Rahul Gandhi: కేంద్ర ప్రభుత్వం పై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో విద్యా వ్యవస్థ పూర్తిగా సంక్షోభంలో ఉందని ఫైర్ అయ్యారు. దేశంలో వరుసగా ప్రశ్నాపత్రాల లీకులతో విద్యార్థుల భవిష్యత్తు నాశనమవుతోందని తెలిపారు. గత 10 ఏళ్లలో దేశంలో ఎన్నడు లేని విధంగా 152 పరీక్షల ప్రశ్నాపత్రాల లీకులు జరిగాయని తెలిపారు.
దేశలో ఇప్పటికి 152 ప్రశ్నాపత్రాల లీకులు జరిగినా నేటికి ఏ ఒక్కరికీ కూడా శిక్ష పడలేదని తెలిపారు. అందుకుగాను ప్రస్ధుతం ఢిల్లీలో విద్యార్థులు ఎదుర్కొంటున్న ఆందోళన పూర్తిగా సమంజసమేనని అన్నారు. నీట్ పరీక్ష కోసం కుటుంబాలు ఏటా రూ.1.32 లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది కేంద్ర విద్యా బడ్జెట్‌కు దాదాపు సమానం అని అన్నారు. విద్య ఖరీదైంది. ఉద్యోగ అవకాశాలు కూడా తగ్గిపోయాయని అన్నారు.
Also read: Paddy Procurement: తెలంగాణ ప్రభుత్వానికి గుడ్ న్యూస్.. కేంద్రం గ్రీన్ సిగ్నల్..?
దేశంలో తయారీరంగం, ప్రైవేట్, ప్రభుత్వ రంగాల్లో అవకాశాలు తగ్గాయని అన్నారు. దీంతో ఇక ప్రభుత్వ ఉద్యోగాలే ఆశగా మారగా పరీక్షల వ్యవస్థ కూడా బీజేపీ దెబ్బతీస్తుందని అన్నారు. విద్యార్థుల ఆందోళనలకు కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఇచ్చిందని, ధర్మేంద్ర ప్రధాన్‌ను వెంటనే పదవి నుంచి తొలగించాలని రాహులం గాందీ డిమాండ్ చేస్తున్నామన్నారు. విద్యార్థులపై చర్యలకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని, ప్రధానమంత్రి విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.
విద్యార్థుల డిమాండ్లపై ఎలాంటి రాజీ ఉండదని రాహుల్ గాంధీ అన్నారు. ఇవి కాంగ్రెస్ డిమాండ్లు కాదు.. విద్యార్థుల డిమాండ్లు విద్యార్థులు రోడ్డెక్కితే ప్రతిపక్షం కూడా రోడ్డెక్కాల్సిందేనిన అన్నారు. ప్రధాని నివాసానికి వెళ్లింది విద్యార్థులకు మద్దతు తెలిపేందుకేనని, నా గురించి కాదు.. విద్యార్థులపై జరిగిన అన్యాయంపైనే చర్చ జరగాలని అన్నారు. నన్ను ఐదు రెట్లు ఎక్కువగా కొట్టినా నాకు అభ్యంతరం లేదు. కానీ ధర్మేంద్ర ప్రధాన్‌ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు.
విద్యార్థులపై దాడులకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని, ప్రధానమంత్రి విద్యార్థులకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మూడు డిమాండ్లపై రాజీ ప్రసక్తే లేదని రాహుల్ గాంధీ తేల్చి చెప్పారు. పార్లమెంట్లో చర్చకు ప్రభుత్వం ముందుకు రావటంలేదని, విద్యార్థుల ఉద్యమానికి కాంగ్రెస్ పార్టీ 100 శాతం మద్దతునిస్తుందని అన్నారు. విద్యార్థులు, యువత, రైతుల సమస్యలపై పోరాటం కొనసాగుతుందని, కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం తీవ్ర ఆందోళనలో ఉందని తెలిపారు.
Also read: Chinta Mohan: మోడీకి రాజ్యాంగం తెలీదు.. అమిత్ షా రాజ్యాంగం నడుస్తోంది! చింతా మోహన్ సంచలన కామెంట్స్