BigTV English

Offer on Tata Nexon EV & Tiago EV: టాటా మోటార్స్ బంపరాఫర్.. ఎలక్ట్రిక్ కారుపై రూ.1.20 లక్షల భారీ తగ్గింపు!

Offer on Tata Nexon EV & Tiago EV: టాటా మోటార్స్ బంపరాఫర్.. ఎలక్ట్రిక్ కారుపై రూ.1.20 లక్షల భారీ తగ్గింపు!
Tata Nexon EV - Tiago EV

Rs 1 lakh 20,000 off on Tata Nexon EV and Tiago EV:ప్రముఖ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ ఫోర్-వీలర్ రంగంలో అగ్రస్థానంలో ఉంది. దీని పోర్ట్‌ఫోలియోలో టాటా నెక్సాన్ ఈవీ, టాటా టియాగో ఈవీ, టాటా టిగోర్, టాటా పంచ్ ఈవీలు ఉన్నాయి. ఇప్పుడు వీటిపై కంపెనీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తమ ఎలక్ట్రిక్ కార్లపై భారీ తగ్గింపును ప్రకటించింది. ఇందులో భాగంగానే తన నెక్సాన్ ఈవీ, టియాగో ఈవీ కార్ల ధరలను ఎవరూ ఊహించని విధంగా తగ్గించింది.


టియాగో ఈవీ కారుపై రూ.70 వేలు తగ్గించింది. దీంతో ఈ కారు రూ.7.99 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరతో అందుబాటులో ఉంది. అలాగే దీంతోపాటు టాటా నెక్సాన్ ఈవీ కారుపై దాదాపు రూ.1.20 లక్షలు తగ్గించి అందరినీ ఆశ్చర్యపరచింది. దీంతో ఈ కారు రూ.14.49 లక్షల (ఎక్స్-షోరూమ్)కు అందుబాటులో ఉంది. ఈ ఈవీ కారు లాంగ్ రేంజ్ వెర్షన్ ధర రూ.16.99 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి స్టార్ట్ అవుతుంది.

ఇక ఇవి కాకుండా ఇటీవల విడుదల చేసిన టాటా పంచ్ ఈవీ ధరలలో ఎలాంటి మార్పు లేదు. దీంతో ఇండియాలో ఎలక్ట్రిక్ కార్ల ధరలను తగ్గించి మొదటి కంపెనీగా టాటా మోటార్స్ నిలిచింది.


Read More: ఈ కార్లపై కళ్లుచెదిరే డిస్కౌంట్స్.. రూ.1.82 లక్షల వరకు.. ఫిబ్రవరి 29 చివరి తేదీ!

అయితే ఈ టాటా నెక్సాన్ ఈవీ.. క్రియేటివ్, ఫియర్‌లెస్, ఎంపవర్డ్ అనే మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఇందులో మీడియం వెర్షన్ సింగిల్ ఛార్జింగ్‌తో దాదాపు 325 కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది. అలాగే లాంగ్ రేంజ్ వెర్షన్ 465 కిలో మీటర్లు ప్రయాణిస్తుందని కంపెనీ చెబుతోంది.

ఇక టాటా టియాగో ఈవీ.. ఎక్స్ఈ, ఎక్స్‌టీ, ఎక్స్ జెడ్ ప్లస్, ఎక్స్ జెడ్ ప్లస్ లక్స్ వంటి నాలుగు వేరియంట్లలో లభిస్తున్నాయి. ఇందులో మీడియం రేంజ్ వేరియంట్‌కు ఒక్కసారి ఛార్జింగ్ పెడితే దాదాపు 250 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. అలాగే లాంగ్ వేరియంట్ 315 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది.

ఇటీవల ఎలక్ట్రిక్ కార్లలో బ్యాటరీ సెల్స్ ధరలు భారీ తగ్గాయి. ఈ తరుణంలోనే టాటా మోటార్స్ తన టియాగో ఈవీ, నెక్సాన్ ఈవీ మోడల్ కార్ల ధరలను తగ్గించింది.

Read More: ఎలక్ట్రిక్ కారుపై బంపరాఫర్.. ఏకంగా లక్ష రూపాయల డిస్కౌంట్.. త్వరపడండి!

అయితే ప్రస్తుతం దేశమంతా ఎలక్ట్రిక్ వాహనాల మీదే ఆసక్తి చూపించడంతో దేశ వ్యాప్తంగా వీటిని అందుబాటులో తీసుకోచ్చామని కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. అంతేకాకుండా ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లను మరింత పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పుకొచ్చారు.

Related News

Flipkart Scam: ఫ్లిప్‌కార్ట్‌ సేల్ అంతా స్కామ్.. సోషల్ మీడియాలో నెటిజెన్ల ఆగ్రహం

Gaming Phone: 16GB ర్యామ్, 120W ఛార్జింగ్ గల రియల్‌మి గేమింగ్ ఫోన్.. అమెజాన్ ఫెస్టివల్‌లో ₹18,000 ధర తగ్గింపు!

Galaxy S24 vs iPhone 16 Pro: గెలాక్సీ S24 అల్ట్రా vs ఐఫోన్ 16 ప్రో.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఆఫర్లతో ఏది బెస్ట్?

iPhone 17 Series 5G: ఐఫోన్ 17 సిరీస్ 5జి.. కొత్త ఫీచర్లతో టెక్ లవర్స్‌కి పెద్ద గిఫ్ట్

Apple Foldable iPhone: ఆపిల్ ఫోల్డెబుల్ ఫోన్ డిజైన్ లీక్.. అత్యంత ఖరీదైన ఐఫోన్ ఇధే

Samsung Galaxy S25 5G: వామ్మో.. ఏకంగా 200MP కెమేరానా.. మార్కెట్లోకి వచ్చేసిన సామ్‌సంగ్ గెలెక్సీ ఎస్25 5G

PS5 Big Discount: ప్లే స్టేషన్ 5పై భారీ తగ్గింపు.. ఇండియాలో మాత్రమే

Amazon Flipkart Iphones: అమెజాన్ ఫ్లిప్‌కార్ట్‌ ఫెస్టివల్ సేల్.. ఐఫోన్ 15, 16పై బెస్ట్ డీల్స్ ఇవే

Big Stories

×