E-Paper
Advertisement

బ్లాక్ కలర్‌కు గుడ్‌బై.. కొత్త లుక్‌తో 2027 కవాసకి వల్కన్ ఎస్ వచ్చేసింది!

బ్లాక్ కలర్‌కు గుడ్‌బై.. కొత్త లుక్‌తో 2027 కవాసకి వల్కన్ ఎస్ వచ్చేసింది!
Advertisement

2027 Kawasaki Vulcan S: కవాసకి ప్రీమియం క్రూయిజర్ బైక్ వల్కన్ ఎస్‌ ను 2027 మోడల్‌ గా అప్‌ డేట్ చేసింది. కొత్త వెర్షన్‌ లో భారీ మార్పులు చేయకుండా.. ఇంజిన్ టార్క్, బ్రేకింగ్ సిస్టమ్, కలర్ లాంటి కీలక అంశాల్లో మార్పులు చేసింది. ఈ అప్‌ డేట్ తర్వాత బైక్ ధర రూ.8.23 లక్షలుగా ప్రకటించింది. ఇది 2026 మోడల్ తో పోల్చితే రూ.10,000 ఎక్కువ. కొత్త వల్కన్ ఎస్ డెలివరీలు 2026 సెప్టెంబర్ మధ్య నుంచి ప్రారంభం కానున్నాయి.

ఇంజిన్ టార్క్ మరింత పెంపు!

2027 వల్కన్ ఎస్‌లో 649cc ప్యారలల్ ట్విన్ ఇంజిన్ కొనసాగుతోంది. అయితే, ఇంజిన్ టార్క్ విషయంలో కవాసకి కీలకమైన మార్పు చేసింది. 2026 మోడల్‌లో 1.4Nm తగ్గిన టార్క్‌ ను ఇప్పుడు తిరిగి పెంచింది. ప్రస్తుతం ఈ ఇంజిన్ గరిష్టంగా 61hp పవర్, 62.4Nm టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. పవర్‌ లో ఎలాంటి మార్పు లేదు. అలాగే పవర్, టార్క్ అందించే రెవల్యూషన్ రేంజ్ కూడా గతంలో మాదిరిగానే ఉంది. అంటే రోజువారీ ప్రయాణాలతో పాటు లాంగ్ రైడ్‌లకు ఉపయోగపడే ఇంజిన్ సెటప్‌ ను కొనసాగించింది.

 డిస్క్‌ సైజ్ లో మార్పులు

Advertisement

2027 మోడల్‌ లో మరో ఆసక్తికరమైన మార్పు బ్రేకింగ్ సిస్టమ్‌ లో కనిపిస్తుంది. ముందు, వెనుక డిస్క్ బ్రేక్‌లు కొనసాగుతున్నప్పటికీ వాటి రోటర్ పరిమాణాన్ని తగ్గించారు. ముందు భాగంలో 300mm డిస్క్ స్థానంలో 272mm రోటర్‌ను ఉపయోగించారు. వెనుక భాగంలో ఉన్న 250mm డిస్క్ స్థానంలో 216mm యూనిట్ వచ్చింది. అయితే డ్యూయల్ ఛానల్ ABS మాత్రం కొనసాగుతుంది. రైడర్‌కు అందించే ఎలక్ట్రానిక్ సేఫ్టీ ఫీచర్లలో కొత్తగా ఎలాంటి మార్పులు చేయలేదు.

సస్పెన్షన్, సీటు ఎత్తు అలాగే!

వల్కన్ ఎస్‌ లోని సస్పెన్షన్ సెటప్‌ ను కవాసకి యథాతథంగా ఉంచింది. ముందు 41mm ఫోర్క్ 130mm ట్రావెల్‌ ను అందిస్తుంది. వెనుక లింకేజ్ టైప్ మోనోషాక్ 80mm ట్రావెల్‌ తో వస్తుంది. ఇందులో ప్రీలోడ్ అడ్జస్ట్‌ మెంట్ సౌకర్యం ఉంది.  బైక్ సీటు ఎత్తు 705mmగా ఉండటంతో తక్కువ ఎత్తు ఉన్న రైడర్లకు కూడా సులభంగా అందుబాటులో ఉంటుంది. అయితే 130mm గ్రౌండ్ క్లియరెన్స్ పెద్దగా ఎక్కువ కాదు. బైక్ కర్బ్ బరువు 235 కిలోలుగానే కొనసాగుతోంది.

కొత్త కలర్‌ లో మాత్రమే లభ్యం

Advertisement

2027 వల్కన్ ఎస్‌లో కలర్ ఆప్షన్‌ లో కూడా మార్పు చేశారు. 2026 మోడల్‌ లో ఉన్న మెటాలిక్ ఫ్లాట్ స్పార్క్ బ్లాక్ స్థానంలో ఇప్పుడు మెటాలిక్ కార్బన్ గ్రే రంగును అందిస్తున్నారు. ఇందులో బ్లూ, గ్రీన్ హైలైట్స్ ఉండటం వల్ల బైక్‌ కు స్పెషల్ లుక్ వస్తుంది.

ధర ఎంత అంటే?

కొత్త మార్పులతో 2027 కవాసకి వల్కన్ ఎస్ ధరను రూ.8.23 లక్షలుగా నిర్ణయించారు. గత మోడల్‌తో పోలిస్తే రూ.10,000 పెరిగింది. ఈ మోడల్ తో రాయల్ ఎన్‌ఫీల్డ్ సూపర్ మీటియోర్ 650కు పోటీ ఇచ్చే అవకాశం ఉంటుంది. అయితే, దాని ధర రూ.4.05 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. రెండు బైక్‌ల మధ్య ధరలో మాత్రం భారీ వ్యత్యాసం ఉంది.

Read Also: చిన్న కారు.. పెద్ద రేంజ్.. భారత్‌ లోకి వస్తున్న కొత్త కాంపాక్ట్ ఈవీలివే!

Tags

Related News

స్పోర్టీ లుక్.. అదిరిపోయే స్పీడ్.. భారత్‌లో టాప్ 5 ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే!

చిన్న కారు.. పెద్ద రేంజ్.. భారత్‌ లోకి వస్తున్న కొత్త కాంపాక్ట్ ఈవీలివే!

2.7 సెకన్లలో 100 కిమీ స్పీడ్.. భారత్‌ లోకి అడుగు పెట్టబోతున్న BYD పవర్‌ఫుల్ ఎలక్ట్రిక్ కారు!

యాక్టివా To బర్గ్‌ మన్.. ఏథర్ కోనార్క్‌ కు పోటీ ఇచ్చే 6 స్కూటర్లు ఇవే!

హ్యుందాయ్ కొత్త SUV పేరు ఇదే.. త్వరలో మార్కెట్లోకి ఎంట్రీ!

మరోసారి పెరిగిన అమేజ్ ధర.. ఆటోమేటిక్ వేరియంట్‌పై భారీ పెంపు!

స్విఫ్ట్ ధర మళ్లీ పెరిగింది.. ఇప్పుడు రేటు ఎంతంటే?

Big Stories

Advertisement
×