Spy Thriller on OTT: ఇటీవల వచ్చిన ‘దురంధర్’ సినిమా ఆడియన్స్ ను ఎంతగా మెప్పించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మన హీరో పాకిస్తాన్ వెళ్ళి, అక్కడి టెర్రరిస్టుల దుమ్ము ఎలా దులుపుతాడో చూసి పిచ్చెక్కిపోయాం కదా. అలాంటి మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో రూపొందిన స్పై థ్రిల్లర్ సిరీసే ‘ముఖ్బీర్ ది స్టోరీ ఆఫ్ ఎ స్పై’ (Mukhbir The Story of a Spy). దేశం కోసం తన గుర్తింపును, ప్రేమను, జీవితాన్ని త్యాగం చేసిన ఓ యువకుడి అద్భుతమైన కథను ఏ ఓటీటీలో చూడవచ్చు ? స్టోరీ ఏంటి ? అన్నది తెలుసుకుందాం పదండి.
1962 చైనా-భారత్ యుద్ధం తర్వాతి కాలంలో కథ మొదలవుతుంది. అప్పటికే భారతదేశ ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుంది. ఇదే సరైన సమయమని భావించి, పాకిస్తాన్ భారతదేశంపై రహస్యంగా దాడి చేయడానికి ప్లాన్ వేస్తుంది. ఈ ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టడానికి భారత ఇంటెలిజెన్స్ విభాగానికి బలమైన గూఢచార సమాచారం అవసరమవుతుంది. ఏజెంట్ ఎంపిక ఇక్కడే మొదలవుతుంది.
పాకిస్తాన్‌లో ఉన్న భారతీయ గూఢచారులు పట్టుబడటంతో, ఇండియన్ ఇంటెలిజెన్స్ అధికారి ఎస్.కె.ఎస్. మూర్తి ఒక కొత్త వ్యూహాన్ని ఆలోచిస్తాడు. ఏ తప్పు చేయడానికైనా వెనుకాడకుండా, మాటలతో నమ్మించగల కమ్రాన్ బక్ష్ అనే ఒక చిన్న స్థాయి దొంగని మూర్తి గూఢచారిగా ఎంపిక చేస్తాడు. కమ్రాన్‌కు కఠినమైన శిక్షణ ఇచ్చి, ‘హర్ఫాన్ బుఖారీ’ అనే కొత్త గుర్తింపుతో పాకిస్తాన్‌లోని లాహోర్‌కు పంపుతారు.
దేశ విభజన సమయంలో భారత్‌లో ఉండిపోయి, ఇప్పుడు తిరిగి వచ్చిన మేనల్లుడిగా ఒక పాకిస్తానీ కుటుంబంలో అతను ప్రవేశిస్తాడు. అక్కడ అతనికి సహాయకుడిగా ‘ఆలంగీర్’ అనే హ్యాండ్లర్ తోడుగా ఉంటాడు. హర్ఫాన్ తన తెలివితేటలతో పాకిస్తాన్ మిలిటరీ హైకమాండ్‌కు దగ్గరవుతాడు. ముఖ్యంగా పాక్ మేజర్ జనరల్ ఆగా ఖాన్ నమ్మకాన్ని, అతని ప్రియురాలైన గజల్ గాయని బేగం అనార్ సాన్నిహిత్యాన్ని పొందుతాడు. అలాగే జమీలా అనే స్థానిక జర్నలిస్ట్ కుమార్తెతో ప్రేమలో పడతాడు.
ఈ క్రమంలో బేగం అనార్‌ను చంపాల్సి వస్తుంది. ఆ తరువాత హర్ఫాన్ అందించిన కీలక సమాచారం వల్ల భారతదేశం 1965 యుద్ధంలో పాకిస్తాన్‌కు తగిన బుద్ధి చెప్పి విజయం సాధిస్తుంది. ఆ తర్వాత హర్ఫాన్ పరిస్థితి ఏమైంది ? అసలు అతను పాకిస్తాన్ అధికారుల నుంచి భారత్ పై ప్లాన్ కు సంబంధించి ఎలాంటి సమాచారాన్ని రాబట్టాడు ? అన్నది తెలియాలంటే ఈ సిరీస్ ను డోంట్ మిస్.
ఒక సాధారణ దొంగను గూఢచారిగా మార్చి, శత్రువుల గుండెల్లోకి పంపిన వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కిన స్పై థ్రిల్లర్ సిరీస్ ‘ముఖ్బీర్ ది స్టోరీ ఆఫ్ ఎ స్పై’. ZEE5లో తెలుగు డబ్బింగ్ ఆడియోతో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ 8 ఎపిసోడ్ల సిరీస్ ఇంటెలిజెన్స్ బ్యూరో రిటైర్డ్ జాయింట్ డైరెక్టర్ మలోయ్ కృష్ణ ధర్ రాసిన ‘మిషన్ టు పాకిస్తాన్’ నవల ఆధారంగా రూపొందింది. ఇంకా చూడకపోతే వెంటనే ఒక లుక్కేయండి.
Read Also: ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్