్రియాంక గాంధీ వివరించారు. ప్రాణత్యాగం చేసిన అమరుల ఆకాంక్షలు నెరవేరాయో లేదో ఆలోచించాలన్నారు. యువత సాధించుకున్న ఈ తెలంగాణలో ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయి? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు. మార్పురావాలి.. కాంగ్రెస్ రావాలి అని పిలుపునిచ్చారు. .

.

.

.

Related News

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Telangana in Debt Trap | తెలంగాణ ఆర్థిక పరిస్థితి దయనీయం.. రుణ వడ్డీల చెల్లింపులకే భారీగా ఖర్చు

Big Stories

×