BigTV English

Property dispute of Nizam’s heirs: నిజాం వారసుల ఆస్తి తగాద.. వ్యక్తిపై కేసు నమోదు

Property dispute of Nizam’s heirs: నిజాం వారసుల ఆస్తి తగాద.. వ్యక్తిపై కేసు నమోదు
Telangana news updates

Threats to Nizam’s heir(Telangana news updates): నిజాం వారసులకు సంబంధించిన ఆస్తులను కాజేసేందుకు ప్రయత్నిస్తున్న ఓ వ్యక్తిపై నిజాం మనవడు కేసు నమోదు చేశారు. సదరు వ్యక్తి తమను బెదిరింపులకు గురిచేస్తున్నారంటూ ఆయన కుటుంబసభ్యుడు ఇచ్చిన ఫిర్యాదుతో ఫిలింనగర్‌ పోలీసులు క్రిమినల్‌ కేసు నమోదు చేశారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మణికొండలోని డైమండ్ హిల్స్‌లో ఓ విల్లాలో నివాసం ఉంటున్న దిల్షాద్‌ ఝా ఏడో నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌కు మనవడు.


అదే వంశానికి చెందిన ప్రిన్స్‌ షామత్‌ అలీఖాన్‌ గత ఏడాది జూలైలో మరణించాడు. అతని ఇంట్లో సుమారు 15 ఏళ్లపాటు సయ్యద్‌ ఎజాజ్‌ ఖాద్రి అనే వ్వక్తి పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో సయ్యద్‌, ప్రిన్స్‌ షామత్‌ అలీఖాన్‌ ఆస్తులు కాజేసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. ప్రిన్స్‌ షామత్‌ అలీఖాన్‌ చనిపోకముందు కొన్ని పత్రాలపై సంతకాలు చేయించుకుని ఆస్తులు తనవే అని వాదిస్తునారన్నారు. అంతే కాకుండా తమపై తప్పుడు కేసులు పెట్టాడని దిల్షాద్‌ ఝా ఫిలింనగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

గత వారం సయ్యద్‌, తనను అడ్డగించి ఆస్తులకు సంబంధించి సెటిల్‌ చేసుకోవాలని గోడవకు దిగినట్లు దిల్షాద్ పేర్కోన్నారు. రూ.కోటి తీసుకొని సెటిల్ మెంట్ చేసుకోకపోతే అడ్డుతొలగించుకోవాల్సి ఉంటుందని బెదిరించాడంటూ వెల్లడించారు. ఈ క్రమంలో ఐపీసీ సెక్షన్ 3341,504,506 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు.


Tags

Related News

MLA Mallareddy: రాజకీయాలకు గుడ్ బై.. బిగ్ బాంబ్ పేల్చేసిన మల్లారెడ్డి.. అసలేమైంది..?

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Big Stories

×